Article Info Source: Etv
2011 జనాభా లెక్కల ప్రకారం మన తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత కేవలం 66.46% మాత్రమే ఉంది. ఇందులో పురుషులు 74.95% ఉంటే మహిళలు 57.92% మాత్రమే చదువుకున్న వారు ఉన్నారు.
మనం బస్ స్టాండ్ లో కాని రైల్వే స్టేషన్ లో కాని ఎంతో మంది పెద్దవారిని చూస్తుంటాం 'బాబు ఈ బస్సు ఫలాన ఊరు వెళ్తుందా/ ఈ నెంబర్ కు ఫోన్ కలపవా మా కొడుకుతో మాట్లాడాలి..' ఇలా చదువురాని ఎంతోమంది పెద్దవారిని చూస్తుంటాం.. వారి అజ్ణానాన్ని చూసి జాలిపడతాం.. తరువాత ఎవరి పనులలో వాళ్ళు పడిపోతాం. మనందరిలా ఆ వ్యక్తి ఆలోచించలేదు. ప్రధాన మంత్రి సంసద్ గ్రామ యోజన కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లా బాకారం గ్రామాన్ని దత్తత తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.వి రమణాచారి అద్వర్యంలో "గ్రామ అభివృద్ధితో పాటు, వేలమంది గ్రామ ప్రజలలో ఉన్న నిరక్షరాస్యులందరికి చదువు నేర్పించి 100 రోజులలో 100% అక్షరాస్యతను సాధించారు."
అందరికి చదువు నేర్పించాలి అన్న ఆశతో ఇక్కడికి వచ్చిన మహిళా విద్య వాలెంటర్లకు మొదట నిరాశే ఎదురైంది..! పొలంలో వ్యవసాయం కూలి పనులు చేసుకునేవారి దగ్గరికి వెళ్ళి మేము మీకు చదువు చెబుతాం అంటే నవ్వి.. "ఈ వయసులో మకేందుకమ్మా చదువు ఉద్యోగం చేస్తామా ఏంటి అని తీసిపారేశారు" కాని వాలెంటర్లు చదువు వల్ల ప్రతి ఉపయోగం ఓపికతో వివరించారు మొదట వాలెంటర్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారితో పనులుచేస్తు అక్షరాలు నేర్పించేవారు.. క్రమంగా గ్రామంలో చదువుపై ఆసక్తి పెరగడంతో ప్రజలే వాలెంటర్ల వద్దకు వెళ్ళి శ్రద్ధగా చదువుకున్నారు. ఇలా ఉదయం 7:30నుండి రాత్రి 9 వరకు పాఠాలు నేర్పించేవారు.
ఆ ఆసక్తే వారికి అక్షరాలు నేర్పించింది.. వేలిముద్ర వేసే ప్రతి ఒక్కరు ఇప్పుడు సంతకం చేస్తున్నారు, ఎదురుగా బస్ వస్తే ఎవ్వరిని బ్రతిమలాడకుండా బోర్ఢు మీదున్న ఊరుపేరు తెలుసుకొని బస్సేక్కుతున్నారు, రేషన్ కోసం, బ్యాంక్ లలో ఎదుర్కున్న ఇబ్బందులంతా ఇప్పుడు మాయమైపోయాయి.. ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఇదంతా సాధించింది కేవలం 100రోజులలో.. 100రోజులలో 100% అక్షరాస్యత సాధించిన ఈ గ్రామాన్ని భారత కేంద్ర ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రపతి చేతుల మీదుగా ఆదర్శ గ్రామంగా అవార్ఢు అందుకున్నారు(8-09-2016).
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.