ఇంకో ఐదు నిమిషాల అయితే చూస్తా తనని. ఎన్నో రోజుల పరిచయం ఉన్నా, ఏదో తెలియని అలజడి , అసలు ఎలా మాట్లాడాలి అని...
(7 months back)
May 27th 2020
ఇంస్టాగ్రామ్ లో ఇష్టమైన మణిరత్నం గారి సినిమా అని ఏదో పోస్ట్ చూస్తే సఖి అని కామెంట్స్ లో పెట్టా. పెట్టిన ఒక గంటకి ఎవరో నిత్య అని , "ఎవడ్రా నువ్వు ? అసలు ఓకే బంగారం సినిమా చూసావా నువ్వు అని నాకు కామెంట్ పెట్టారు. మనం ఎందుకు తగ్గాలి అని ఒక చిన్న కామెంట్స్ యుద్ధం చేసాం , మా గోల పడలేక జనాలకి చిరాకు ఒచ్చేసింది. దెబ్బకి గొడవ కాస్త మెసేజ్ బాక్స్ వరకు వచ్చి ఒకరిని ఒకరు వాదించుకోడం సరిపోయింది.మొత్తానికి ఒక 2-3 గంటలు గొడవ పడి ఎవరి పని వాళ్ళు చుస్కోడం మొదలు పెట్టాము . ఒక వారం రోజుల తర్వాత జూన్ 2nd మణిరత్నం గారి పుట్టిన రోజు , సడన్ గా లాస్ట్ వారం జరిగిన గొడవ గుర్తొచ్చింది. వెంటనే ఆ అమ్మాయి ప్రొఫైల్ కి వెళ్లి చూసా , అకౌంట్ పబ్లిక్ ఏ , పెట్టిన స్టేటస్ ఓపెన్ చేసి చూడగానే నవ్వుకున్నా " No Matter if it is Sakhi, Roja , Ok Bangaram, The Magical Love exists in every Manirathnam film " అని . ఆరోజు అదే స్టేటస్ నేను కూడా పెట్టా . వెంటనే మెసేజ్ చేసా , తను కూడా నవ్వి , సఖి అయినా , ఓకే బంగారం అయినా మన మణిరత్నం ఏ కదా అంది, అక్కడ మొదలయింది మా స్నేహం. మణిరత్నం దగ్గర మొదలైన స్నేహం అలా రెహమాన్ దగ్గరికి , అక్కడ నుండి వాట్సాప్ కి వెళ్ళిపోయింది. ఒకర్ని ఒకరు తెలుసుకోడం నుండి ఒకరితో ఒకరు గొడవ పడే వరకు వచ్చేసింది. మన అనుకున్న వాళ్ళతోనే కదా గొడవ అయినా అలక అయినా. ఎంతో దూరం లో తానున్న , చాలా దగ్గరికి వచ్చేసింది.
కొంచెం తిక్కదే , కానీ ఆ తిక్క వెనక ఎన్నో కారణాలు. ఈరోజు మన ముందు కనిపిస్తున్న ఏ మనిషి అయినా వాళ్ళ గతం , గతం లో సంఘటనల సమ్మేళనమే. తనంటే ఇష్టం , తనకి నేనంటే ఇష్టం అని తెలుసు , కానీ చెప్పలేను. చెప్తే ఎం అవుతుందనే భయమో ? అసలు ఒక్కసారి కూడా కలవకుండా ప్రేమేలా పుడుతుంది ? ఇద్దరికీ అదే సందేహం ఏమో , ఎంత ఇష్టం ఉన్నా ఎపుడు బయటికి చెప్పుకోలేదు. రోజులో ఎక్కువ సేపు తనతోనే , పొద్దునంత మాటలతో, సాయంత్రం బాల్కనీ లో తను , నా గది లో నేను గంటల సేపు వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. ఎన్నో మంచి జ్ఞపకాలు ఇచ్చింది మాత్రం రాత్రే. ఆ వెన్నెల అందంలో నక్షత్రాల కింద అన్ని సందేహాలు వదిలేసి మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వాళ్ళం.ఇన్ని రోజులైనా ఇద్దరం చెప్పుకోక పోయినా మదిలో మెదిలే ప్రశ్న ఒకటే
పరిచయం దాటి స్నేహం దాకా వచ్చిన ప్రయాణం ప్రేమని ఎప్పుడు చేరుకుంటుంది ?
మొత్తానికి ఒకరోజు కుండ బద్దలు కొట్టేసి కలుద్దామా అని అడిగా , హా అని అడ్రస్ ఇచ్చింది. ఆలా అడిగిన తర్వాత మొదలు అయ్యాయి అసలు సందేహాలు. ఎన్ని చెప్పిన సరే , ఫోనుల్లో మాట్లాడుకోడానికి , బయట కలవడానికి చాలా తేడా ఉంది. నేను నచ్చుతానా ? అసలు సరిగ్గా మాట్లాడగలనా? నిజంగా ప్రేమేనా లేకపోతే ఇవన్నీ ఊహాలా? ఆ రాత్రి నిద్ర పట్టలేదు , తరువాత రోజే టికెట్ బుక్ చేసుకొని బస్సు ఎక్కేసా.
మొత్తానికి బస్సు దిగి హోటల్ లో ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటి బయట నుంచున్నా. " 5 Minutes అర్జున్ , వస్తున్న" అంది.
ఇంకో ఐదు నిమిషాల అయితే చూస్తా తనని. ఎన్నో రోజుల పరిచయం ఉన్నా, ఏదో తెలియని అలజడి అసలు ఎలా మాట్లాడాలి అని , చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది గుండె , ఆ సౌండ్ నాకే క్లియర్ గా వినిపిస్తుంది. అది ఆగిపోక ముందే వస్తే బాగుండు అని అనుకునే లోపు , అలా దిగింది మెట్ల మీద నుండి. చీరలో అలా ఉంగరాల జుట్టు సెట్ చేస్కుంటూ దిగుతుంటే ఆ క్షణం మళ్ళీ పడిపోయా, 6 నెలల ముందు వ్యక్తిత్వానికి ఇప్పుడు తన అందానికి. వెంటనే అసలు ఈ పిల్లకి మనం ఏంటి అత్యాశ కాకపోతే అని వెన్నకి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నా , అంతలోపు చూసేసింది , దగరికి వచ్చేస్తుంది. ఆ క్షణం నా ఆనందపు మౌనానికి కనక గొంతు ఉంటె ఆ అరుపుకి లోకం చెవులు పేలిపోయేవి ఏమో. అప్పటి దాక మెల్లిగా కొట్టుకున్న గుండె వేగంగా కొట్టుకోడం స్టార్ట్ చేసింది. ఎలా మాట్లాడాలి , ఎం అందం అని అలోచించి మాట్లాడే లోపు తను వచ్చి చెయ్యి పెదాల మీద అడ్డు పెట్టి ముద్దు పెట్టింది , ది ఓకే బంగారం కిస్ . కళ్ళు తిరిగి కింద పడిపోడం , ఎవరెవరో నన్ను ఎత్తుకుని వాళ్ళ ఇంట్లో పడుకోపెట్టడం అన్ని జరిగిపోయాయి. లేచే సరికి ఇంట్లో వాళ్ళ అమ్మానాన్నల పక్కన ఉన్నా. నా బాధ వాళ్ళకి నవ్వు అయిపోయింది.
మొత్తానికి వాళ్ళ బాల్కనీ లో కూర్చుని ఛాయ్ తాగాము. ఏదో అనుకుంటాం కానీ ప్రేమించినంత సులువు కాదు ప్రేమని చెప్పడం. ఏదైతే అది అయింది అని జై మణిరత్నం అనుకుని , "విను , నాకు నీ మొండితనం ఇష్టం , ఆ మొండితనం వెనకున్న పిచ్చి కూడా ఇష్టమే. అప్పుడప్పుడు తిక్కతో చంపినా పర్లే దాన్ని బాలన్స్ చేస్తూ ఒక నాలుగు కుల్లు జోకులు చెప్పు , మొత్తానికి ఎం చెప్తున్నా అంటే గొడవ పడదాం కానీ కలిసి ఉండి గొడవ పడదాం , ఇంత కన్నా ప్రపోసల్ అంటే మన వల్ల కాదు అని చెప్పా ",నవ్వుతు ఒకే చెప్పింది. రోజు వీడియో కాల్స్ లో మాట్లాడుకునే వాళ్ళం ఈరోజు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నాము. రోజు డాబా మీద నక్షత్రాల కింద నవ్వుకునే వాళ్ళం , ఈరోజు ఒకే డాబా మీద కలిసి నక్షత్రాలు చూస్తూ నవ్వుతున్నాము. బాగుంది చాలా అంటే చాలా. మొండి పిల్లే కానీ బంగారం.
ఎన్నో Online పరిచయాలు మేఘాల ల అలా అలా తిరుగుతూ తేలుతూ ఉండచ్చు , నాది ఆ మేఘం నుండి వర్షం ల మారి నా దరికి చేరింది , చేరి నాతోనే ఉండిపోయింది. అన్ని ప్రేమ కథలు కల లా మిగిలిపోవు , కొన్ని ఊహలు నిజం అవుతాయి అనే నమ్మకం వచ్చింది. గతం లో గాయాలన్నిటిని మర్చిపోయేలా చేసే ప్రేమ మళ్ళీ వస్తుందనే ధైర్యాన్ని ఇచ్చింది. ఇన్ని జ్ఞపకాలకి కారణం అయినా ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి మణిరత్నం గారికి Thank you చెప్తూ , We lived happily ever after .