కోనసీమ అంటేనే ఒక భూతల స్వర్గంగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ ప్రతి ప్రదేశం చూడదగిన వాటిలో ముందుంటుంది. కోరింగ అడవి కూడా అందులో ఒకటి. 'జూ' లో పంజరంలో చూసే పక్షుల కన్నా ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షులను చూడడానికి మరింతమంది టూరిస్టర్స్ ఇక్కడికి వస్తుంటారు. కొన్ని రోజులు గడపడానికి ఇక్కడ అంతగా సదుపాయాలూ లేకున్నా కాని ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేలా ఉంటుంది. కొన్ని వందల కిలోమీటర్లు విస్తరించిన ఈ మడ అడవి ఆసియాలో ఉన్న అతి పెద్ద అడవులలో ఒకటి. ఇక్కడ 120 రకాల పక్షులు, జంతువులున్నాయి. ఇదే అడవిలో నుండి సముద్రానికి పడవలో 30 నిమిషాల సేపు జర్ని చేసే సదుపాయం కూడా ఉంది. ఇక్కడికి సంవత్సరానికి ఎన్ని పక్షులు వస్తాయో తెలుసా సుమారు 90,000 పక్షులు. ఇది మనకు మాత్రమే కాదు పక్షులకు కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ గా ఉంది.