తను వేసే ప్రతి అడుగు లో వింటున్న ప్రతి పాట లో తన ప్రేమ ని గుర్తుచెసుకుంటున్న ఒక Love Failure కథ - A Short Story

Updated on
తను వేసే ప్రతి అడుగు లో వింటున్న ప్రతి పాట లో తన ప్రేమ ని గుర్తుచెసుకుంటున్న ఒక Love Failure కథ - A Short Story

Contributed By Bharadwaj Godavarthi

Time: 9:30 PM Ameerpet కుంభవృష్టిగా వర్షం, Sharing క్యాబ్ ఎక్కిన '30' నిమిషాలకి చుట్టూ లౌడ్ పాప్ మ్యూజిక్, చెవులు హోరెత్తిపోతున్నాయ్, నిశ్శబ్ధానికిఅస్సలు అవకాశంలేని ప్రదేశంలో నేనున్నా. ఎటునుండి వచ్చిందో తెలియదు, నీ జ్ఞాపకం అప్పటిదాకా ఆచూకీ లేని నిశబ్ధం, నన్ను హత్తుకున్నట్లు అనిపించింది!! అద్దంపై పడే ప్రతి చినుకు దారిని మూసేస్తున్నాయి, నా దరికి చేరే ప్రతి నీ జ్ఞాపకం నిరాశతో కుంగిపోయిన నా ఆశకు కొత్త దారులను చూపిస్తోంది. నాకున్న జ్ఞాపకశక్తికి నువ్వో గతించిన జ్ఞాపకానివి అనుకున్న, కానీ ఈ నిశిలో కూడా నన్ను వదలని నా నీడవైనావు. నాలుగు చక్రాల బండి చాలా వేగంగా పరిగెడుతోంది, కానీ నీ జ్ఞాపకాలతో నా కాలం ఇక్కడే ఆగిపోయింది!! నువ్వు పక్కనే ఉన్నపుడు రాని మాటలు, నీ జ్ఞాపకాలతో మాత్రం చాలా మాటలను మాట్లాడతాయి. నీతో మాట్లాడిన మాటలు తక్కువే , కానీ నువ్వు మాట్లాడినప్పుడు నీ ఊపిరికి ఊగే నీ జుంకాలని వర్ణించడాని ఎన్ని పేజీలు రాయాలి.

Anonymous Guy: అన్నా, మంచి మాస్ సాంగ్ పెట్టు. ----- "ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, కన్నైన కొట్టవే జిగేలు రాణి, Anonymous Guy: అబ్బా, కేక పాట అన్న, సౌండ్ కొంచం పెట్టు. "Sound Increased" ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, కన్నైన కొట్టవే జిగేలు రాణి, ముద్దేమో మునసబుకి పెట్టేసానే, కన్నేమో కారణానికి కొట్టేసానే.... ----" నేను: అబ్బా, ఏంట్రా విడి గోల!!దీన్నమ్మ జీవితం, కనీసం ఒక మంచి డ్రీం sequenceని కూడా వదలరు. "Connected My Head Set and Selected a Song" "అంతేలేని ఏదో తాపం ఏమిటిలా , నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా!! చంతచేరిసేదతీరా ప్రాయమిలా, చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా!! కాలాలు మారినా, నీ ధ్యాస మారునా, అడిగింది మొహమే, నీ తోడు ఇలా , ఇలా!!"

"నీ పై మోహము ఉందో, లేదో నాకు తెలీదు!! కానీ నీ తోడు మాత్రం ఎప్పుడు నేను కోరుకున్నా." అదేంటో, చాలాసార్లు పాటలు వినేటప్పుడు playlistలో పాటలు అలా ప్లే అవుతూ ఉంటాయి, ఒకొక్కసారి బాగా ఇష్టమైన పాట కూడా నచ్చదు!! Next, Next, Next, ఏ పాట పూర్తిగా వినబుద్ధి కాదు, లిరిక్స్ అసలు వినే సహనమే ఉండదు!! కానీ, అదేంటో నీ జ్ఞాపకం, నన్ను తాకగానే ప్రతి పదం వినపడుతుంది!! ప్రతి పాటలో నువ్వే, ఒక్కోసారి విరహగీతం, ఒక్కోసారి ప్రేమగీతం, ఒక్కోసారి విషాదగీతం, ప్రతి దాంట్లో నీ తలపే, నువ్వో తెలీని ఉద్వేగానివి,

Anonymous Guy 1 in Call: వర్షం కుమ్మేస్తోందిరా బాబు, తగ్గేట్లు లేదు, సోదిలో వాన, ఇప్పుడే పడాలా!! నేను వాడిలానే!! వాన పడ్డా, కొంచం ఎండ ఉన్నా, ప్రకృతిని ఎప్పుడు విసుకుంటూ పరిగేతే నేను, నువ్వు ఆలోచనలోకి రాగానే అదే ప్రకృతి చాలా అందంగా కనపడుతుంది. అదేంటో మరి? వర్షపు మట్టి వాసన, సన్నని చినుకులోని సొగసు, నీ చీరంచంత సొగసైన మంచు, ఇలా నీ తలపు ఎన్నో వర్ణాలను ఆవిష్కరిస్తుంది నాలో!! Anonymous Guy 2 in Call: What Kind of Manager he is??Because of him I am not even able to sleep properly!!He is even into my dreams!! Dreams!! కలలు, నువ్వు కూడా, నా కలలోకి చాలా సార్లు వస్తావు??వాళ్ల మేనేజర్లా బయపెట్టవులే. చాలా ముచ్చట్లు చెప్తావు. నిన్ను నా కనుపాపల అంచున నిజాన్ని చేసి బందించేయాలని చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటాను!! నువ్వేమైనా మామూలు అమాయివా?? గడుసు పిల్ల!! ఆ కనుపాపలని విడదీసి, క్షణాలలో ఆ జ్ఞాపకాలని మర్చిపోయే కలవైపోతావు!! Cab Driver: సర్, వచ్చేసాం "Reached Home After 5 minutes of Walk". "Door Knocked"..."Door Opened"

తను: అయ్యో ఏంటండీ, అలా తడిసిపోయారు , ఇందా ఈ towel తీసుకోండి. నేను: పర్లేదు, నేను తీసుకుంటా. తను: మామయ్య ఫోన్ చేసారు, మిమల్ని ఇంటికి వచ్చాకా ఒకసారి ఫోన్ చేయమన్నారు. నేను: సరే తను : టీ నేను: OK!! మనం ఒకరితో మన జీవితాన్ని ఊహించుకుంటే, జీవితం వేరొకరు ఊహించుకున్న జీవితాన్ని మనకి ఇస్తుంది. నచ్చినా, నచ్చకపోయినా.!! నీతో ఏడడుగులు వేయలేకపోవచ్చు, అర్ధభాగమై జీవితాంతం తోడుగా నడవలేకపోవచ్చు, నాలుగు గదుల లోపల, నలుగురు మనుషుల వెలుపల, నా ప్రేమని నీతో పంచుకోకపోవచ్చు!! ఇవ్వని జరగకపోవచ్చు, కానీ నిన్నెపుడు నేను మర్చిపోలేదు. అయినా మర్చిపోడానికి నువ్వో జ్ఞాపకమా, నా చివరిశ్వాస దాకా నాలో మమేకమైపోయిన ఒక అనుభూతివి. In between her wife plays an song in you tube and lyrics says నీ శ్వాసను నేనైతే, నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం!! చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం