సుబ్బయ్య గారి హోటెల్.. గోదావరి జిల్లాలో ఈ హోటెల్ గురించి తెలియని భోజనప్రియులు ఉండరు. కాకినాడ వెళ్ళిన ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా అక్కడ భోజనం చెయ్యాలని తహతహలాడుతుంటారు. వాళ్ళు ఆప్యాయంగా వడ్డించే విధానానికే మన కడుపు సగం నిండిపోతుంది. ఇంక ఆ భోజనమైతే ఆహా!! ఆ ఘుమఘుమలాడే వంటల వాసనే మనకు జీవితాంతం గురుతుండిపోతుంది. ఏంటి.. నేను చాలా ఎక్కువ డబ్బా కొట్టేస్తున్నాను అనుకుంటున్నారా.. నిజమండీ బాబు.
ఈ మధ్యనే ఈ హోటెల్ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నూతనంగా ఒక బ్రాంచీ ఓపెన్ చేసింది. ఇక్కడి వంటలు రుచి చూడాలని ఎంతమంది ఉవ్విళ్ళూరుతున్నారో ఒకసారి చూసెయ్యండి..
ఇక్కడి బుట్ట భోజనం చాలా ఫేమస్ , కుదిరితే ఒకసారి ట్రై చెయ్యండి.
Image and Video source: Google & FB.