ఒక గ్రేట్ వ్రైటర్ ఒక గొప్ప మాట అంటారు.. "ఈ సృష్టిలో అత్యంత విలువైన బహుమతి 'ప్రోత్సహాం'. అది కురుక్షేత్రంలో అర్జునుడిని తన కర్తవ్యాన్ని నిర్వహించేలా చేసింది, ఆంజనేయుడిని సముద్రాన్ని దాటేలా చేసింది. ఎదుటివారికి Confidenceనీ ఇవ్వడమే అత్యంత విలువైన బహుమతి". అంటారు ఆ గొప్ప వ్రైటర్. అది ఏమైనా గాని మన దగ్గర ఉంటేనే దానిని ఇంకొకరికి మనం పరిపూర్ణంగా ఇవ్వగలుగుతాం.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అరుణ జ్యోతి గారు కూడా తనలో ఎంతో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎందరికో పంచుతుంది.
అరుణలో ఒక లక్ష్యం మీద ధృడ సంకల్పం ఉండడం వల్ల ఇంగ్లాండ్ లో ఎం.బి.ఏ చేసినా గాని ఆ తర్వాత సంవత్సరానికి పైగా జాబ్ చేసినా కాని అదేమి తనకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఉన్నది ఒక్కటే జీవితం దీనిని నాకోసం ఉపయోగించుకుంటాను అని కొంతమందిలా తను ఆలోచించలేదు ఉన్నది ఒక్కటే జన్మ ఈ జీవితంలో నేను సహాయం చేయాల్సిన వారు ఎందరో ఉన్నారు వారు నాలాంటి వారికోసమే ఎదురుచూస్తున్నారని ముందుకు కదిలింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సోషల్ వర్క్స్ చేస్తు ఎంతో మంది జీవితాలను మారుస్తున్నారు.
నాన్న నుండి వారసత్వం: తండ్రి నుండి ఆస్థులు కాకుండా మంచి గుణాలు వస్తే అది గొప్ప వారసత్వ సంపదగా భావించవచ్చు. చిన్నతనం నుండి నాన్న సేవచేస్తుండడం, నాన్న ఇందులో పొందిన ఆనందం ఇంకా నాన్న నుండి వారు పొందిన ఆనందం ముందు తన చేస్తున్న ఉద్యోగం లోని ఆనందం చాలా తక్కువగా కనిపించింది. మొదట తల్లిదండ్రులు ఈ చర్యను ఒప్పుకోకపోయినా గాని సేవా రంగంలో అరుణ దూసుకుపోతున్న వేగాన్ని చూసి వారు కూడా మనస్పూర్తిగా ఆనందపడుతున్నారు.
మొదటి పోరాటం, నిర్మాణ పనులు: యుద్ధం అంటే చంపటం మాత్రమే కాదు బ్రతికించడం కూడా.. 2007 ఉగండాలో భయంకరమైన యుద్ధం జరిగింది. అక్కడి వారిలో భయాన్ని పోగొట్టి సాధారణ శాంతి నెలకొల్పడంతో పాటు అక్కడి వెనుకబడిన వారిని అన్ని రకాలుగా ఉన్నతులను చేయడానికి అరుణ గారు అక్కడ ఉదయించారు. ఇంటర్నేషనల్ లెవల్ లో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే ఈ యుద్ధానికి ఆహ్వానించారు, ఇందులో మన తెలుగు అమ్మాయి అరుణ కూడా ఒకరు. అక్కడివారిలో యుద్ధ భయాన్ని పొగొట్టి, కొన్ని రకాల హాండ్ మేడ్ ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. మొదట కొన్ని ఎన్.జి.ఓలతో కలిసి పనిచేసి ఆ ప్రస్తుతం నిర్మాన్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. నిర్మాన్ పేరుకు తగ్గట్టుగానే వారి నిర్మాణ సేవలు అలాగే ఉంటాయి. వారు చేస్తున్న కొన్ని సేవల గురించి కొంత తెలుసుకుందాం.
School Adoption Program: ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ అని మాత్రమే కాకుండా ఆర్ధికంగా కాస్త తక్కువ స్థాయిలో ఉన్న స్కూల్స్ ని కూడా వీరు దత్తత తీసుకుంటారు. కేవలం కొంతసమయం అని కాకుండా 3 నుండి 5 సంవత్సరాల కాలంలో వీటిని అన్ని రకాలుగా మార్చాలని అందుకు తగినట్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశమంతటా 30కి పైగా స్కూల్స్ ని దత్తత తీసుకున్నారు.(ఇందులో 25మన హైదరాబాద్ లోనివి).
అవంతి: మన మహిళలలో గొప్ప శక్తి ఉంది, అది వారు తెలుసుకునేలా ఇంకా దానిని సరిగ్గా ఉపయోగించుకునేలా వీరి ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పటికి 1,000మందికి పైగా మహిళలకు ఇందులో బెస్ట్ ట్రైనింగ్ అందించారు.
ఇవే కాకుండా Satellite Skill - Centers, Incubation Centers, Threads Of Hope, Vidya Help Line(18004252425), Youth Empowerment Program, Scholarship & Mentor-ship Program లాంటి 25ప్రోగ్రామ్స్ చేస్తూ ఇండియాలోని 6రాష్ట్రాలలో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, గోవా, ఛతీస్ ఘడ్ లో వీరి టీం(800వాలంటీర్స్) వీరి సేవలు, టీం ఉదృతంగా పనిచేస్తుంది.
సూర్యుని పని వెలుగునందించడమే. అతను ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడికి చేరుకోవడానికి ఒక చిన్న దారిలో నుండి అయినా ప్రవేశిస్తాడు. అరుణ గారు ఇప్పటికి పెళ్ళి చేసుకోలేదు. పెళ్ళి చేసుకుంటే ఏం వస్తుంది.? ఒక కుటుంబం.. పిల్లలు.. దానితో పాటు ఒక చిన్ని స్వార్ధం అంతే కదా. సమాజమే నా కుటుంబం, పేదవారే నా పిల్లలు అనుకుంటే తనకు 'నా' అనే చిన్న స్వార్ధం కూడా ఉండదు.. అలా తన అన్ని స్వార్ధాలను ఒదిలి చీకటిలో ఉదయించడానికి నిరంతరం ప్రయాణిస్తున్నారు.
For more details or scope of involving in Nirman, Contact them. What's App: 8897347947, 9676775786, Mail ID: contact.nirmaan@gmail.com