Contributed By Nikhitha Karimsetty
Time 9:00 pm అవుతుంది రోజు ఈ time కి మాత్రలు వేసుకుని పొడుకునే తాత నా కోసం AC hall lo వొణుకుతూ కూర్చున్నారు. మీ ఆరోగ్యం పాడవుతాది ఇంటికి వెళ్లిపోండి అని నాన్న అంటున్న chinna గాడి program చూసే దాకా ఇక్కడ నుండి కదిలేది లేదు అని మొండి గా అన్నారు తాతయ్య. బొమ్మరిల్లు సినిమా లో కొడుకు లాగ నాన్న కూడా silent అయిపోయారు.
Programs start అయ్యేటప్పటికి 10 అయ్యింది ఎప్పుడు మన వాడు వస్తాడు అన్ని తాత చిన్న పిల్లాడిలా నాన్న ని అడుగుతున్నారు. వస్తారు అండీ మన వాడిది 6th performance అంట అన్ని చెప్పిన ప్రతి 5 mins కి ఒకసారి మన వాడు వచేసాడు అని అడగడమే. పోని అలా అడిగి కూర్చుంటున్నారా అంటే అక్కడ వచ్చిన వాళ్లలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ల దగ్గిరకి వెళ్లి నా మనవడు ఇప్పుడు stage మీద perform చేస్తాడు అని చెప్తున్నారు. రాక రాక నా performance వచ్చింది నేను మధ్యలో వున్నాను ఏమో అని వెతుకుతున్నారు తాతయ్య మన వాడు ఏడి అని అడిగితె అదిగోనండీ 2nd row lo 3rd వున్నాడు అని నాన్న చూపించారు. చూసి తెగ మురిసిపోయారు. అక్కడ నేను చేసింది ఏమి లేకపోయినా మన వాడు బా చేస్తాడు గా మధ్యలో పెట్టలేదు ఏంటి ? వీడు అయినా అడగాల్సింది. ఎక్కడ అయితే ఏమి వుంది అంది అని నాన్న అన్నారు. ఈసారి బొమ్మరిల్లు మూవీ లో క్లైమాక్స్ సీన్ లాగ తాత సైలెంట్ అయిపోయారు . Program చూసి ఆనందపడి నా దగ్గిరకి వచ్చి ఎత్తుకున్నారు తాతయ్య. ఇలాగే చాలా చేయాలి అని encourage చేశారు. Next day తాత తెలిసిన వాళ్ళ అందరికి నేను ఎదో state rank సాధించిన అంత గొప్పగా చెప్తున్నారు. నాన్న మనళిని చూసి proud గా feel అయినా బయటకి తెలియ చేయరు కానీ తాత అలా కాదు అమ్మ లాగ అందరికి చెప్తారు, తెలిసిన వాళ్లకి స్వీట్స్ పంచుతారు, మనళిని చూసి గర్వపడతారు.
After 8 years :
అప్పుడు ప్రోత్సహించిన తాత ఇప్పుడు daddy చెప్పినట్టే చేయమంటున్నారు. అప్పుడు చూసి మురిసిపోయిన తాత ఇప్పుడు అది career గా తీసుకుంటా అంతే వొద్దు అంటున్నారు. నన్ను ఎప్పుడు hurt చేయని తాత ఇప్పుడు తన మౌనం తో బాధ పరుస్తున్నారు. ప్రతి సారి సపోర్ట్ చేసే తాత ఇప్పుడు daddy కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అడిగితె నువ్వు చిన్న పిల్లాడివి, ఏమి తెలీదు అని అన్నారు. అమ్మ, నాన్న ఒప్పుకోక పోయిన పర్లే తాత ఒప్పుకోవాలి అని అనుకున్న తాత అల చేసేటప్పటికి చాలా కోపం వచ్చింది. ఆయన మీద అలిగి మాట్లాడే వాడిని కాదు. వచ్చి పలకరిస్తే మాట్లాడే వాడిని. తాత నాలో change చూసి బాధపడరు. చివరికి డాడీ చెప్పిన course ఏ తీసుకున్న. కాలేజీ మా ఇంటి కి చాలా దూరం అవ్వడం తో హాస్టల్ లో join అయ్యా.
రోజు అమ్మ, నాన్న తో మాట్లాడే వాడిని. తాతయ్య కి నాన్నమ్మ కి ఫోన్ చేసే వాడిని కాదు. అప్పుడపుడు అమ్మ చెప్తూ ఉండేది తాతయ్య నీ గురించి అడిగారు రా ఒకసారి ఫోన్ చెయ్యి అన్ని. నేను అంతగా పటించుకునే వాడిని కాదు. ఇష్టం లేని course లో join చేసినా కాలేజీ లైఫ్ enjoy చేస్తూ, ఒక మాదిరి గా చదువుకుంటూ, నా passion కి కూడా కాస్త టైం ఇచ్చేవాడిని. 5 months అయ్యాయి holidays కి ఇంటికి వెళ్ళాను తాతయ్య చాలా నీరసపడిపోయారు, నా మీద బెంగ పెట్టుకున్నారు అని అమ్మ చెప్పింది .సరిగ్గా తినే వారు కాదు, ఎందుకు అని అడిగిన చెప్పే వారు కాదు అని నాన్న అన్నారు .
అయ్యో అనవసరంగా తాతయ్య తో మాట్లాడకుండా ఉన్నానే అని ఆ రోజే వెళ్లి కలిసాను. తాతయ్య దగ్గిరకి వెళ్లి ఎందుకు అని అడిగితే నీకు ఇష్టం లేని దాంట్లో join చేశా అని చాలా బాధ వేసింది రా, చిన్నప్పటి నుండి ఏది కావళి అన్నా నన్నే అడిగేవాడివి అలాంటిది ఈ సారి నీకు నచ్చినది ఇవ్వలేకపోయా అని బాధతో కుంగిపోయారు తాతయ్య. నేను ఆ విషయమే మర్చిపోయా కానీ తాతయ్య ఇన్ని రోజులు దాన్ని గురించే ఆలోచించి కుమిలిపోయారు. అలా కాదు తాతయ్య మీరు join చేసిన కోర్స్ నాకు నచ్చింది, ఇష్టం గానే చదువుతున్న అన్ని చెప్పా. ఆ మాట విన్నీ వెంటనే కళ్ళు తుడుచుకుని చాలా సంతోషం chinna అని నన్ను హత్తుకుని, చాలా మంచి మాట చెప్పావ్ అన్నారు తాతయ్య.
అంతా మర్చిపోయి కాలేజీ లైఫ్ enjoy చేశా తాత ఏమో నేను మాట్లాడట్లే అని బెంగ పెట్టుకున్నారు. నాకు నచ్చనిది చేయిస్తున్నం అని బాధ పడ్డారు. కనీసం ఒకసారి ఫోన్ చేసి చెప్పాలిసింది నేను నా మొండి అలకలు అని నన్ను నేను తిట్టుకున్నా. Holidays అంత తాతయ్య తో గడిపా అయినా health కూడా recover అయ్యింది.
మనం చిన్న చిన్న వాటికీ parents మీద, అమ్మమ , తాతయ్య మీద అలిగేసి మర్చిపోతాం. వాళ్ళు అల కాదు చాలా sensitive గా వుంటారు, మన గురించే ఆలోచిస్తారు, మనం మాట్లాడట్లే అని దిగులు పడతారు. ఆ బాధ share చేయడానికి కూడా వాళ్లకి ఎవరు వుండరు మనం తప్ప అలాంటిది వాళ్ళ మీద అలిగితే మన కి use ఏమి ఉండదు వాలని బాధ పెట్టడం తప్పా.