This Incident In Swami Vivekananda's Real Life Will Surely Inspire You

Updated on
This Incident In Swami Vivekananda's Real Life Will Surely Inspire You

పేరుకే రామకృష్ణ పరమహంస స్వామి వివేకనంద గురుశిష్యులు కాని వారి బంధం తండ్రి కొడుకుల బంధంలా ఉండేది. తన గురువు రామకృష్ణ పరమహంస మరణం తర్వాత ప్రపంచానికి శాంతిని అందించే కర్తవ్యం వారసత్వంగా స్వామి వివేకనందాకు లభించింది. ఈ లక్ష్యం మీద ఒకసారి Chicago లో జరుగుతున్న Parliament of the World's Religions(1893) Meetingకి వెళ్ళాల్సి వచ్చింది. ఇదే విషయంపై రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదమాత గారి అనుమతి తీసుకోవడానికై వెళ్ళారు. శ్రీ రామ కృష్ణ పరమహంస శారదమాత దంపతులు బ్రహ్మచర్యం పాటించడం మూలంగ వారికి సంతానం లేదు.. కాని వారి శిష్యులనే తమ సంతానంగా భావించి వారి పూర్తి బాధ్యతలు చూసుకునేవారు.

స్వామి వివేకనంద అక్కడికి చేరుకునేసరికి శారద మాత వంట చేయడానికి అవసరమయ్యే కూరగాయలను కత్తితో తరుగుతున్నారు. స్వామి వివేకనంద వినయంగా 'తల్లి నా గురువు పరమహంస గారి సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నేను అమెరికా వెళ్తున్నాను నాకు మీ అనుమతి కావాలి'. అప్పుడు శారదమాత కాసేపు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉండిపోయారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళి 'వివేక.. ఆ కత్తి తీసుకుని ఇలా ఒకసారి ఇవ్వు..! అని అన్నారు.

అప్పుడు స్వామి వివేకానంద సాధారణంగా కూరగాయలు కత్తిరించేటప్పుడు పట్టుకునే పిడిని కాకుండా కత్తిని తనవైపు పట్టుకుని కత్తి పిడిని శారదమాతకు అందించే విధంగా వివేకానందుడు ఇచ్చారు.. అలా అందించాక 'మీరు ఇంతకు ముందే కూరగాయలు తరిగారు మరల కత్తి ఎందుకు అని స్వామి ప్రశ్నించారు. అప్పుడు శారదమాత ఇలా చెప్పారు "పరమహంస గారు చనిపోయి సంవత్సరాలు గడిచింది ఇంకా నీలో ఆయన అందించిన జ్ఞానం ఏ స్థాయిలో ఉందో అని తెలుసుకోవడానికే ఇలా చేశాను నీ వల్ల ఇతరులకు ఏ హాని ఉండదు.. ఇక నువ్వు వెళ్ళవచ్చు" అని అన్నారు. ఈ చిన్న చర్యతో వివేకానంద వ్యక్తిత్వంపై శారదమాతకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది.

"ఒక తల్లి తన బిడ్డను ఎంత ప్రయోజికుడిని చేయాలో అని మాత్రమే కాదు ఆ బిడ్డ నుండి ఎదుటివారికి ఏ ఆపద కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా తనపై ఉంటుంది."

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.