Contributed by Vanaja Chowdary
తెలుగు అంటే గోంగూర... తెలుగు అంటే గొబ్బిల్లు... తెలుగు అంటే గోదారి.. తెలుగు అంట్ చేతికి పెట్టిన గోరింట... అంటూ సినిమా పాటలు పాడుకుంటారు. తెలుగు మన మాతృ భాష మనం చిన్నపుడు చదువుకునే సబ్జెక్ట్. తెలుగులో ఎన్నో పద్యాలు పాటలు కథలు ఉన్నాయి ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. 90's పిల్లల తెలుగు సబ్జెక్ అంటే తెలుగు textbook లో చాలా పద్యాలు పాటలు గమ్మత్తుగ ఉస్తాహ పరిచే విధంగా ఉండేవి ఆహ్ కథలు. ఉదాహరణకు : 'రింగు రింగు బిళ్ల రూపాయి దండ దండ కాదురా తామర మొగ్గ మొగ్గ కాదురా మోదుగ నీడ నీడ కాదురా నిమ్మల బావి బావి కాదురా బచల కూర' ఇలా సరదాగా పాడుకునే వాళ్ళు. 'రెక్కల ఏనుగు' ఇలాంటి కథలు ఉండేవి, పొడుపు కధలు చాలా ఉండేవి. నేటి కాలం లో తెలుగు textbook లో అంత చమత్కారం గా అంత సరదాగా ఉండటం లేదు సంతోషం కలిగించే పాటలు ఆసక్తి గా చదివే పద్యాలు ఏమి రావటం లేదు. కాలం మారినా కవిత్వం మారకూడదు... కవిత్వం అంటే ఒకప్పుడు రాసిన పద్యాలు కథలు లు అవే నేటి తరం పిల్లలకి తెలియట్లేదు వాటి గొప్పతనం గురించి ముందు తారల పిల్లలకి అందించాలి అంటే నేటి తరం పిల్లల పుస్తకాల్లో ఉండాలి. వాటిని అందించడం వలన కేవలం కవిత్వం మాత్రమే బ్రతకదు, వారి రచనల్లో ఉన్న భావం అందుతుంది. రామాయణ మహభారతాలు లో నీతి ప్రజలకి ఏవిధంగా చేరువవుతుందో పిల్లలకి జీవితం లో మంచి చెడులు తెలివి తేటలు అన్ని ఈ పద్యాలు కథలు వల్ల కలుగుతాయి. నాటి రచనల్లో కనిపించే కవిత్వ పోలికలు చాలా బాగుంటాయి. అంతే కాదు పద్యాలు కథలు పొడుపు కధలు చదవటం వల్ల పిల్ల మేధస్సు పెరుగుతుంది పిల్లల మెదడు లో కొత్త ఆలోచనలు తొలస్తయి. తెలుగు లో ఒక గమ్మత్తు ఉంటుంది అది ఈ తరం వాళ్ళకి ఎంత మందికి తెలుసు, ఎంత మంది తెలుగు లో స్పష్టం గా మాట్లాడుతున్నారు??? 'దేశ భాషలందు తెలుగు లెస్స' 'తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి' 'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' ఎలాంటి వాక్యాలు చదవడమే కాకుండా రోజూ వాడుకలో కూడా ఉపయోగిస్తారు ఎంత బాగుంటుందో.... కాని ఈరోజుల్లో ఎవరు వీటిని గుర్తు చేసుకోవడం లేదు ఆహ English భాష మాట్లాడే వాళ్ళే ఎక్కువ అయ్యారు ఇంగ్లీష్ మాట్లాడ వద్దు అనటం లేదు తెలుగు నీ మరిచిపోవద్దు అని గుర్తుచేస్తున్నారు అంతే. తెలుగు బుక్స్ లో అన్ని మారిపోయాయి స్వతంత్ర పోరాటం లో ఉన్న వారి గురించి కాదు నన్నయ ఎర్రన తిక్కన అని మన టెక్స్ట బుక్స్ లో ఉన్నారు కాని కనీసం వల్ల పేర్లు కూడా కనిపించటం లేదు ఈరోజు పుస్తకాల్లో కనిపించట్లేదు నీతి కథలు ఎంత అవరసమో తెలుగు ఉట్టి పడే రచనలు కూడా ఉండటం చాలా అవసరం. నా చిన్నపుడు తెలుగు వ్యాస రచన పోటీలు ఉండేవి కాని ఇప్పుడు అవి ఇంగ్లీష్ వ్యాస రచన అయ్యింది కనీసం తెలుగు లో వ్యాసం రాయటం కూడా కరువు అయిపోయింది. చిన్నపుడు తెలుగు పద్యాల పోటీ ఉండేది ఎంత బాగుంటుందో పద్యాలు అన్ని కంఠస్థం చేసి చక చకా నేర్చుకునే వాళ్ళం. తెలుగు పద్యాల వల్ల పిల్లల మెదడు కు చిన్నప్పటి నుంచీ చురుకుతనం పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగు లో పద్యాలు నేర్చుకుని తెలుగు లో రాయటం చదవటం బాగా వచ్చిన పిల్లలే క్లాస్ topper అవుతారు . ఇప్పటికే తెలుగుని ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నారు తరావత తెలుగు లో రాయటం మర్చిపోతారు అని భయం బాధలు ఉన్నాయి ఎలాగో తెలుగు మీడియం ఏ లేదు కనీసం తెలుగు సిబ్జక్ అయిన పూర్తి స్తాయి లో ఉండాలి అని కోరుకుంటున్నా. చిన్నపిల్లలు 1-5 తరగతి వాళ్ళకి అయిన పూర్తి స్తాయి లో తెలుగు నేర్పించాలి కనీసం తెలుగు లో రాయటం చదవటం, తప్పులు లేకుండా మాట్లాడాలి. కొత్తవి కాకపోయినా కనీసం పాత అణిముత్యాలు ఉండాలి.