జ్ఞానపీఠ్..దేశంలో సాహిత్య విభాగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం..1961 నుంచి ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు, ఇప్పటికి 54 మంది జ్ఞానపీఠ్ అవార్డును కైవసం చేసుకున్నారు..ప్రతీ ఏటా దేశంలో ఎందరో రచయితలు వేలాది రచనలు చేస్తుంటారు.. అయితే వీటిలో అత్యుత్తమ సాహిత్యానికే ఈ గౌరవం దక్కుతుంది. ..భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ వారు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తున్నారు,విజేతకు 7 లక్షల రూపాయల నగదు బహుమతి గా ఇస్తారు..ఇప్పటి వరకూ మన తెలుగు వారు ముగ్గురు ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను గెలుచుకున్నారు...
విశ్వనాథ సత్యనారాయణ.(1970)
ఈయన కవిసామ్రాట్ బిరుదాంకితుడు,ఆయన రాసిన "రామాయణ కల్పవృక్షం" అనే పద్యకావ్యానికి గాను 1971 లో ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 20 వ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా సాంప్రదాయ సాహిత్యానికీ పెద్ద దిక్కుగా నిలిచారు... కేంద్ర ప్రభుత్వం ఆయన ను పద్మభూషన్ తో సత్కరించింది..శ్రీ శ్రీ ఆయనను మాట్లాడే వెన్నుముక అని అభివర్ణించారు...ఆయన రాసిన "వేయపడగలు" తెలుగు లో ఆత్యంత విశిష్ట రచనలలో ఒకటి గా నిలిచింది...
సి.నారాయణ రెడ్డి.(1988)
1988 లో సి.నారాయణ రెడ్డి రాసిన "విశ్వంభర" కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారానికి ఎన్నికయ్యారు...ఆయన ఎన్నో తెలుగు చిత్రాలకు అద్బుతమైన పాటలు రాసారు.సి.నా.రె రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు..ప్రకృతి నేపథ్యంలో సాగే విశ్వంభర హిందీ, ఆంగ్ల భాష లో కూడా అనువాదమైంది.భారత ప్రభుత్వం ఆయనను పద్మ శ్రీ, పద్మభూషన్ బిరుదు లతో గౌరవించింది.
రావూరి భరద్వాజ.(2012)
రావూరి భరద్వాజ తెలుగు లో ఎన్నో లఘుకధలను,నవలలనూ రచించారు.. ఆయన రాసిన "జీవన సమరం" ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చపెట్టింది...సినీ పరిశ్రమ నేపథ్యంలో ఆయన రాసిన "పాకుడు రాళ్ళు"కు గాను ఆయన జ్ఞానపీఠాన్ని.గెలుచుకున్నారు,చివరి వరకూ కూడా అత్యంత నిరాడంభరమైన జీవితాన్ని గడిపారు..."రామాయణ కల్పవృక్షం","విశ్వంభర" పద్యకావ్యాలైతే ఇది నవల కావడం విశేషం.. మూడేల్ల పాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్ళ పై శ్రీ కృష్ణ దేవరాయ,శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాలలో పరిశోధనలు కూడా జరిగాయి..


