Technology లో Revolutionary Changes వల్ల మన ఊహకి అందనంత ప్రగతిని సాధిస్తున్నాం.. కాని ఎంత సాధించినా అందుకు తగ్గట్టుగానే ఎన్నో కొత్త రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. అప్పట్లో లేని కొత్త వస్తువులు ఎలా వస్తున్నాయో అదే విధంగా అప్పట్లో లేని కొత్త రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. మిగిలిన వాటి విషయంలో లోపాలు ఎలా ఉన్నా అంత Effect ఉండకపోవచ్చు కాని మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి లోపం ఉండకూడదు మన పెద్దవారు ఉన్నంత ఆరోగ్యంగా, బలంగా మనం ఉండలేకపోతున్నాం కారణం వాతావరణం, ఫుడ్. రైతులు పురుగుల మందులు వాడకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే మునపటి లాగే మన పెద్దవారిలా మనం కూడా ఆరోగ్యంగా బలంగా ఉండొచ్చు. లిఖిత భాను ఇదే విషయంలో విప్లవాత్మక ప్రగతి సాధించారు.
ఎలా స్టార్ట్ అయ్యింది: లిఖిత 2012 Biotechnologyలో Graduation పూర్తిచేశాక ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉంది. ఒకరోజు అమ్మ పొలంలో పండిన ఆర్గానిక్ మామిడి పండ్లు ఇంటికి వచ్చాయి. అందులో చాలా పండ్లు తినగ మిగిలిపోయాయి. అక్కడే ఉన్న ఒక సూపర్ మార్కెట్ కు వెళ్ళి వాటిని అమ్మారు. మామూలు పండ్ల కన్నా ఆర్గానిక్ పండ్లకు ఎక్కువ డబ్బులు రావడం, ఇంకా ఆరోగ్యానికి ఇవే మంచివి కావడంతో ఇక ఆర్గానిక్ ఫుడ్స్ పండించి అమ్మడమే నా బిజినెస్ అని హైదరాబాద్ లో Terra Green Organic(040-20000458) సంస్థను స్టార్ట్ చేశారు.
సంస్థ విస్తరణ: ఇందుకోసం లిఖిత రిసేర్చ్ బాగా చేశారు. అటు పండించిన పంటను మార్కెటింగ్ చేయడంలో, ఇటు పంటను పండించడంలోను మెళకువలు తెలుసుకున్నారు. మామూలు పెస్టిసైడ్స్ వాడితే మూడు సంవత్సరాలలో భూసారం తగ్గిపోతుంది అదే సేంద్రీయ ఎరువులతో పండిస్తే పంట కాస్త తక్కువ అందినా గాని ఎక్కువ కాలం దిగుబడి చేసుకోవచ్చు అని తెలుసుకుని స్థానిక రైతులకు వివరించింది. మొదట వారు భయపడ్డా కాని సరైన ప్రణాళికలు ఉదాహరణలు చూపించడంతో రైతులు పండించడం మొదలుపెట్టారు, అలా పండించి ఆ పంటను వినియోగదారులకు అందేలా సరైన విధంగా మార్కెటింగ్ చేశారు. అప్పటి వరకు లిఖిత మదర్ పద్మజా గారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కొన్ని ఎకరాలలో చేస్తున్నారు ఇంక లిఖిత సహకారంలో మరింత విస్తరించి ఇప్పటికి 127ఎకరాలకు పెంచారు. అప్పుడు ఒక్క ప్రాంతం నుండి ప్రారంభమయ్యి ఇప్పుడు దేశంలోని 16రాష్ట్రాలకు విస్తరించింది. దాదాపు 700 ఆర్గానిక్ స్టోర్స్, ఇంకా 4,000 రైతులు సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.
పైకి లిఖిత గారు చేసేది బిజినెస్ లా కనిపిస్తుంది కాని ఇక్కడ అంతర్లీణంగా చాలా గొప్ప మంచి జరుగుతుంది సమాజానికి.
పెస్టిసైడ్స్ ద్వారా పండించిన పంట వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మూలంగా జనాలకు మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫుడ్ దొరుకుతుంది.
పంటను పండించడం ఒక ఎత్తు ఐతే ఆ పండిన పంటను అమ్మడం ఇంకో ఎత్తు. ఒకపక్క సంస్థ సిబ్బంది నేరుగా రైతులతో కలిసి పనిచేయడం వల్ల రైతులకు సరైన విధంగా సూచనలు అందుతుంటాయి. మరో పక్క పంటను సంస్థ వారే మంచి ధరతో కొనుగోలు చేయడంతో రైతులకు సరైన లాభం అందుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నా కాని ఈ సంస్థ సాధిస్తున్న ప్రగతి మూలంగా మరిన్ని సంస్థలు ముందుకొస్తాయి, రాబోయే రోజులలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఏ దళారి లేకుండా నేరుగా వినియోగదారునికి చేరడంతో వారికి తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అందుతుంది.
నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళి చెబుతున్నా.. డబ్బు సంపాధించడం మన లక్ష్యమైతే ఆ దారి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. సరిగ్గా ఇదే మార్గంలో లిఖిత గారు ఉన్నారు.