22 Divine Places Of Lord Siva That Can Be Visited With Family/Friends

Updated on
22 Divine Places Of Lord Siva That Can Be Visited With Family/Friends

శివ రాత్రి మన చిన్నప్పుడు మనకు ఇష్టమైన పండుగలలో ఒక పండుగ. ఉపవాసం ఉందామన్న మన అమ్మ వాళ్ళు ఉండనిచ్చే వాళ్ళు కాదు రాత్రి జాగారం చేసి మరుసటి రోజు బడికి డుమ్మా కొడదామనుకున్న అది కూడా అయ్యేది కాదు. కానీ సాయంత్రం గుడికి వెళ్లడం ఒక వేళా మరుసటి రోజు కూడా సెలవైతే అందరం ఒక చోట చేరి కొంత మంది పూజ చేసుకుంటూ కొంత మంది భోజనం సిద్ధం చేస్తూ.., పిల్లలు ఆడుకుంటూ.., ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి రోజు అర్ధరాత్రి వరకు మేలుకుంటున్నాం ఇక విడిగా జాగారం చేయాల్సిన అవసరమేముంది.. ఒక వేళా చేద్దామంటే శివుడిని తలుచుకుంటూ ఉండటం మానేసి సినిమా చూస్తునో పాటలు వింటూనో కానిచేస్తున్నాం. ఇలా కాకుండా మీ ఇంటి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి ఈ రోజంతా గడిపితే.., పుణ్యం గురించి కొంచెం పక్కన పెడితే కొంచెం మన మనస్సు కి విశ్రాంతి దొరుకుంటుంది. మన దేశం లో ద్వాదశ జ్యోతిలింగాలు అని 12 , పంచారామాలు అని 5 , పంచభూత లింగాలు అని 5 మొత్తం 22 శివుని ఆరాధించే ముఖ్యమైన గుడులు ఉన్నాయి.

జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్ ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. శివుడిని జ్యోతిస్వరూపుని గా 12 చోట్ల పూజిస్తారు. వాటిని జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటారు.

1. సోమనాథుడు - సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ 2. మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 3. మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ 4. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరము, మధ్య ప్రదేశ్ 5. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్ 6. భీమశంకరుడు - డాకిని, మహారాష్ట్ర 7. రామేశ్వరుడు - రామేశ్వరము, తమిళనాడు 8. నాగేశ్వరుడు - ద్వారక , మహారాష్ట్ర 9. విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్ 10. త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర 11. కేదారేశ్వరుడు - హిమాలయాలలో, ఉత్తరప్రదేశ్ 12. కుసుమేశ్వరుడు - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర

పంచారామాలు తారకాసురుడనే రాక్షసుడు, పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ లింగాన్ని తన గొంతులో ఉంచుకుంటాడు . అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లెకుండా వరం పొందుతాడు. వరం వల్ల గర్వంతో ఆా రాక్షసుడు దేవతల్ని బాధిస్తున్నడంతో, దేవతలందరు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. తారకాసురుడిని సంహరించాడు. ఆ రాక్షసుడి గొంతునుండి పడిన ఆత్మ లింగం ముక్కలయ్యి 5 చోట్ల పెద్దవి వాటిని దేవతలు పంచారామాలుగా ప్రతిష్టించారు .

1. అమరారామము గుంటూరు జిల్లాలో గుంటూరుకు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి.

2. దక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు

3. సోమారామము పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి.

4. కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు అమ్మవారు, బాలా త్రిపుర సుందరి.

5. క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి.

పంచభూత లింగాలు పంచభూతాలైన, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి స్వరూపాలుగా శివుడు లింగ రూపమై ఐదు చోట్ల ఉన్నారు.. వాటిని పంచభూతలింగాలు అంటారు..

1. పృథ్విలింగం ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.

4. వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.

5. తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

Telugu states daggarlo unna siva temples vellalanukunte pancharamala lo okati or srisailam or sri kalahasthi.., long drive chedamanukunna vaalu jyotirlingalalo okati, Bike ride cheskutnu veldamanukunna vaalu panchabhootha lingalo okati chudataaniki plan cheskovachu.., Tejo lingam unna Arunachalam ki friends tho plan cheskunte masth untundi.., around 10KM nadustaaru chaalamandi.., Giri pradikshina antaaru. It will give best pleasurable feeling. Ee temples ey kaakundaa inkaa enno sivuni devaalaayalu unnayi. Ee siva ratri roju, meeku mee budget ki daggarlo unna edoka temple ki velli ee daily busy life nundi kontha sepu relax avtaarani aaasithu.. Let's be in the trance of Siva in this Siva raatri. What's your plan do let us know in comments?