జీవితం లో చదివిన చదువులు, కలిసిన మనుషులు, తిరిగిన ప్రదేశాలు, గడచిన కాలం ఎంత అయినా ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తె; ముందుగా మెదిలేది చిన్ననాటి స్నేహితులే. నిక్కర్లు వేసుకొని తిరిగిన రోజులు ఎప్పటికీ మరపురావు. అప్పుడు కలిసిన మనుషులు తిరిగి ఎప్పుడు కనిపించినా మన జీవితం లో ఒక భాగాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. కల్మషం లేని నవ్వు, కుతంత్రం లేని మనసు, వంచన తెలీని ఆలోచనలు ఉండే చిన్నతనం బడి చదువులలో మనకు జరిగిన సంఘటనలు చిన్ని చిన్ని వాక్యాల రూపం లో...
1. నేనొక్కడినే వెళ్తానా ఏంటి !!!
2. నువ్వైనా చెప్పొచ్చు కదరా పావురం అని !!!
3. పరీక్ష పెట్టిందే యాభై మార్కులకు కదరా !!
4. ముందు నువ్వు స్లో గా వెయ్యి బాలు !!
5. మాష్టారు చేత సమోసాలు తిన్నాడు తర్వాత !!!
6. రేయ్.. నీకు కాలు నొప్పి, వాడికి విరోచనాలు అని ముందే అనుకున్నాంగా !!!
7. నియ్యి మొత్తం ముందే తినేసి నాయి అడుగుతున్నావా మళ్ళీ !!
8. అసలు పస్టు గిల్లింది వాడు... వాడ్ని ఏం అనరేంటి మాష్టారూ !!
9. ఇంకో ఐదు నిమిషాలు ఉంది రా... ప్లీజ్ రా ఒక్క రౌండ్ వేసొస్తా !!
10. ఆడమాకు.. ఎవడు ఆడమన్నాడు నిన్ను... అది ట్రైల్ బాలే.. ఇప్పుడు రియల్స్ పో !!
మీ బాల్యాన్ని గుర్తుకుతెచ్చినట్టు అనిపిస్తే, మీ నిక్కర్ నేస్తాలకు షేర్ చేయటం మరిచిపోకండి !