అన్వేష్ కి చిన్నతనం నుండి క్లాస్ రూంలో పుస్తకాలు చదవడం కన్నా బయటి ప్రపంచపు సమాజాన్ని చదవడం అంటేనే ఇష్టం. మనందరం చాలామంది ఆర్టిస్టులను చూస్తుంటాం ఉన్నది ఉన్నట్టుగా అద్భుతంగా గీసేవారిని, క్యారికేచర్స్, కార్టూన్స్ ఇలా రకరకాలుగా వేసేవారిని కాని అన్వేష్ వీరందరి కన్నా చాలా ప్రత్యేకం.. తన పేయింటింగ్స్ తో సమాజంలోని సమస్యలను ఆలోచనాత్మకంగా వివరిస్తూంటారు. అన్వేష్ ఫైన్ ఆర్ట్స్ లో పీ.జి పూర్తిచేశారు. సినిమాలకు స్టోరీబోర్డ్ అందిస్తూ మంచి ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతునే సమయం దొరికినప్పుడల్లా ఇలా మౌనంగా గుండెకు హత్తుకునే పేయింటింగ్స్ వేస్తుంటారు. తన పేయింటింగ్స్ తో మన దేశంలో చాలా చోట్ల ప్రదర్శనలిచ్చారు. "ఒక మహిళకు తెలుసు తన మహిళ లోకంలో చెడ్డవారు కూడా ఉన్నారు అని, అలాగే మగవారికి తెలుసు తమ జాతిలో నమ్మించి మోసం చేసేవారు కూడా ఉన్నారు అని.. అన్వేష్ ఈ ఇద్దరి సమస్యలను వివరిస్తూనే వారి జీవితానికి అవసరమయ్యే మోటివేషన్ ని అద్భుతంగా ఇస్తున్నారు".
ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం ఉంది, ఒకరికి ఒకలా కనిపించింది మరొకరికి మరోలా కనిపిస్తుంది. ఇలాంటి పేయింటింగ్స్ ను వర్ణించకూడదు.. వర్ణిస్తే ఒక సరిహద్దును నిర్ణయించినట్టు ఉంటుంది. కాని కేవలం పెయింటింగ్స్ మాత్రమే చూపిస్తే చాలామందికి అర్ధం కాకపోవచ్చు. అందుకే ముందు ఆ పెయింటింగ్ కాన్సెప్ట్ అర్ధం అయ్యేలా కొంతవరకు వర్ణించడం జరుగుతుంది. (దానిని పూర్తిగా అర్ధం చేసుకునేందుకు దారిని మాత్రమే చూపించడం జరుగుతుంది)
1. ఇప్పుడు చాలామంది వారి డ్రెస్ గురించి, మేకప్ గురించి, నగల గురించి మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ అవి అందంగా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారే తప్పా నిజమైన అందం అనేది వారి వ్యక్తిత్వం, మనసు అని గుర్తించడం లేదు.
2. పూర్వం కొన్ని దేశాలలోని మగవారు వ్యాపార రీత్య ఇంటిని కొన్ని నెలలపాటు వదలి వెళ్ళేవారట. అలా వెళ్ళేటప్పుడు మరొక మగవాడు తమ భార్యతో గడపకూడదని అనుమానంతో ఇలా ఒక కవచం వేసేవారట. నాటి అనాగరిక అనుమానపు పరిస్థితులు ఇప్పుడు కూడా వచ్చే ప్రమాదం ఉందో ఏమో అని ఊహించి గీసిన చిత్రం.
3. ఇది ఒక సంగీత పాఠశాల కోసం గీసిన చిత్రం. ఇందులో చెట్టు సంగీతమైతే ఆ చెట్టుమీద వాలే పక్షులు విద్యార్ధులు అని అర్ధం వచ్చేలా గీశారు.
4. వేసుకునే దుస్తువులను మాత్రమే కాదు మీ మనసులను, మిమ్మల్ని కూడా శుభ్రం చేసుకోవాలి.
5. ఇందులో కనిపించే యాపిల్స్ మన ఇష్టాలు, లక్ష్యాలు. ఐతే అక్కడికి చేరుకోవడానికి ఓపికగా, మన వంతు కృషి చేస్తూనే కాలంతో ప్రయాణించాలి. అంతేకాని కాలంతో ప్రయాణించకుండా జీవితాన్ని మధ్యలో ఆపేయకూడదు అనే భావన ఇందులో కనిపిస్తుంది.
6. ప్రస్తుతం మన సమాజంలో మహిళను చాలామంది ఈ రకంగా చూస్తున్నారు అని అన్వేష్ అభిప్రాయం. ప్లగ్ బాక్స్ మహిళ ఐతే తన చుట్టూ ఉన్న ప్లగ్స్ మగవారిగా చూపించారు. ఎవడికి నచ్చినట్టుగా వాడు మహిళను వాడుకుంటున్నాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రేప్ చేస్తున్నాడు, నమ్మించి మోసం చేస్తున్నాడు. కాని అక్కడ ఉన్నది మహిళ అనే పవర్. తనకు ఒక్కసారి గనుక కోపం వస్తే షాక్ ద్వారా మాడిపోతారు జాగ్రత్త. అని వార్నింగ్ ఇచ్చేలా కూడా ఉంటుంది.
7. చేతిరేఖలు, జాతకాలు, రాహుకాలం, అమృత ఘడియలు, మంచిరోజు అని కాదు మీ కష్టాన్ని నమ్మండి. ఆ కష్టమే మీకు మంచి సమయాన్ని తీసుకువస్తుంది.
8. మన భవిషత్తు ఉన్నతంగా ఉండాలంటే అందుకు బలమైన పునాది యువకునిగా ఉన్నప్పుడు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆ యువకాలంలోనే అమ్మాయిలు, అనవసర చెడు ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ. ఈ చిత్రంలో యువకుడు ఒక మస్కిటో కాయిల్ ద్వారా ఎలా ఆ ఆలోచనలు ఎదుర్కుంటాడో మనం కూడా ఏదైనా ఒక వ్యాపకంతో ఆ ఆలోచనలు ఎదుర్కోవాలి.
9. మనిషి తనకు నచ్చినట్టుగా కాకుండా సమాజం కోసం బ్రతుకుతున్నాడు. అందుకోసం ప్రతిరోజు తన సహాజ వ్యక్తిత్వంతో కాకుండా రకరకాల మాస్క్ లు తొడుక్కుంటున్నాడు. అలా కాకుండా మన మదిలో పంజరంలో బంధింపబడిన ఆలోచనలను, ఇష్టాలను వారి సహజ వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛగా ఒదిలేయాలని అన్వేష్ సూచన.
10. దేశానికి స్వతంత్రం వచ్చినా కాని, శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో సాధించినా కాని ఇంకా సగానికన్నా ఎక్కువ భారతీయులు మూడనమ్మకాలు అనే ముసుగులో బ్రతుకుతున్నారు ఆ ముసుగు తీయాలి.. తీస్తేనే అసలైన ఆనందం, వెలుగు, ప్రపంచం కనబడుతుంది.
11. నిన్నటి తరంలా కాకుండా మహిళలు ఇంకొకరి మీద ఆధారపడి బ్రతకకుండా ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఎంతోమంది మృగాలు కర్కశంగా ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మృగాల క్షణకాలపు ఆనందం కోసం మహిళల నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు.
12. "ప్రేమలో విఫలమైన ఓ ప్రేమికుడు, నన్ను తను ఇబ్బంది పెట్టినా నేను మాత్రం మనస్పూర్తిగా ప్రేమిస్తూనే ఉంటాను". (తనని ఆ అమ్మాయి అలా దహిస్తున్నా కాని ఆ ప్రేమించిన అబ్బాయి కాలుతూ ఆ వచ్చే పొగలో కూడా తన ప్రేమనే చూపిస్తున్నాడు..)
13. ఒక స్త్రీ కనిపిస్తే ఎంతోమంది చూపుల్తో అలా దాడి చేస్తారు.. (అండం చుట్టు Sperm అటాక్ చేసేటట్టుగా దాడి చేస్తారు అని సింబాలిక్ గా చూపించారు.)
14. మన జీవిత చక్రాన్ని పాదాల గుర్తులతో వివరిస్తున్నారు.. ముందు తల్లిదండ్రుల ద్వారా మనం ఇక్కడికి వస్తాము.. బుడి బుడి నడకల దగ్గరి నుండి నడక నేర్చుకుని చెప్పులు వేసుకుంటాము.. తర్వాత ఆఫీసుకు వెళ్ళేటప్పుడు షూ వేసుకుంటాము.. పెళ్ళి చేసుకుంటే రెండు అడుగులు కాస్తా జీవిత భాగస్వామితో నాలుగు అడుగులు అవుతాయి.. ఆ పాదాలు కాస్తా మరొక పిల్లోడికి జన్మనిస్తాయి.. ఆ తర్వాత శవంగా మారిపోతాయి.
15. మనం ఏ పనిచేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే మనం నడవము. మన టైం కూడా మారదు.!
16. "ప్రకృతిని అభివృద్ధి మానభంగం చేస్తున్నట్టుగా" (ప్రకృతిని ఒక స్త్రీగా చూపిస్తూ ఆమెను బలవంతంగా మానభంగం చేసే వ్యక్తిని ఇప్పుడు మనం పరిశ్రమలను స్థాపించి ఏదైతే Development అని అనుకుంటున్నామో దానిని ఒక వ్యక్తిగా చూపించడం జరిగింది.)
17. ఇందులో ఒక ఆడ, ఒక మగ ఉన్నారు. అమ్మాయి ముఖంలోని టైం ముళ్ళులు ధృడంగా ఉన్నాయి అంటే ఆ అమ్మాయి టైం బాగుంది అన్నట్టు.. తన కింద దిగజారిపోయినట్టుగా ఉన్న అబ్బాయి ముఖంలోని టైం ముళ్ళులు వంగిపోయి ఉన్నాయి అంటే అతని టైం ఏం బాగోలేదు అని అర్ధం. ఆ అబ్బాయి టైం బాగోలేకపోయినా తన చేతికి ఇతరుల సూటిపోటి మాటల బాణాలు గుచ్చుకున్నా కాని అమ్మాయి ఆనందం కోసం పువ్వు ఇస్తుంటాడు. కాని ఆ అమ్మాయి మాత్రం తన చేతితో ఆ అబ్బాయిని కీలుబొమ్మ చేసి ఆడుకుంటుంది.. ఆ కింద ఉన్న చిన్న గడియారాలు ఆ అబ్బాయి భవిషత్తు బాగుంటుందో లేదో అని భయం భయంగా చూస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది.
18. కొంతమంది అమ్మాయిలు డబ్బును బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటారు అని సింబాలిక్ గా..
19. మీ భార్యను/ భర్తను ఎలా ఐతే ప్రేమిస్తారో అంతే స్థాయిలో ప్రకృతిని కూడా ప్రేమించాలి. మీలో మీ జీవిత భాగస్వామి ఎలా ఐతే ఒక భాగమో అలా ప్రకృతి కూడా ఒక భాగం.
20. Mana(Raja)mouli
21. Vodka Women Varma