Meet Suhas A Ph.D Doctor & Successful Enterprenuer

Updated on
Meet Suhas A Ph.D Doctor &  Successful Enterprenuer

Startup కానీ మరే ఇతర Business అవ్వనివ్వండి, ఏ కంపెనీని ప్రారంభించాలన్నా మొదటగా కావాల్సింది Investment, Planning మొదలైనవేమి కాదు, "విజన్" కావాలి. అవును మిగిలినవన్నీ తర్వాతే!! సరిగ్గా చూడగలిగినవారే ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల కాలంలోనే మన కళ్లముందు ఇంత సక్సెస్ సాధించినవారు. నెల్లూరు జిల్లాకు చెందిన సుహాస్ గారు ఇలానే మార్కెట్ ను చూడగలిగారు. నాన్న 40 సంవత్సరాలుగా బట్టల వ్యాపారం చేస్తున్నారు, సుహాస్ గారు ఫార్మసీలో పిహెచ్.డి చేశారు. అయినా కానీ అటువైపుగా వెళ్లకుండా "ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్" వైపుకు వెళ్లి ప్రారంభించిన మొదటిరోజు నుండే లాభాలను అందుకున్నారు.

ఫార్మసీ లో పిహెచ్.డి: సుహాస్ గారికి చిన్నతనం నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గట్టుగానే చదువుకున్నారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. ఐతే సుహాస్ గారు ఓసి అవ్వడం వల్ల MBBS లో కాక బిడిఎస్ లో సీట్ వచ్చింది. బిడిఎస్ కన్నా ఫార్మసీ బాగుంటుందని నమ్మి 'PES కాలేజ్ ఆఫ్ ఫార్మసి(బెంగళూరు)లో ఫార్మసీ పూర్తిచేశారు, ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుండి పిహెచ్.డి డిగ్రీ అందుకుని ఇండియాకు వచ్చేశారు. తనతోపాటు ఫార్మసీ చదువుకున్న వారందరు కూడా విదేశాలలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. సుహాస్ గారి నాలెడ్జ్, క్వాలిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంటే ఇంటర్వ్యూ అవసరం లేకుండానే ఎక్కడైనా మూడు నాలుగు లక్షల జీతం అందుకునేవారు. చదువుకోవడం వరకు బాగానే జరిగింది కానీ ఉద్యోగం విషయానికి వచ్చేసరికి "ఒకరికింద జాబ్ చేస్తూ వారు చెప్పింది చేయడమనేది ఏ మాత్రమూ నచ్చలేదు, స్వతంత్ర భావాలున్న సుహాస్ గారికి ఉద్యోగంపై మనసు మళ్లలేదు". నా డబ్బు నేనే సంపాదించుకోవాలి, నాకు నచ్చిన సమయంలోనే రిటైర్మెంట్ తీసుకోవాలి, వీటి నుండే జీవితంలో తృప్తి ఉంటుందని ఆశించారు.

6 లక్షల పెట్టుబడి నుండి 13 కోట్ల టర్నోవర్: మొదట బిజినెస్ మొదలుపెడతానని అంటే అమ్మ నాన్నల దగ్గరి నుండి చాలామంది మిత్రులు వద్దనే సూచన ఇచ్చారు. సుహాస్ గారికి పర్ఫెక్ట్ విజన్ ఉండడం వల్ల అడుగులు తడబడలేదు. ఎప్పుడైతే బిజినెస్ ఆలోచన వచ్చిందో అప్పటి నుండే ఐస్ క్రీమ్ రంగంలో విపరీతమైన రీసెర్చ్ చేశారు. ప్రతి ఐస్ క్రీమ్ రుచి చేశారు, మిగిలిన ఐస్ క్రీమ్స్ కన్నా మన ప్రత్యేకత ఎలా చాటుకోవాలన్న తపనతో అన్నిరకాల ప్రయోగాలు చేశారు. ఈ స్ట్రాటజీ తర్వాతనే ఆరు లక్షల పెట్టుబడితో నవంబర్18, 2013న (సరిగ్గా నిన్నటిరోజున) నెల్లూరు సిటీలో "ఐస్ బర్గ్ ఐస్ క్రీం" ఓపెన్ అయ్యింది. ప్రారంభించిన మొదటిరోజే ఊహించిన దానికన్నా ఎక్కువ సేల్స్ అయ్యాయి, మూడు రోజుల్లోనే స్టాక్ అయిపోయి క్లోజ్ చేశారు. స్టాక్ అమ్ముడుపోక క్లోజ్ చేసే పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ భిన్నం. ఆ తర్వాత మూడు సంవత్సరాలలనే విజయవాడ, నెల్లూరు, బెంగళూరు లో 6 స్టోర్స్ ప్రారంభించారు.

ఇప్పటికి భారతదేశంలో చాలా చోట్ల నుండి ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ కావాలని ప్రతిరోజు 150 కాల్స్ వరకూ వస్తూ ఉంటాయి. అయితే సుహాస్ గారు ఎవరికి పడితే వారికి అస్సలు ఇవ్వరు. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ప్యాషనేట్ గా ఉన్నారా.? లేదంటే పై పైన చూసి అట్రాక్ట్ అయ్యారా అని పరిశీలిస్తుంటారు. అన్ని రకాల వడపోతలు జరిగిన తర్వాతనే అంగీకరిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం మూలంగానే ఒక్క 2019లోనే 14 షాప్స్ ఓపెన్ చేయగలిగారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, నోయిడా దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించి సంవత్సరానికి 13 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తుంది.

మన దేశం, మన బ్రాండ్: సుహాస్ గారి ఆలోచన ప్రకారం.. "మనదేశంలోని కంపెనీల బ్రాండ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి". భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. బయట కంపెనీల ప్రాంఛైజీ ఇండియాలో తీసుకుంటే వారికి 15% పైగా రాయల్టీ కట్టాల్సి ఉంటుంది. మన ఇండియన్ కంపెనీలు కనీసం 5% రాయల్టీ కూడా తీసుకోవడం లేదు. ఈ పద్దతి మారాలంటే మన భారతదేశంలోనూ మార్పు రావాలి. మిగిలిన దేశాలలో చికెన్ కు ఒక బ్రాండ్ ఉంది, బర్గర్స్ కు ఒక బ్రాండ్ ఉంది, పిజ్జా లకు ఒక బ్రాండ్ ఉంది, సాండ్ విచ్ కు ఒక బ్రాండ్ ఉంది. మనదేశంలో ఇప్పటికి అలాంటి బ్రాండ్ అంతగా వ్యాపించలేదు. కారణం ఒకరు ఒక ఫుడ్ ప్రోడక్ట్ లో సక్సెస్ ఐతే మిగిలినవారందరు అందులోకే రావడం వల్ల ఆ ప్రొడక్ట్ డిమాండ్ తగ్గిపోతుంది. ఫారెన్ లో పరిస్థితి ఇలా ఉండదు. ఒకరు ఒక రంగంలో బెస్ట్ అనిపించుకుంటే మిగిలిన వారు మరో రంగంలో బెస్ట్ అనిపించుకుంటారు. అందుకనే వారు ఫ్రాంచైజీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ప్రత్యేక పోటీ తత్వాన్ని ఆచరిస్తే కనుక సుహాస్ గారు చెప్పినట్టు మన ఇండియన్ కంపెనీల బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇదే కనుక జరిగితే రేప్పొద్దున మన సుబ్బయ్య గారి హోటల్ భోజనం, బాబాయ్ హోటల్ ఇడ్లి కూడా అమెరికన్, దుబాయ్ ఎయిర్ పోర్ట్ లోనూ చూసుకోవచ్చు.

For more details visit: https://www.icebergicecreams.com/.