12 Actors Who Received Glorious Telugu Titles As Appreciation From Their Fans!
Sri Charan
Updated on
మన తెలుగు వాళ్ళు ఎవరినైనా అభిమానిస్తే గుండెల్లో పెట్టేసుకుంటారు . ఇక సినిమాల విషయంలో అభిమాన తారల గురించి అయితే చెప్పక్కర్లేదు . తమ అభిమానాన్ని చాటుకోడానికి సినీతారలకు బిరుదులు ఇచ్చేవారు అభిమానులు. ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాల కంటే అభిమానులు ప్రేమతో ఇచ్చే ఈ బిరుదులంటేనే నాయకానాయికలకి ఎంతో మక్కువ . వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తూ ఎప్పటికప్పుడు వారిని అలరించే తారాగణానికి అభిమానులు గౌరవసూచకంగా ప్రేమతో వారి నటనా కౌశలాన్ని కీర్తిస్తూ బిరుదులు అందించేవారు. ఆలా మన సినీతారలు - వారి బిరుదులు ఓసారి చూద్దాం
1. ఎస్వీ రంగారావు - నట సార్వభౌమ 2. నందమూరి తారక రామారావు - నట రత్న , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ3. అక్కినేని నాగేశ్వరరావు - నట సామ్రాట్ 4. కృష్ణ - నట శేఖర 5. శోభన్ బాబు - నట భూషణ్ 6. కొంగర జగ్గయ్య - కళా వాచస్పతి 7. రావు గోపాలరావు - నట విరాట్ 8. కైకాల సత్యనారాయణ - నవరస నటనా సార్వభౌమ 9. రాజేంద్రప్రసాద్ – నటకిరీటి10. మోహన్ బాబు - నట ప్రపూర్ణ11. బాలకృష్ణ - యువరత్న 12.నాగార్జున- యువ సామ్రాట్
నటీ నటులకే కాదు దర్శకులకి కూడా ఇలాంటి బిరుదులు ఉన్నాయి
కే విశ్వనాధ్ - కళా తపస్వి దాసరి నారాయణరావు -దర్శకరత్నరాఘవేందర్రావు -దర్శకేంద్రుడు జంధ్యాల -హాస్య బ్రహ్మ
మరెవరినైనా మరచిపోయుంటే కామెంట్స్ విభాగంలో మాతో పంచుకోగలరు