తండ్రి ఒక సాధారణ టైలర్.. అరకొర రాబడి.. మొత్తం ఎడుగురు అన్నదమ్ములలో ఆవుల అనిల్ కుమార్ నాల్గొవ వాడు.. నిరుపేద కుటుంబం.. నిత్యం ఏవో సమస్యలు.. చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. కాని మహబుబ్ నగర్ జిల్లా కొడంగల్ పుట్టిన ఈ యువ శాస్త్రవేత్త భారతదేశ ప్రధాన సమస్యను తీర్చుతున్నాడు. అనిల్ చిన్ననాటి నుండి చదువులో ఉన్నతుడు, ఇంటర్మీడియట్ లో కాలేజి టాపర్ గా నిలిచాడు, డిగ్రీ చదువుతున్నప్పుడే శాస్త్రవేత్త కావాలని నిశ్ఛయించుకున్నాడు. ఆ నిశ్ఛయంతో కఠోర శ్రమతో Indian Institute Of Science కోసం ప్రవేశ పరీక్ష రాసి మూడేళ్ళ ప్రాజెక్టుకు అనిల్ ఎంపికయ్యాడు.. సచిన్ టెండుల్కర్ తో పాటు భారతరత్నను అందుకున్న గొప్ప శాస్త్రవేత్త CNR Rao దగ్గర పనిచేసే అవకాశం అనిల్ కు లభించింది. వజ్రాన్ని సానబెడితే మరింత వెలుగునిస్తుంది అలాగే CNR Rao శిష్యరికంలో అనిల్ రాటుదేలాడు.. మద్రాస్ ఐఐటిలో ప్రవేశం వచ్చేనాటికే నానో టెక్నాలజీతో కలుషిత నీటిని శుభ్రపరిచేందుకు యంత్రాలను తయారుచేసే పరిశోధనలు జరుగుతున్నాయి అనిల్ కు నీటిలోని అర్సెనిక్, ఇనుము, బ్రోమియం, మాంగనీస్ లాంటి లోహాలను తొలగించే పరిశోధన ప్రక్రియను పూర్తిచేశాడు..

ఇప్పుడు ప్రపంచమంతా ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య 'నీరు' మన దేశ రాష్ట్రాల మధ్య కూడా నిత్యం ఏవో గొడవలు ప్రతి సంవత్సరం కలుషిత మంచినీరు తాగి ఎన్నో వేలమంది చనిపోతున్నారు కోట్ల మందికి కనిస స్థాయిలో మంచి నీరు అందటం లేదు ఈ సమస్యకు పరిష్కారంగా అనిల్ ఇంకా సహచర బృందం కలిసి 'అమృత్' అనే ప్రోటోటైప్ యంత్రాన్ని తయారు చేశారు నీటిలో ఉన్న అన్నిరకాల సూక్ష్మ మలినాలను ఈ యంత్రం తీసివేసి కేవలం మూడు పైసలతోనే లీటర్ స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది..మొదటగా ప్రయోగాత్మకంగా పశ్చిమ బెంగాల్ లో వీటిని ఏర్పాటుచేశారు ఇక్కడి నీటిలో అత్యధికంగా ఉండే ఆర్సెనిక్ క్యాన్సర్, కిడ్ని Problems లాంటి ప్రాణపాయ వ్యాదులను కలుగజేస్తుంది. అనిల్ బృందం ఏర్పాటు చేసిన 'అమృత్' యంత్రంతో అక్కడివారికి శుద్ధమైన నీరు తాగుతున్నారు. మొదట 500 ప్రాంతాలలో ఏర్పాటు చేశారు తర్వాత బిహార్, అసోం, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో ఈ నానో టెక్నాలజీని వాడుతున్నారు ఇప్పుడు కేవలం మనదేశంలోనే కాదు జర్మనీ, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాల వారు ఈ అమృత్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. మన తెలంగాణ వాసి ఐన అనిల్ నేడు దేశానికే గర్వంగా నిలవడం మన తెలుగు వారందరికి గర్వకారణం.