Contributed by Naga Chetan
"నీది నాది ఒకటే కథ" ఈ కాలం లో ఎన్నో ప్రశంసలు అందుకున్న చిత్రం. నేటి యువత పడుతున్న అంతర్మదనం గురించి వివరించిన చిత్రం. సినిమా అంత మన దేశం లోని తల్లితండ్రుల యొక్క ఆలోచన విధానాలని ప్రశ్నించే అంశాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా ఒక సన్నివేశంలో "ప్రపంచంలోని చాల దేశాలలో పిల్లలు ఆనందంగా వుంటే చాలు అనుకుంటారు కాని మన దేశంలోనే స్థిరపడలి డబ్బు సంపాదించాలి" అనే డైలాగ్ గమ్యం కోసం తపన పడే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో కూడా ఈ అంశం ఫై ఎన్నో చర్చలు కూడా జరిగాయి.ఎంతో మంది ఈ సినిమా ని వాళ్ళ పేరెంట్స్ కి చూపించి వాళ్ళు పడుతున్న వ్యధ చెప్పకనే చెప్పారు. అల చూపించిన వాళ్ళలో నేను ఒక్కడినే. కాని సినిమా చుసిన కొన్ని రోజులకే వృత్తి రిత్యా లండన్ కి వచ్చిన నాకు " ఎందుకు ఇక్కడ పిల్లలు ఆనందంగా వుంటే చాలు" అనుకుంటారో అన్న విషయం చాల కొద్ది రోజులకే భోదపడింది. ఇలా అనిపించడానికి కొన్ని ప్రధాన కారణాలు.
విద్యా విధానం :
మన దేశంలో లాగ పిల్లలని ఏ స్కూల్ లోనైనా చదివించే స్వేచ్చ ఇక్కడ తల్లిదండ్రులకు లేదు. ఇక్కడ ముందుగ పిల్లల birth certificate తో పాటు మన house address దస్తాలను మున్సిపల్ ఆఫీసు లో ఇవ్వాలి. వాళ్ళు పిల్లల వయస్సు schooling చట్టం పరధిలో వుందో లేదో పరిశీలించిన తర్వాత వెరిఫికేషన్ కోసం మన ఇంటిని సందర్శిస్తారు. అన్ని సజావుగానే వున్నాయని నిర్దారించుకున్న తర్వాత, మన localityకి దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో admission ఇస్తారు. పాఠశాల ఇంటికి దగ్గరలో వుంటే పిల్లల మీద శ్రమ మరియు సమయం కూడా ఆద అవుతుందనే అభిప్రాయం ఇక్కడ వారిది. పుస్తకాలు రోజు స్కూలుకి ఇంటికి మోసే అవసరం లేకుండా పాఠశాల లోనే ప్రతి ఒక్కరికి ఒక lockerని కూడా కేటాయిస్తారు (ఈ పధత్తి ఇప్పుడు మన దేశాలో కూడా కొన్ని పాటశాలలు ఆచరణలో పెట్టాయి). Parent - Teacher మీటింగ్ వుంటే ఎంత పెద్ద మేనేజర్ ఐన ఎన్ని పనులున్న మీటింగ్ కే మొదటి ప్రాధాన్యత. అన్నింటికి మించి ఇక్కడ పదో తరగతి వరకు అంత "ఉచితం".
వైద్యా విధానం :
నేను లండన్ కి ప్రయాణం అవుతున్నప్ప్పుడు ఏవేవి ప్రధానంగా తీసుకొని రావాలనే విషయం కోసం ఇక్కడున్న మిత్రులకు ఫోన్ చేస్తే, ప్రతి ఒక్కరు ప్రధానంగ చెప్పింది "Dont forget to bring some basic medicines". మన దేశం లాగానే ఇక్కడ కూడా చాల మందుల షాపులు వున్నా doctor note లేనిదే ఎవ్వరు మందులివ్వరు. చలి దేశం కాబట్టి దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఇక్కడ సర్వ సాదారణం. జబ్బు అనేది కాల క్రమేనా మనం తీసుకునే ఆహరం, జాగ్రత్తలు బట్టి దానంతటే అదే తగ్గాలని ఇక్కడ వైద్యుల అభిప్రాయం.అన్నింటికన్నా ముందుగ ఒక doctor ని ఏ కారణం కోసమైనా కలవాలన్న, అసలు ఆసుపత్రిలో అడుగు పెట్టాలన్న "National Health"కి దరఖాస్తు చేసుకోనుండాలి. మన medical history మొత్తం ఆ national health data base లో పొందుపర్చటం జరుగుతుంది. చాల వరకు వైద్య సేవలు కూడా "ఉచితమే".
సమానత్వం :
కులం, మతం, ప్రాంతం, భాష ఇలా అనేక కొలమానలతో మనం విడిపోయినట్లే ఇక్కడ కూడా విడిపోయారు కాని ఒక్కటి మాత్రం మెచ్చుకోక తప్పదు వృత్తి పరంగా ఇక్కడ అందరు సమానులే. ఒక పెద్ద కంపెనీ లో ఇంజినీర్ అయిన, ఒక బస్సు డ్రైవర్ అయిన లేక ఒక షాప్ లో cashier అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ హోదా సంపదను పక్కన బెట్టి ఎదుటి మనిషిని నవ్వుతూ పలకరిస్తూ సంబాషణ మొదలు పెట్టటానికి ఏ మాత్రం సంకోశించరు. "Respecting others profession as equally as yours is the highest dignity" అనే సూత్రాన్ని తూచా తప్పకుండ పాటిస్తారు.
మొత్తంగా చుస్కుంటే మన దేశం లో, సంపాదనలో చాల భాగం విధ్య వైద్యం కే ఖర్చు పెడతాం. ఇక పోతే వున్న కొలమానాలు సరిపోవంటు వృత్తి పరంగా ఒక్కరు ఎక్కువ ఒక్కరు తక్కువ అనే వారు సంపందించే అంకెల పరంగా విడగొట్టుకున్నాం. ఇక్కడ వ్యవహారాలను చూసి వీళ్ళు గొప్ప మనం కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. భారత రాజ్యాంగం రాయడం కోసం ఎన్నో దేశాలను పరిశీలించారంటా అంటే ప్రతి దేశం లోని మంచిని గ్రహించి దానిని మన పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్నారనే అనేగా అర్థం. "Westernization" అని ఎంత సేపు స్త్రీల బట్టలు ఎలా ధరించాలనే ప్రస్తావనే కాకుండా Westernization అంటే ఆయా దేశాలలో జరుగుతున్న అభివృద్ధి వల్ల వాళ్ళ జీవితాలు ఎలా భాగుపడుతున్నాయని చర్చించి దానికి అనువుగా కాల క్రమేనా మనం కూడా మారుతూ వచ్చుంటే ముందర ప్రస్తావించిన సినిమా డైలాగ్ ను సవరించేల అన్ని దేశాల లాగే మన దేశం లో కూడా తల్లిదండ్రులు సంతోషానికే మొదటి వోటు వేసేవారేమో!!!!!