"అరే! ఈ రోడ్లు ఏందిరా అయ్యా, గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు. మెంటలొస్తుంది ఈ రోడ్లమీద పోవాలంటే." "థూ! దీనమ్మ కంపు, ఇది రోడ్ ఆ, చెత్త కుండి నా. ఒక్కడికి కూడా దిమాగ్ ఉండదు ఎదవలకి." "స్వచ్ఛభారత్ అంటరు, మొక్కలు పెంచుతం అంటరు, అసలు ప్రభత్వం ఏం చేస్తుంది రా. ఏమైతున్నాయ్ మన డబ్బులన్నీ ?"
ఇలా రోజు బోలెడన్ని ప్రశ్నలు మన మనసులో రోజూ ఏదొక సంఘటన కారణంగా దాదాపు అందరికి మెదులుతూనే ఉంటాయి. కొద్దిమంది మైండ్ లో ఆ ప్రశ్న వయసు ఓ రెండు క్షణాలు, ఇలా వస్తుంది అలా వదిలేస్తారు. కొంతమంది మైండ్ లో ఆ ప్రశ్న వయసు కొన్ని సంవత్సరాలు, ప్రతీ రోజు వస్తూనే ఉంటుంది. ప్రశ్నకు సమాధానం వెతక్కుండా ఓ పక్కకి పడేస్తారు కొంతమంది, మరికొంతమంది(దాదాపు లక్షల్లో ఒకరికి) ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి అనిపిస్తుంది. అలా, సమాధానం కోసం వెతుకుతున్న అతి కొద్దిమంది సమాజ సేవకులలో ఒకళ్ళు ఈ POSE టీం.

ఈ టీం ను కూడా ఇలాంటి ప్రశ్నలు తొలిచేస్తుండేవి. సమాధానం కోసం కాకుండా, పరిష్కారం కోసం ప్రయత్నించారు. ప్రభుత్వం చేస్తుందిగా అని వదిలేయకుండా, మనకు తోచిన సాయం మనము చేద్దాం అన్నట్టు అడుగేశారు. రోడ్ల గుంతలు పూడ్చడం, చెత్త క్లీన్ చేయడం, సేవ్ వాటర్ మీద అవగాహన పెంచడం ఇలా చాలా చేశారు కానీ వాళ్లకు ఫలితం ఏమి కనిపించలేదు. ఈ రోజు పూడ్చిన గుంత ఎల్లుండికి మళ్ళీ యధా స్థితికి వచ్చేసింది, నిన్న క్లీన్ చేసి neatగా మార్చిన place ని కొత్త చెత్త occupy చేసేసింది, Save Water మీద అవగాహనా పెంచడానికి చెట్లను నరికి తయారు చేసిన paper ని వాడడంలో లాజిక్ miss అయ్యింది. ఇలా మండుతున్న పెనం మీద నీళ్లు చల్లితే వెంటనే ఆవిరైపోయినట్టు, ఇదే పని ఎన్ని రోజులు చేసిన ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఇలా ఒకటి అరా కాకుండా ఏదైనా పెద్దగా, ప్రయోజనం ఉండేలా చెయ్యాలని ఓ ఊరిని బాగుచేయాలని నిశ్చయించు కున్నారు.

హైదరాబాద్ కు సమీపంలోని ఓ గ్రామాన్ని ఎంచుకున్నారు. కిక్ 2 లో విలాస్ పూర్ అనే ఊరికి inspiration లా ఉంది ఆ ఊరు. కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవడం, గతుకుల రోడ్లు, బహిరంగ విసర్జన, ఆఖరికి అత్యవసర వైద్య సేవల వాహనానికే అర గంట దూరంలో ఉందా ఊరు. సింపుల్ గా హైదరాబాద్ కు అతి దగ్గరగా, అభివృద్ధికి అత్యంత దూరంగా, సమస్యలతో సావాసం చేస్తూ ఉంది. ఏం చేసినా ఆ ఊర్లో చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవడో వచ్చి ఎదో చేసేస్తాం అంటే మంచైనా సరే అంత సులువుగా ఒప్పుకోరు కదా జనం, వీళ్ళని మొదట ఎవరు నమ్మలేదు. మన ఆశయం గొప్పదైతే, సమస్త సృష్టి సాయం చేస్తుందన్నట్టు, ఒకరితో మొదలై ఊరంతా ఇప్పుడు వీళ్ళ వెనుక ఉన్నారు. అంతలా ఏం చేశారంటే...
గ్రామంలో పశువుల కోసం మంచి నీటి తొట్టిలు, మొక్కలు నాటడం, ఉచిత ఆరోగ్య శిభిరం, ఉచిత మందులతో, బహిరంగ విసర్జన పై అవగాహన సదస్సులు, మరుగుదొడ్ల ఏర్పాటుకు కృషిచేయడం, పిల్లలకు చదువు చెప్పడం, Science exhibitions, NIRD వారితో శిక్షణ తరగతులు నిర్వహించడం, ఆర్ధిక స్థితి బాగోలేని విద్యార్థులకు ఆర్ధిక సాయం చేయడం ఇలా ఆదర్శ గ్రామంగా ఆ ఊరిని మార్చడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు.

మొదట స్వచ్ఛత, ఆ తర్వాత నీటి సంరక్షణ, ఆ తర్వాత సరికొత్త వ్యవసాయ పద్ధతులు, వాటితో పాటు స్వయం సమృద్ధి సంఘాలు ఏర్పాటు చేయడం ఇలా ఓ ప్రణాళికతో పనిచేస్తున్నారు. ఊరి సమస్య ప్రతీ ఒక్కరి సమస్యగా, ఊరి అభివృద్ధి ప్రతి ఇంటి అభివృద్ధిగా, ఊరికి మంచి జరిగితే మనకే మంచి జరిగినట్టుగా, నేను, నా వాళ్ళు కాస్త మన ఊరు, మనాళ్ళుగా ప్రజల ఆలోచనలో మార్పు తెప్పించడం వీళ్ళు చేసిన అతిగొప్ప పని. ఇప్పుడు ఆ ఊరిలో సమస్య ఏదైనా ఊరంతా తోడుగా పరిష్కరించుకుంటారట. ఇప్పటికి చేసింది సినిమా లో టైటిల్స్ పడటమే, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది, చెయ్యాల్సింది చాలా ఉందని వీళ్ళ అభిప్రాయం. ఇంతకీ ఇదంతా చేసినది ఏ వయసు మళ్ళిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులో, న్యాయమూర్తులో, బాగా డబ్బున్న మారాజులో, కార్పొరేట్ కంపెనీలో కాదు... మనలానే అన్నిరకాల సమస్యలతో పోరాడుతూ, జీతం పైనే ఆధారపడి బతుకుతున్న మామూలు యువత. వీళ్ళు ఖర్చు చేసే ప్రతీ రూపాయి వీళ్ళ జేబుల్లో నుండి వెళ్ళినదే. చేయాలి అనే సంకల్పం ఉంటె ఏదైనా చేయొచ్చు అనే మాటకు వీల్లో నిదర్శనం. ఒక ఊరి గుండెల్లో అభివృద్ధి పూలు పూయిస్తున్న వీళ్ళు నిజమైన Achievers రా భాయ్.

మీరు కూడా వీళ్లకు ఏ విధంగా ఐనా సహాయ పడాలి అనుకుంటే... iamthepose@gmail.com కు మెయిల్ చేయండి, Facebook Page లో చూడండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.