ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకం. ఏ ఒక్కరి వేలిముద్రలు ఒకేలా ఉండవు.. ఏ ఒక్కరూ మరొకరిలా దాదాపుగా ఉండరు. అలాగే ఎవరి ప్రతిభ వారిది, ఎవరి శైలి వారిది. వారికున్న ఆ ప్రత్యేకతను నిశితంగా గుర్తించి శ్రమ పట్టుదలతో సహవాసం చేస్తే తప్పక ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. ఈ సూత్రాన్నే బలంగా నమ్మి ఆచరించిన కళాకారుడు తోట వైకుంటం. తోట వైకుంటం గారి శైలి ఒక భిన్నమైనది. వారు వేసిన చిత్రాలలో కనిపించే రంగులు, ఆ బొమ్మల తాలూకు భావనలు మూలంగా తన చేతికి ఆ ప్రత్యేకతను తీసుకువచ్చింది.
"ఆర్టిస్ట్ లు తక్కువ మాట్లాడతారు కాని వారి పేయింటింగ్ లోని భావం బాషతో సంబంధం లేకుండా కోట్ల మందితో మాట్లాడుతుంది". వైకుంటం గారి చిత్రాలు కూడా ఆ ఉన్నత తరగతికి చెందినవే.. 30 సంవత్సరాల ఆ సుధీర్ఘ ప్రయాణం పూల బాటలో సాగలేదు ఎన్నో ముళ్ళబాటలు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కుంటూ నడిచారు. తన చిత్రాలను రూపాయికి అమ్మినరోజులు కూడా ఉన్నాయి కాని ఉన్నత స్థాయికి చేరుకునే మార్గంలో ఏనాడు తనపై తాను నమ్మకం కోల్పోలేదు.. ఒకసారి ముంబాయిలో జరిగిన Art Exhibitionలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వైకుంటం గారి పేయింటింగ్ ను లక్షరూపాయలకు కొనుగోలు చేసేసరికి తన పేయింటింగ్ లోని గొప్పతనం అందరికి తెలిసింది. ఇక అప్పటి నుండి తన గమనం వేగం పెంచుకుంది.. ఆ గమనంలో తనలాంటి వారిని ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతూ దేశానికి అందిస్తున్నారు.. కేవలం చిత్రాలే కాకుండా Art Director గా కూడా తనకు బాగా నచ్చిన కొన్ని సినిమాలకు పనిచేసారు.. "దాసి" అనే సినిమాకు జాతీయ ఉత్తమ కళా దర్శకునిగా నేషనల్ అవార్డును అందుకుని తన ప్రతిభను జాతీయ స్థాయిలో నిరూపించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.