ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం మన గతం, మనం చూసిన కలిసిన వ్యక్తులు.. కలిసిన వ్యక్తులను చూసి అనుకరించినా లేదంటే ఎదురైన సంఘటనలు సమస్యలకు తలవంచినా మనకంటూ మనం మిగలం. అలా కుమ్మరెడ్డి పల్లి గ్రామంలో పుట్టి పెరిగిన సుస్మిత అందరిని చూసింది గమనించింది కానీ ఎవ్వరిని అనుకరించలేదు. అందుకే తాను ఎదుగుతూ తనను తాను తెలుసుకుంది. అలా తెలుసుకోవడానికి గల ప్రధాన కారణం "ఆర్ట్".
నాగేశ్వరరావు గారు సుస్మిత డ్రాయింగ్ టీచర్. ఆయన మూడు ముని వేళ్ళ కింద సుకుమారంగా కదులుతున్న పెన్సిల్, ఆ పెన్సిల్ నుండి పురుడు పోసుకుంటున్న బొమ్మలను చూసి "డ్రాయింగ్" తో సుస్మిత ప్రేమలో పడిపోయారు. మిగిలిన వారిలానే చదువుకునేది, స్కూల్ కు వెళ్ళేది ఐతే మిగిలిన వారి నుండి తాను ప్రత్యేకం అని తెలియజేసింది ఆర్ట్. అమ్మ నాన్నల సపోర్ట్ కూడా ఉండడం మరి ముఖ్యంగా తనను తాను తెలియజేసింది కదా అందుకే వాటితో ఎక్కువ సమయం గడిపేవారు. చదువుల్లో వచ్చిన మార్కుల కన్నా, వేసిన బొమ్మకు వచ్చిన ప్రశంసలే సుస్మితకు అమిత సంతోషం. క్యాన్వాస్ మీద పెయింటింగ్, పెన్సిల్ చాక్ పీస్ తో మినియేట్యుర్స్, మైక్రో ఆర్ట్స్ చేసి మరింత ప్రయాణం కొనసాగించారు.

సుస్మిత దాదాపు 15 సంవత్సరాల నుండి "మంచి ఆర్టిస్ట్" అనిపించుకుంటున్నారు. దీనికి అఫీషియల్ గా అవార్డ్ వచ్చిందంటే మాత్రం 2018లో. ఫైన్ ఆర్ట్స్ లో మల్టీపుల్ టాలెంటెడ్ గా గుర్తించి SMF వారు "ప్రతిభా శిరోమణి" అవార్డ్ నిచ్చారు. త్వరలోనే గిన్నిస్ అవార్డ్ కు సిద్దమవుతున్న సుస్మిత ఆర్ట్ వర్క్ చూసేద్దాం రండి..
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.
