మనకోసం, మన ఊరికోసం ఏ శ్రీమంతుడు రాడు.. ఎవరో వస్తారని ఎదో చేస్తారని వారికోసం ఏళ్ళ తరబడి ఎదురుచూడడం కన్నా మనమే ముందడుగు వేసి మన ఊరిని బాగుచేసుకోవడం ఏంతో గొప్పది.. ఈ పద్దతిలో మన ఊరిని మాత్రమే కాదు ఆ ప్రయాణంలో మనల్ని మనము సంస్కరించుకోవచ్చు. తెనాలి ఆంద్రప్రదేశ్ లోని ఓ అందమైన ఊరు. ఎంతోమంది గొప్ప వ్యక్తులు పుట్టిన ఉరులోను ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయి వీటి నిర్మూలన కోసం ఎవరికోసమో ఎదురుచూడకుండా, ప్రభుత్వాన్ని నిందించకుండా ఒమన్ ఇంకా అతని మిత్రులు ముందుకు కదిలారు..
ఆఫీస్ కో డస్ట్ బిన్: ఏ ఊరికైనా గుర్తింపు ఆ ఊరి శుభ్రతను బట్టి తెలుస్తుంది తెనాలిలో ఇంతకుముందు చెత్త చాలా అసభ్యంగా ఉండేది ఇలా కాదని చెప్పి "కల్పవృక్ష" సభ్యులు ముందుగా డస్ట్ బిన్ లను వారి పాకెట్ మనీతో కొనుగోలు చేసి చాలా ఆఫీస్ లకు అందజేశారు.. అలాగే ఎంపిక చేసిన వీదులలో ఏర్పాటు చేసి మున్సిపల్ సిబ్బందితో కలిసి తెనాలిలో స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తున్నారు..
Wall of kindness: ఈ వాల్ ఆఫ్ కైండ్ నెస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా హిట్ అయ్యింది. ఈ వాల్ మన ఊరిలోనూ ఉండాలని తెనాలిలో ప్రారంభించారు. అక్కడ పెట్టిన పాతబట్టలను వీరు తీసుకుని శుభ్రంగా ఉతికి, ఎక్కడైనా చినిగి ఉంటే బాగుచేసి మరల ఆ గోడ మీద పెడతారు. ఒకవేళ దానిని తీసుకోవడానికి ఎవరూ రాకపోతే కల్పవృక్ష టీమ్ సభ్యులు పేదలకు దగ్గరికి వెళ్లి అందజేస్తారు.