తేగలు ఎన్ని తిన్నా మొహంకొట్టదు!! తేగలు నోట్లో వేసుకుంటే.. కరిగిపోయేంతల తియ్యగా ఉండవు, కారంగా ఉండవు, వాటికి కారం అద్దుకోవాల్సిన అవసరం లేదు, తీపి చేరిస్తే తప్ప రుచిని పెంచుకునే లక్షణము లేదు. తేగల రుచి వేరు. తేగల రుచి తెలియాలంటే తేగలు మాత్రమే తినాల్సి ఉంటుంది. అసలు తేగలు తినడం ఒక ఆర్టు, మొదటిసారి తినేవాళ్ళైతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పోనీలే పాపం అని పక్కవారు గైడెన్స్ ఇస్తే అప్పుడు అసలు రుచి తెలుస్తుంది. వాటిని ఎంచుకోవడం కూడా ఒక ఆర్టే. కొన్ని మొత్తగా ఉంటాయి కొన్ని గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉన్నవి తుంచడానికి తినడానికి బాగుంటాయి. నా లాంటి తేగల ప్రేమికుడు ఐతే మాత్రం తన ప్రియురాలని ముట్టుకోకుండానే చెప్పెయ్యగలడు ఏది బాగుంటుందో, ఏది బాగుండదోనని..
అసలివి ఎలా తయారవుతాయి.? తేగలు తయారుకావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వేసవికాలంలో ఎండకు మనం తాళలేమని ప్రకృతి మామిడిపండ్లను ఇస్తుంది, తాటి ముంజలు ఇస్తుంది. తాటి చెట్టునుండే తేగలు కూడా వచ్చేవి. తాటి చెట్లకు కాసిన కాయలు ముంజలుగా మారుతాయి. అవ్వే కొద్దికాలానికి పండ్లుగా మారుతాయి. అలా మారిన పండ్లు చెట్ల నుంచి రాలిపోతాయి. అలా రాలిన పండ్లను సేకరించి పొలాల్లో గొయ్యి తీసి పూడుస్తారు, పూడ్చిన పండుకు మొలకలు వచ్చి, ఊరి, తేగలుగా తయారవుతాయి. ఈ ప్రక్రియంతా పూర్తికావడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది. అలా తయారైన తేగలను గింజల నుంచి వేరు చేసి, కుండల్లో పెట్టి బట్టీలా పేర్చి కాల్చుతారు. కుండ చల్లారిన తర్వాత కాలిన తేగలను సేకరించి మనకు అమ్ముతారు. బాగా కాలినవి, గట్టిగా ఉన్నవి రుచిగా ఉంటాయి.
తేగలలో విటమిన్స్!! అసలు ప్రకృతి నుండి సహజంగా వచ్చే ఆహారమనంతా మంచివే. తేగలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. 1. తేగల్లో B, B1, B3, C విటమిన్ లు ఉంటాయి. అలాగే ప్రతిరోజూ శరీరానికి అవసరం అయ్యే పొటాషియం, ఒమేగా-3, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. 2. ఇవ్వి ప్రాథమిక దశలో ఉన్న బ్లడ్ క్యాన్సర్ ను అరికట్టగలదు.
3. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా, ఫైబర్ పెద్దపేగులోకి మలినాలు చేరనివ్వదు, టాక్సిన్లను తొలగిస్తుంది. 4. క్యాలరీలు తక్కువగా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు దీన్ని డైట్ లో భాగం చేసుకోవచ్చు.