వేణు గోపాల్ ది చాలా పేద కుటుంబం, మన హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నివాసం. చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్ లో ఐనా ఇతర అవసరాల కోసం పేపర్ బాయ్ గా, ఇంకా చిన్నచిన్న పనులు చేస్తూ బ్రతుకు పోరాటంలో రాటుదేలడం నేర్చుకున్నాడు. వేణుకి చిన్నప్పటి నుండే బొమ్మలు గీయడం అలవాటు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక Bachelor Of Fine Arts పూర్తిచేసి తన హబీనే జీవన ఉపాధిగా మార్చుకోవాలని కలలుకన్నాడు. అనుకున్నట్టుగానే BFA పూర్తిచేసారు, కాని అందరిలా రంగులద్ది బొమ్మలు గీస్తే తనకంటూ ప్రత్యేకంగా ఏ గుర్తింపు ఉండదు "ఏదైనా కొత్తగా తన కళను ప్రదర్శించాలి, అప్పుడే నా(వేణు) ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మరి అందుకోసం ఏంచేద్దాం అన్నప్పుడు అతనికి "సాండ్ ఆర్ట్" కనిపించింది". సరిగ్గా ఉపయోగించుకుంటే Internet మనకు Food పెడుతుంది, లేకుంటే సర్వనాశనం చేస్తుంది.. వేణు ఇంటర్నెట్ ను సరిగ్గా ఉపయోగించుకున్నారు. యూట్యూబ్ వీడియోలలో Sand Art గురించి నిశితంగా పరిశీలించి ఈ కళలో గొప్ప ప్రావీణ్యం కోసం విపరీతంగా కష్టపడి, ఈరోజు దేశం గర్వించేంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చి తన కృషి పట్టుదలకున్న శక్తి నిరుపించిన వేణు 'మనదేశంలో ప్రధాని నరేంద్రమోది గారితో పాటు, 24దేశాల ప్రతినిధుల ముందు, మలేషియన్ ప్రెసిడెంట్ ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తుల ముందు ప్రదర్శనలిచ్చి వారిని సంబ్రమశ్చర్యాలకు గురిచేసారు'. సాధారణంగా కళ్ళు తెరిచి చూస్తు బొమ్మలు వేస్తేనే అత్యంత కష్టంగా ఉంటుంది కాని వేణు మాత్రం దాదాపు 9 గంటలపాటు కళ్ళకు గంతలు కట్టుకుని ఇసుకతో 13 చిత్రాలు గీసి ఇండియాలో ఒక చరిత్ర సృష్టించాడు. తెలుగు బుక్ ఆఫ్ రికార్ఢ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఎన్నో అవార్ఢులు 30సంవత్సరాలు దాటని వేణు సాధించాడు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల సమస్యలు, అమ్మ ప్రేమ లాంటివెన్నో ఒక్క ఫ్రేమ్ లో కాకుండా ఒక పుస్తకంలా ప్రదర్శించిన తీరు ఒక అద్భుతం. ఈ వీడియోలు చూస్తే వేణు ప్రతిభ ఏపాటిదో మీకు కూడా తెలుస్తుంది.
Telangana History
Nirbhaya Incident
Eco Friendly Ganesha
Indian Freedom Fighters
Mother's Love
Telangana Bathukamma
Abdul Kalam Gaaru
Global Warming
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.