ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి భోజనం పెట్టించడం వల్ల ఒక రోజు కడుపు నిండుతుంది కాని ఒక నిండు జీవితాన్ని మార్చలేకపోవచ్చు అదే ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనంతో పాటు, అతనికి ఆర్ధికంగా అండగా ఉంటు చదువు నేర్పిస్తే..? అతని నిండు జీవితమే కాదు ఆ చదువుకున్న విద్యార్ధి వల్ల ఒక దేశ భవిషత్తే మారగలదు. అన్ని సహయాలలో కన్నా విద్యదానం గొప్పది అని అంటారు అలాంటి సేవ చేస్తూ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మందికి గొప్ప జీవితాన్ని ఇస్తున్నారు తెలుగు పీపుల్ ఫౌండేషన్ సభ్యులు.

ఈ పౌండేషన్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి సహాయం అందుతుంది. కేవలం విద్యార్ధులకు మాత్రమే కాదు స్కూల్స్ లను కూడ ఆదుకుని అందులోని విద్యార్ధులందరికి ఉపయోగపడుతుంది. మనం చాలామందిని చూస్తుంటాం చిన్న కష్టాన్ని కూడా పెద్దగా చూపిస్తు ఫౌండేషన్ వారిని మోసం చేసేవారిని దాని వల్ల మిగిలిన వారికి సరిగ్గా సాయం అందదు.. కాని ఇక్కడ అలా కాదు సహాయం కావాలసిన వారింటికి, ప్రదేశానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పైస వారి కష్టానికి అవసరం అయ్యేలా చర్యలు తీసుకుంటారు. నిజానికి ఈ ఫౌండేషన్ 2004 ఆంధ్రప్రదేశ్ లో సునామి వచ్చినప్పుడే ఎన్నో రకాలుగా సాయం చేశారు, 2008 నుండి $250,000 ఆర్ధిక సహాయంతో గ్రామాలలోని దాదాపు 100కు పైగా విద్యార్ధుల చదువుల కోసం ఖర్చుచేసింది.

సాధారణంగా ఇలాంటి సేవలు చేస్తున్నారంటే స్థాపించిన వారు కూడా పేదరికం అనుభవించి ఆ కష్టాల సముద్రం దాటిన వారికే ఇలా చేయాలనుంటుందని అనుకుంటారు కొంతమంది.. కాని ఈ ఫౌండేషన్ ను Success Fullగా Maintain చేస్తున్న ప్రసాద్ కూనిశెట్టి గారు మంచి సంపన్న కుటుంబంలోనే పుట్టారు. చిన్నప్పుడే నాన్న చనిపోయారు ఆర్ధికంగా ఏ లోటు లేదు. తన కుటుంబంలోని వారంత అందరు ఏదో ఒక బిజినెస్ చేసేవారే.. ప్రసాద్ గారు కూడా అలానే చెయ్యాలనుకున్నరు.. 17సంవత్సరాల వయసులో Student Book Stall అనే Stall ని స్టార్ట్ చేశారు. బుక్స్ అంటే ఇష్టం ఉండటంతో అటు ఓపెన్ యూనివర్సటీలో చదువుకుంటునే ఇటు science quiz, astronomy, earth, various science concepts లాంటి స్టూడెంట్స్ కు ఉపయోగపడె పుస్తకాలు రాసేవారు.

ఆ తర్వాత వివిధ న్యూస్ పేపర్లకు సబ్ ఎడిటర్ గా ఇతర భాద్యతలు నిర్వహించారు.తర్వాత అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు భార్య సత్యవాణిగారు ఇంకా తన తోటి స్నేహితులతో కలిసి అమెరికాలో ఇండియాలో పర్యటించి వివిధ ప్రముఖలతో, ఫౌండేషన్లతో సమావేశం ఏర్పాటుచేసి తెలుగు రాష్ట్రాలలోని పేదవారి పిల్లలకు ఆర్ధికసహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం, శ్రీకాకుళం, గుంటూరు వరంగల్ లో చాలా మంది విద్యార్ధుల భవిషత్తు మార్చారు.