తండ్రి మల్లారెడ్డి ఒక రైతు, తల్లి బుచ్చమ్మ గృహిని.. అమ్మకు అక్షరం ముక్క రాదు, నాన్నకు అక్షరాలంటే కేవలం పరిచయం మాత్రమే ఉంది ఇక వారికి కలిగన ఏకైక సంతానానికి మాత్రం రచనలలో భారత రత్న పురస్కారం లాంటి అత్యున్నత పురస్కారం ఐన జ్ఞానపీఠ్ ను అందుకున్నాడంటే వారి కొడుకు ఏ స్థాయిలో కష్టపడ్డాడో మనం అర్ధం చేసుకోవచ్చు ఆయనే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. మనందరికి తెలుసు 'తెలుగు' రచయితలలో ఉద్దండులందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ మంది ఉంటారు.. ఎందుకంటే తెలంగాణలో నిజాం రాజుల పాలనలో హింది, ఉర్ధుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా ఆ కాలంలో అంత పాండిత్యం తెలుగు కవులలో కొరవడింది.. కాని ఆ కాలంలోనే పుస్తక రచయితగా, సినీ పాటల రచయితగా తెలుగు అగ్రరచయితలలో ఒకరిగా ఎంతో ఖ్యాతిని సి.నా.రె సంపాదించారు.
సి.నారాయణ రెడ్డి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హనుమాజీ పేట అనే గ్రామంలో 1931న జన్మించారు. ఆరోజులో స్వతంత్రం రాకముందు గ్రామాలలో.. చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి లాంటి ఆలోనలు లేకపోయినా, తల్లిదండ్రులకు అంతగా చదువుకోకపోయినా కాని సి.నా.రె మాత్రం తన బంగారు భవిషత్తుని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. వారి ఊరిలో బడి లేకపోయినా, ఎంతోమంది నిరుత్సాహ పరచిన ఎన్నో కిలోమీటర్లు నడిచి చదువుకున్నారు. చిన్నప్పుడు తెలుగులో కాకుండా ఉర్ధూ మాద్యమంలోనే 10వతరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్ లో చాదర్ ఘాట్ కాలేజిలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఊర్ధూ మాధ్యమం లోనే చదివారు. ఆ తర్వాత తెలుగు మీద మక్కువతో తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ డిగ్రీ పొందారు.
ప్రారంభంలో సికింద్రాబాద్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో లెక్చరర్ గా పనిచేశాడు.. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందారు.. సి.నా.రె 50 ఏళ్ళకు పైగా ఎన్నో వందల పుస్తకాలు రాశారు.. వాటన్నీటిలో 1980 లో రచించిన విశ్వంభర పుస్తకానికి 1988లో జ్ణాన్ పీఠ్ పురస్కారం లభించింది.. సాహిత్యంలో దీనిని భారతరత్నగా పరిగనిస్తారు.. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండవ తెలుగు సాహీతీకారుడు ఆయనే.. అంతే కాకుండా ఈ పుస్తకం తెలుగు ఎం ఏ విద్యార్దులకు పాఠ్యాంశంగా తీసుకున్నారు. ఎన్.టి. రామారావు ప్రోత్సాహంతో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చారు.. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు దాదాపుగా 4000 చిత్ర గీతాలు రాశారు.
ఒక రచయితగా ఆయన అందుకున్న పురస్కారాలు, పదవులు అత్యుత్తమమైనవి .. పురస్కారాలలో: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, కేంద్ర సాహిత్య అకాడెమి,సాహిత్య అకాడెమి, కేంద్ర సాహిత్య అకాడెమి, రాజలక్ష్మీ పురస్కారం, సోవియట్-నెహ్రూ పురస్కారం, అసాన్ పురస్కారం ఇలా మొదలైన పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఆయన చేరుకున్న పదవులలో.. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా(1981), అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా(1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా(1989), ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా(1992), రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, B.R. అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.. ఎక్కడో ఒక మారుమూల పల్లెలో పుట్టి భారతదేశం, ప్రపంచంలోనే ఒక తెలుగు అక్షరానికి, తెలుగువారికి ఎంతో గౌరవం తీసుకువచ్చారు సి.నారాయణ రెడ్డి