చాలామంది తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్థితుల మూలంగా మగ పిల్లలను ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేయించి ఆడపిల్లలను గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేయిస్తారు కాని బోయ రాధ గారి తల్లిదండ్రులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం రాధ గారికి ప్రైవేట్ స్కూల్ లో అడ్మిషన్ తీసుకుంటే ఇద్దరు మగపిల్లలను గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేయించారు. ఇదేమని కొంతమంది అడిగితే "తన మీద మాకు పూర్తి అవగాహన ఉంది, ఏదో ఒకరోజు భారతదేశం గర్వపడేలా చేస్తుంది" అని చెప్పారట. వారు ఊహించినట్టుగానే బోయ రాధ గారు శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
పేదరికమే ఆస్థి: భగవంతుడు ఏ విషయంలోనైనా లోటు ఇస్తే దానికి ప్రత్యామ్నాయంగా మరో ఆస్థి ఇస్తాడు ఆ ఆస్థే మేధస్సు. బోయ రాధ గారి తల్లిదండ్రులది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలి, అనంతపురం జిల్లా గుంతకల్లు సొంతూరు, నాన్న టైలర్. "పేదవాడు ఉన్నత స్థాయిలోకి ఎదగాలంటే దానికి ఒకే దారి ఉంది అదే చదువు నువ్వు బాగా చదువుకుని నీ భవిషత్తును మార్చుకోవాలి" ఇవే రాధ గారి తల్లిదండ్రులు చెప్పే మాటల వల్ల తనకు తన లక్ష్యం పట్ల మరింత ఎక్కువగా తపన పెరిగేది. చిన్నతనం నుండి కూడా క్లాసులో తనే ఫస్ట్, బుక్స్ ఇతర వస్తువులు కొనడానికి టూషన్లు చెప్పి చదువుకునేవారు. ఎన్నో కష్టాల దారులను చదువుతో కలిసి ప్రయాణం సాగించారు. అలా తన చదువుల ప్రయాణం నానో మెటీరియల్ పై పీ.హెచ్.డి చేసే వరకు సాగింది.
తన ఆహిష్కరణలు: కంపెనీలు కొన్ని వస్తువులను తయారుచేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ వాయువు స్టేయిన్ లెస్ స్టీల్ నుండి బయటకు వెళ్ళే అవకాశం ఉంది ఇది జరిగితే భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల నివారణకై "హైడ్రోజన్ బారియర్ కోటింగ్స్" తయారుచేశారు. అనారోగ్యంతో చచ్చుబడిపోయిన రోగి శరీరంలోని కదలికలను గుర్తించే సెన్సార్ రూపొందించారు. నానో మెటీరియల్ ను బయో మెటీరియల్ గా ఉపయోగించి ఖచ్చితమైన DNA రిజల్ట్స్ వచ్చేలా రీసెర్చ్ చేశారు. కొన్ని రకాలైన పరికరాలతో సముద్రపు నీటి నుండి ఉప్పును వే రు చేసి మంచి నీటిని అందించే ఆవిష్కరణ చేశారు. భూగర్భంలో ఉన్న వివిధ రకాల వాయులను వెలికి తీసినపుడు అందులో ఉన్న హైడ్రోజన్, బ్యుటేన్, ఎల్పీజి ఇలారకరకాల వాయులన్నీటిని ఒకదానికొకటి వేరు చేసే నానో కాపిల్లరీలనీ తయారుచేశారు. ఈ ఆహిష్కరణకే ప్రసిద్ధి గాంచిన ఎం.ఐ.టీ రివ్యూ లో స్థానం లభించింది.
ఎం.ఐ.టి.? ఇందులో స్థానం లభించడమంటే అంత సులభం కాదు ఎంతో గొప్ప వ్యక్తులకు మాత్రమే ఈ జాబితాలో చోటు దొరుకుతుంది. నోబెల్ బహుమతి పొందినవారు, మార్క్ జూకర్ బర్గ్, గూగుల్ కో ఫౌండర్ లారీపేజ్ లాంటి వారిని ఎంపిక చేసే ఇందులో మన తెలుగు శాస్త్రవేత్తకు చోటు లభించడం ఎంతో గర్వకరం.