ఓ రోజు కమేడియన్ బ్రహ్మానందం గారు వారి తల్లి గారు మరణించడంతో దహన సంస్కారాలు పూర్తిచేసి తల్లి జ్ఞాపకాలతో బరువెక్కిన గుండెతో నడుచుకుంటు వస్తున్నారట. అప్పుడు కొంతమంది బ్రహ్మానందం గారిని చూసి "అర్రె బ్రహ్మానందం రా.." అని ఏదో సీన్ గుర్తుచేసుకుని నవ్వుకున్నారట. అప్పుడే బ్రహ్మానందం గారికి ఒక విషయం అర్ధమయ్యింది.. "నటుడు పండించే నవ్వుల గురించే చాలామందికి గుర్తుంటుంది, కాని ఆ నవ్వుల వెనుక దాగున్న విషాదం ఎంతమందికి తెలుసు"..?
తిరుమల సుభాషిని నుండి 'అల్లరి' సుభాషినిగా ఎదిగిన ఈ నటిని చుసినప్పుడు ఆమె చేసిన పాత్రలే మనకు గుర్తుకు వచ్చి నవ్వు తెప్పిస్తాయి. ఎవరినైనా ఏడిపించడానికి అల్లరి సుభాషిని గారితో పోలుస్తూ ఆట పట్టిస్తుంటాము.. ఇందులో వారి మీద అభిమానం కూడా దాగి ఉంటుంది. తనని మాత్రమే కాదు గయ్యాలి అత్తమ్మలను సూర్య కాంతం గారితో పోలుస్తుంటాము.. అనుకువ గల సాంప్రదాయికమైన మహిళలను సావిత్రి గారితో పోలుస్తుంటాము. నెగిటివ్ గా ప్రవర్తించే వారిని రాజనాల గారితో పోలుస్తుంటాము.. చాలా వరకు సినిమాలలో కనిపించే ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలతో వారిని మననం చేసుకుంటాము కాని వారిలోని ఓ బయటి ప్రపంచానికి కనిపించని ఏదో ఒక విషాద కథ దాగి ఉంటుంది. మహానటి సావిత్రి గారు తన చివరి రోజుల్లో డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు.. మహా నటుడు నాటి రాజనాల గారి దగ్గరి నుండి నిన్న మొన్నటి పావలా శ్యామల, సిరిసిల్ల రాజయ్య గారి దగ్గరి వరకు ఎందరో అలా అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. సుభాషిని గారిది మరింత దయనీయమైన పరిస్థితి, ఆర్ధిక ఇబ్బందులతో పాటు సుభాషిని గారికి భయంకరమైన క్యాన్సర్ వ్యాది సోకింది.
నిజ జీవితంలో మాత్రం హీరోయిన్ యే.. సుభాషిని గారిది తిరుపతి. అక్కడ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నా గాని నటన అంటే ప్రేమతో స్టేజ్ మీద ఎన్నో నాటకాలు వేశారు. అలా నాటకాలలోని నటనను చూసి ఎంతోమంది సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. కట్ చేస్తే రమప్రభ, కోవై సరళ, తెలంగాణ శకుంతల గార్ల తర్వాత అంతటి స్థాయిలో మంచి లేడి కమేడియన్ గా పాపులర్ అయ్యారు. తెర మీద తనో కమేడియన్ కావచ్చు కాని తెర వెనక మాత్రం పోరాట పటిమ ఉన్న హీరోయిన్. 20సంవత్సరాల క్రితమే భర్త చనిపోవడం, కుటుంబాన్ని పోషించే బాధ్యత తనపై పడినా గాని బెదరలేదు. ఫైనాన్సింగ్ బిజినెస్ లో కోట్లు, ఆస్థులు, సర్వస్వం పోగొట్టుకున్నా గాని తను నవ్వతూ మనల్ని నవ్విస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం మన సుభాషిని గారు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితులను అనుభవిస్తున్నారో తన మాటల్లోనే ..
అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారు.. టాలీవుడ్ లో డ్రగ్ మాఫియా.. ఇలాంటి విషయాలపై విమర్శించి అంత వరకే మనం పరిమితం అవ్వకూడదు. మనం బాధలో ఉంటే అల్లరి సుభాషిని గారు ఎన్నోసార్లు తన హాస్యంతో మనల్ని నవ్వించారు. ప్రస్తుతం తను బాధలో ఉన్నారు ఇప్పుడు మన వంతు వచ్చింది. తన జీవితంలో ఆనందాన్ని ప్రసాదించే శక్తి మనలో ఉంది. తను ఒక మంచి నటి మాత్రమే కాదు మనలాంటి మనిషే.. మనిషిని కాపాడడానికి భగవంతుడు వస్తాడో రాడో తెలియదు కాదు కాని ఒకసాటి మనిషి మాత్రం తప్పక వస్తాడు అని నిరూపిద్దాం రండి. మన అత్యవసర ఖర్చులు తగ్గించుకుని అవసరమైతే ఒకరోజు భోజనం త్యాగం చేసైనా గాని తోచినంత సహాయం చేసి సుభాషిని గారిని ఆదుకుందాం రండి.. ఇవి తన అకౌంట్ వివరాలు..
NAME: TIRUMALA SUBHASHINI A/C NO: 20094833079 STATE BANK OF INDIA YOUSUFGUDA BRANCH HYDERABAD IFSC CODE: SBIN0011662.