ఈ జీవన పరుగు పందెంలో మనం ఎంత కష్టపడితే మనకు మన కంపిటీటర్ కు అంత వ్యత్యాసం ఉంటుంది.. షేక్ అబ్దుల్ ముజీబ్ ఈ సంస్థను తొలిసారి ప్రారంభించడానికి చాలా రీసేర్చ్ చేశాడు. భారతదేశంలో ఇలాంటి వస్తువుల తయారీలో ఉన్నత స్థాయిలో ఉన్న అస్సాంలో ఈ హ్యాండ్ మేడ్ వస్తువుల గురించి పూర్తిగా నేర్చుకున్నాడు.. ఆంధ్రప్రదేశ్ తెనాలి అనే ఒక ఊరిలో సంస్థను స్థాపించడానికి ఈ స్థాయిలో రీసెర్చ్ అవసరం లేదు ఇక్కడే ఏదో చోట నేర్చుకోవచ్చు కదా అంటే ఏది చేసినా గొప్పగా చేయాలి అనేదే నా ఉద్దేశం అంటూ ముందుకు సాగిపోతున్నాడు.
షేక్ ముజీబ్ ఏది చేసినా తనకు, ఈ సమజానికి ఉపయోగపడాలనే ఆశిస్తాడు, ఈ 'అల్లిక'(9948703646) అనే స్టార్టప్ స్టార్ట్ చేయడానికి కూడా అదే కారణం. మన పేద, మధ్య తరగతి మహిళల దగ్గర ఎంతో శక్తి ఉన్నా ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుంటారు ఈ అవస్థలను చూసి వీరికి ఉపయోగపడాలని, అలాగే తన కెరీర్ కు ఉపయోగపడాలనే ఈ సంస్థను స్టార్ట్ చేశాడు. ఈ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్ని ఒకే ఒక్క మెటీరియల్ తో తయారు చేస్తారు అదే గుర్రపు డెక్క నార(Water Hyacinth) అనే మొక్క నుండి వస్తువులను తయారు చేస్తున్నారు.
ఇందులో చేరాలనుకునే మహిళలకు సంస్థ వారే శిక్షణను ఇప్పించి ఉద్యోగం ఇస్తారు. ఇప్పటి వరకు ఈ శిక్షణ ద్వారా తెనాలి ప్రాంతంలో ఎంతోమంది లాభపడుతున్నారు. రూ.150 నుండి రూ.2000 వరకు ఉండే ఈ వస్తువులను కొనడానికి ముందుగా ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కున్నా కాని ఇకో ఫ్రెండ్లి ఇంకా నాణ్యత, స్టైల్ నచ్చడంతో ఇప్పుడు బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. హైదరాబాద్ లామాకాన్, ఆర్గానిక్ స్టోర్స్, శిల్పరామంలో ఈ వస్తువులు లభిస్తాయి. అల్లిక సంస్థ మొబైల్ పౌచ్, డైనింగ్ మాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ బ్యాగ్స్, హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ లాంటి వెన్నో తయారుచేస్తున్నారు. గుర్రపై డెక్క నారతో తయారు చేసిన ఈ వస్తువులు చాలా ధృడంగా ఉంటాయి 12కేజీల వరకు బరువు మోయగలవు 15సంవత్సరాల వరకు మన్నికగా ఉండగలవు.