గొప్ప విషయాలు ,పెద్ద విషయాలు ఇవి రెండూ ఎప్పుడు ఒక్కటే అనుకుంటాం కానీ గొప్ప అనిపించే ప్రతిదీ పెద్దగా జరగాల్సిన అవసరం ఏం లేదు !!
మన రోజు బ్రతికే జీవితంలో కొన్ని చిన్న చిన్న పనులు చూసినప్పుడు మనసుకి చాలా బాగా అనిపిస్తాయి నిజానికి పెద్ద విషయాలకన్న వీటి వల్లే మనం ఇంకా ఎక్కువ Inspire అవుతూ ఉంటాం తెలియకుండా అలా ఒకటి చేయలనుకుంటాం
ఇలాంటిదే నేను ఒకటి చూసాను
ఒక హాస్పిటల్ లోనుండి బాధలో వస్తూ , మా వాళ్ళకి ఫుడ్ పార్సెల్ కోసం ఒక కర్రీ పాయింట్ దగ్గర ఆగాను. నా ఆర్డర్ ఇచ్చేసి wait చేస్తున్న నా పక్కన చిరిగిన బట్టలతో ఒక చిన్న పిల్లాడు నిలబడి "ఆకలి వేస్తోంది ఎదో ఒకటి ఇప్పించవా !!" అని అడిగాడు First నా మైండ్ లో వీడి ప్రాబ్లెమ్ ఒరిజినల్ ఆ కాదా అని ఆలోచిస్తూ ..అయినా ఆకలికి genuinity ఏంటి ?? సర్లే ఎదో ఒకటి కొన్ని ఇద్దాం అని అనుకుంటుంటే నా ఆర్డర్ confirm చేయడానికి owner మళ్ళీ అడిగితే అటు వైపు తిరిగాను .ఇలాగో ఆ పిల్లాడు గ్లాస్ అద్దాలపైన తలా వాల్చి ఆకలితో ఒక్కొక్క ఐటమ్ కోసం చూస్తున్నాడు
ఈ చిన్న గ్యాప్ లో నా పక్కన ఉన్న అతను రియాక్ట్ అయ్యి "రేయ్ ..తీస్కొరా ! "అని ఒక మీల్స్ ప్యాకెట్ కొని ఇచ్చేసాడు
"భయ్యా ..కుమ్మేశావ్ !" అని నా Inner ఫీలింగ్
కానీ అది ఇంకా టీజర్ మాత్రమే అసలు విషయం ఏంటంటే
ఇలాగో నా ఆర్డర్ తన ఆర్డర్ వచ్చేసాయి నావి ఇచ్చేసాను , తను డబ్బులు ఇస్తుండగా షాప్ అతను ఆ పిల్లాడికి కొన్నవి కూడా కలిపి ఇస్తూంటే "ఉంచెయ్ అన్నా ..పర్లేదు !! " అని 50 rs వెనక్కి ఇచ్చేసాడు
అప్పుడు అనిపించింది "గొప్పోళ్ళు రా బాబు!!" అని
ఇదంతా చూసిన నాకు ఎక్కడో లోపల ఒక చిన్న guilty feeling కొట్టేస్తోంది
First పిల్లాడికి కొన్న అతను నచ్చాడు Second మనీ వెన్నకిచ్చిన షాప్ ఓనర్ ఇంకా నచ్చేసాడు అందుకే ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీసా ! ఇదిగో వీళ్ళే
దీనికి "గొప్పోళ్ళు రా బాబు !"అని ఎందుకు పెట్టానంటే Reason 1 హెల్ప్ చేయాలనుకున్న ఇద్దరు గొప్పోళ్లే Reason 2 ఇది జరిగింది "తణుకు" అని వెస్ట్ గోదావరి లోని ఊరులో మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే శ్రీకాంత్ అడ్డాల గారి రేలంగి పక్క ఊళ్ళో అందుకని ..
వీళ్ళ గురించి చెప్పి నేను గొప్పడైపోయాను మరి మీకు జరిగినవి వాటి గురించి చెప్పి మీరు గొప్పోళ్ళు అయిపొండి !!
P.S - ఇంతకీ ఆ కర్రీ పాయింట్ పేరు చెప్పలేదు కదా అమృతం కర్రీ పాయింట్ మనుషులే కాదు కర్రీలు కూడా బావుంటాయి