మన భారతదేశ సంప్రదాయ శాస్త్రీయ సంగీతంలో హిందుస్థానీ,కర్ణాటక సంగీతాలని రెండు ప్రధాన స్రవంతులున్నాయి. హిందుస్థానీ ఉత్తర భారత దేశంలో ప్రాచుర్యం పొందితే కర్ణాటక సంగీతం ఎన్నో ఏల్లుగా దక్షిణ భారతీయులను అలరిస్తూ వస్తుంది.కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావించే శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామి ఈ శాస్త్రీయ సంగీతాన్ని వైభవోపేతం చేశారు... మన తెలుగు వాడైన త్యాగరాజును స్మరించుకుంటూ తమిళ నాట తిరువయ్యూర్ లో, ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెలుగులో విరచించిన కృతులను ఎందరో కళాకారులు గానం చేస్తుంటే తెలుగు వారందరూ పరవశించి పోతారు..నిజంగా మనమంతా గర్వపడాల్సిన విషయం అది..
రామదాసు, అన్నమాచార్యులు, త్యాగరాజ స్వామి వారి వారి కాలాలలో కర్ణాటక సంగీతం లో కీర్తనలు చేసి చిరస్మరనీయులయ్యారు...
ఆ తర్వాత ఈ కాలంలో ఆ మహానుభావుల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేస్తున్నారు మన తెలుగు వారు...మహా విద్వాంసులు బాలమురలీ కృష్ణ నుంచి ప్రియ సిస్టర్స్ వరకూ..వారిలో కొందరు