Contributed by Krishna Prasad
సూర్యకాంతం ఈ పేరు విన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఎడమ చేతిని తిప్పుతూ, తన మాటలతో కోడలిని అడిపోసుకునే ఒక అత్త. వామ్మో ఇలాంటి అత్త ఏ కోడలికి ఉండకూడదు అనేలా తన నటనతో ఆ అత్త పాత్ర లకు జీవం పోశారు మన గుండమ్మత్త. ఏ నటుడు / నటికైన ఒక మంచి పాత్ర వస్తే అదే తరహా లో వున్న పాత్రలు మరికొన్ని చేస్తారు, మనకి కూడా చూసి చూసి కొన్ని రోజులకు విసుగు పుడుతుంది. కానీ సూర్యకాంతం గారి విషయంలో అలా జరగలేదు. అసలు అత్త అంటే ఆమె అనేలా, తను లేకపోతే డైరెక్టర్స్ మేము సినిమా చెయ్యలేం అనేంత పేరు పొందారు. మన తెలుగు వారికి తిరుగులేని అత్త అయ్యారు. తెలుగులో ఎన్నో పాత చిత్రాలని మళ్లీ తీస్తున్నా... గుండమ్మ కథ సినిమా నీ మాత్రం తియ్యకపోవటానికి ఒకే ఒక్క కారణం, సూర్యకాంతం గారు చేసిన గుండమ్మ పాత్రకు ప్రత్యామ్నయం లేకపోవటమే.
సినిమాలలో తన గయ్యాళితనంతో కోడలిని రాచి రంపాన పెట్టే ఈమె, బయట మాత్రం మహా మంచివారు ఎంతలా అంటే తను ఏ సినిమా చేసిన ఇంటి నుంచి భోజనం తెచ్చి సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ కొసరి కొసరి వడ్డించేంత... సుమారు 500 వందల సినిమాలతో అలరించిన మన గుండమ్మత్త మన తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు మనం మన గుండమ్మత్తవి ఎప్పుడు చూడని కొన్ని అరుదైన ఫోటోలు చూద్దాం...
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.
