తెలుగు వారి ఇంట్లో పెళ్లి అంటే బాబోయ్ ఆ హడావుడి, సందడి అంతా ఇంతా ఉండదు! పెళ్లి చూపులు, నిశ్చితార్ధం, గౌరీ పూజ, వరుడి కాల్లు కడగటం, జీలకర్ర-బెల్లం, దండలు మార్చుకోవడం, మంగళ్యధారణ, అరుంధతీ నక్షత్రం, ప్రధానం(అప్పగింతలు) ఇటువంటి ఎన్నో సాంప్రదాయాలు తెలుగు వివాహాలలోనే కనిపిస్తాయి..
ఇక పెళ్ళి లో ఇంటి ముందు మామిడి తోరణాలు, ఇంటి నిండా భందువులూ, ఆప్యాయతలూ, పలకరింపులూ, పరిచయాలు, పిండివంటలూ అబ్బో ఒకటా రెండా ఎన్ని విశేషాలో.. చెప్పటం అంత సులభం కాదు గానీ మన తెలుగు సినిమాల్లో పెళ్లి గురించి కొన్ని పాటలున్నాయి...పెళ్ళింట్లో ఈ పాటలు తప్పక వినపడాల్సిందే..
1. శ్రీరస్తూ శుభమస్తూ (పెళ్లి పుస్తకం)
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా..
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా..
మనసు మనసు కలపటమే మంత్రం పరమార్దం
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ...
2. అలనాటి రామచంద్రుని (మురారి)
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు ..
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు ..
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు .. ఇద్దరి తలపును ముద్దగా తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ..
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ..
కలలకు దొరకని కలగల జంటని పదిమంది చూడండి..
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి..
3. ఆకాశం దిగివచ్చి (నువ్వు నాకు నచ్చావ్)
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలేలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా...
4. తెలుగు వారి పెళ్లి (శ్రావణ మాసం)
తెలుగు వారి పెళ్లి, ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగు వారి పెళ్లి
మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం,అది మాంగళ్యంగా ముడి పడితే తరించును స్త్రీ హృదయం
తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులూ..అవి పుట్టినింటికీ,మెట్టెనింటికీ పట్టిన హారతులూ..ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణమాసం.. శ్రావణమాసం
5. ఐదు రోజుల పెళ్లి (వరుడు)
ఐదు రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి...!
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి..
ఆకాశ పందిల్లు భూలోక సందల్లు
శ్రీరస్తు పెళ్లిల్లు శుభమస్తు నూరేల్లు
6. సీతారాముల కళ్యాణం చూతము రారండి (సీతారామ కళ్యాణం)
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి, మణి భాసికమును నుదుటను గట్టి
పారాణిని పాదాలకు పెట్టి... ఆ..
పెళ్ళి కూతురై వెలసిన సీత
కళ్యాణము చూతము రారండి..శ్రీ సితారాముల కళ్యాణము చూతము రారండి
సంపెంగి నూనెను కురలను దువ్వి..ఒంపుగ కస్తూరి నామము గీసి..
చంపగ వాసి చుక్కను పెట్టి..
పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము
సితారాముల కళ్యాణము చూతము రారండి
జానకి దోసిట కెంపుల త్రోవై..రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములె తలంబ్రాలుగా..
సిరమున వెలసిన సీతారాముల కళ్యాణము చూతము రారండి...
ఇవండీ పెళ్లి గురించీ,సాంప్రదాయ వివాహ విశిష్టత గురించి మన తెలుగు పాటలు..!
పెళ్లి తర్వాత అటువైపు నుంచి డామినేషన్ ఎక్కువైతేనో? అప్పుడూ ఉందో పాట..."వద్దురా సోదరా పెళ్ళంటె నూరేల్ల మంటరా.."
Best Ever Wedding Songs in Tollywood!
