(Suggestion Gouse Pasha)
ధనవంతులైన పిల్లలు కలలు కంటారు, పేద కుటుంబంలోని పిల్లలు కలలు కంటారు కాని ఇందులో ఎవరు ఎక్కువ విజయం సాధించే అవకాశం ఉంటుందో అందరికి తెలిసింది. అదేంటి టాలెంట్ ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు అని అంటే అది కేవలం 10% మాత్రమే.. ఆర్ధికంగా బలంగా లేకపోవడం వల్ల ఎందరో పిల్లలు తమ కలను త్యాగం చేసి దొరికిన పనిని చూసుకుంటున్నారు.. మిగిలిన సామాన్యులందరి కన్నా ప్రభుత్వానికి, అధికారులకు పేద పిల్లల భవిషత్తును బంగారుమయంగా మార్చే శక్తి ఎక్కువ ఉంది.. అలా తన శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ ఐ.పి.ఎస్ గారు.. దేశం ఎలాంటి శక్తివంతమైన నిజమైన అధికారిని కోరుకుంటుందో అలాంటి అధికారి ఆయన. తెలంగాణ సాంఘీక గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా కార్పోరేట్ స్కూల్స్ కి ధీటుగా మన గురుకుల విద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఎంతోమంది పిల్లల కలలను నెరవేర్చడానికి బలమైన పునాధి అందిస్తున్నారు.
Working Strategy: మన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత సోమరితనం మరెక్కడా ఉండదేమో.. వారే కనుక నిజాయితీగా వ్యవహరిస్తే ఈరోజు మనదేశం ఇలా ఉండేది కాదు.. ఒక అధికారి 50% పనిచేస్తే అతని కింది స్థాయి వారు 30% చేస్తారేమో కాని ప్రవీణ్ కుమార్ గారు 100% నిజాయితీగా పనిచేస్తూనే తమ సిబ్బందిని కూడా దాదాపు అంతే స్థాయిలో పనిచేసేలా వ్యవహరిస్తారు. సాంఘీక గురుకుల విద్యాలయాలకు బాధ్యతలు తీసుకోక ముందు అక్కడ ఎన్నో లోపాలుండేవి. వాటిని పరిష్కరించడానికి ఆఫీస్ లో కూర్చుని పనిచేయలేదు.. క్షేత్ర స్థాయిలో లోపాలు తెలుసుకోవడానికి 6 నెలల పాటు ఊళ్ళల్లో పర్యటించి, సమస్యలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని, వాటికి సరైన పరిష్కారలను తోటి అధికారులు, ప్రజల సహకారంతో కనుగొన్నారు.
P5 Policy For Better Education: విద్యాలయాలలో పిల్లలకు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ గారు ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టారు అదే పి5(five point program). ఇందులో మెదటిది విద్యాలయాలలోని ఉపాద్యాయుల ప్రతిభను పెంచడం, 2. విద్యార్ధుల మీద ఏ ఒత్తిడి లేకుండా పూర్తి స్వేచ్చను ఇవ్వడం, 3. కాంపిటీటివ్ నెస్ పెంచడం, 4. టెక్నాలజీ ఉపయోగించడం.. (రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో బెస్ట్ Infrastructure అందించి, ప్రతి క్లాస్ లో కెమెరా అమర్చి టీచింగ్ ఎలా జరుగుతుందో అని గమనించడం కూడా ప్రవేశపెట్టారు .5. తల్లిదండ్రలను కూడా ఎడ్యుకేట్ చేయడం. అది ఎంత పెద్ద స్కూల్ ఐనా కాని ఇంటిని ఒదలిపెట్టి ఉండాలంటే చాలా బాధ పిల్లలలో ఉంటుంది కాని సాంఘీక గురుకుల విద్యాలయాలలో చదువుకుంటున్న పిల్లలకు మాత్రం తాము ఇంట్లోనే ఉన్నామన్న భావన వారిలో కలుగుతుంది.. టీచర్స్, అక్కడ పనిచేసే వారందరిలో ఆప్యాయత నిండి ఉండడమంతో ఇది సాధ్యమవుతుంది.
ఎవరికి ఏ అవసరం ఉంది.? గురుకుల పాఠశాలలో సాధారణంగా అందరూ పేదవారే ఉంటారు అందులోను ఎక్కువ మంది బుక్కెడు బువ్వ కూడా కష్టంగా దొరికే కటిక పేదవారు.. అలాంటి వారికి ఇక్కడ భోజనం పెట్టడమే ఎక్కువ అనే రోజుల నుండి ఈరోజు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంటున్నారు ఇక్కడి పిల్లలు.. మాములుగా ఉద్యోగం చేసుకుంటు పోతే చాలు జీతం వచ్చేస్తుంది.. అవసరం అనుకుంటే జీతం కన్నా ఎక్కువగా అవినీతి డబ్బును సంపాదించవచ్చు కాని ప్రవీణ్ గారి సంకల్పం స్వార్ధమైనది కాదు.! ఎవరో వస్తారు ఏదో చేస్తారు దేశం మారబోతుంది అని ఆశతో ఎదురుచూసే వారికి అతనే సూర్యుడు.. అతనే వారికి చీకటిలో వెలుగు నిచ్చే కాగడ.. అతనే రాళ్ళు, ముళ్ళ నుండి కాపాడే పాదరక్షలు..