(దేహంలోని గాయం దాచితే మనకే ప్రమాదం.. గాయం బయటపడి, దాని గురుంచి వివారిస్తేనే శరీరానికి ఉపశమనం.. అలాగే మన దేశంలోని కొన్ని ప్రాంతాలలోని సమస్యల గురుంచి పరిపూర్ణంగా తెలుసుకుని అందుకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తేనే మన దేశానికి ఉపయోగం. ఆ ఉద్దేశ్యంతోనే ఈ ఆర్టికల్ రాస్తున్నాము)
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా గాని స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెందింది. 70 సంవత్సరాల తర్వాత చూసుకుంటే తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యున్నత రాజధానులలో ఒకటిగా నిలిచింది. ఐనా తెలంగాణాలోని మిగిలిన ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ లోని పాత బస్తీలోనూ కొన్ని సమస్యలు ప్రజల అభివృద్ధికి ఆటంకాలకు అవరోధాలుగా ఉన్నాయి. అర్షద్ షేక్( 9052039855) అనే యువకుడు ఇంకా అతని మిత్రులు షేక్ వహీద్ పాషా, అస్మ "Today's Kalam Foundation" ద్వారా పాతబస్తీలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలపై ప్రేమతో యుద్ధం చేస్తున్నారు..
సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు:
జగ్గయ్యపేట సమీపంలో అర్షద్ నాన్నగారు 10,000 బర్డ్స్ తో పౌల్ట్రీ బిజినెస్ చేస్తున్నారు. అర్షద్ గారు కాకినాడ జే.ఏన్.టి.యూ లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. అనుకుంటే అమెరికా వెళ్ళవచ్చు లేదంటే ఇక్కడే ఏదైనా సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేయొచ్చు. ఇవి రెండు కాకుంటే నాన్నగారి నుండి పౌల్ట్రీ బిజినెస్ ను తను తీసుకోనూవచ్చు. దేశంలో ఇన్ని సమస్యలున్నాయి.. వీటన్నిటిని పట్టించుకోకుండా నేను నా దారి నేను చూసుకుంటే ఎలా అనే గిల్టీ ఫీలింగ్ అర్షద్ గారిని తీవ్రంగా తొలచివేసింది..అర్షద్ గారు మొదట యూత్ ఫర్ సేవ, వందేమాతరం ఫౌండేషన్ తో పాటు రకరకాల ఎన్.జి.ఓ లతో కలిసి పనిచేశారు. ఈ వాలంటీర్ ప్రయాణంలోనే పాతబస్తీలోని సమస్యలపై, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసే అవకాశం దొరికింది. దేశ సేవకై వెళ్ళే దారిలోని సమస్యల కన్నా దేశ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు చాలా పెద్దవి వారే నాకు స్పూర్తి అని అర్షద్ గారు 2011 నుండి సేవా ప్రస్థానం మొదలుపెట్టారు.
బాల్యవివాహాలు:
15 సంవత్సరాలు రాగానే ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలను అరబ్ షేకులకిచ్చి ఎదురుడబ్బు తీసుకుని పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ వయసుమళ్లిన అరబ్ షేక్ లు ఇక్కడ కొంతకాలం గడిపి తిరిగి అరబ్ దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడి మహిళలు చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లలు కూడా "అనేమియా" అనే వ్యాధితో పుట్టే అవకాశం ఉంటుంది. ఆ వయసులో తల్లికి పాలు కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న "Mother's Milk" బ్యాంక్ లో ఎక్కువ ఉపయోగించుకునేది ఈ బాదితులే. అర్షద్ ఇంకా అతని మిత్రులు కలిసి Today's Kalam Foundation ద్వారా ఎక్కడ ఇలాంటి బాల్య వివాహాలు జరిగినా తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ కొంతమందినైనా కాపాడగలుగుతున్నారు. అలాగే అంతచిన్న వయసులో పెళ్ళిళ్ళు జరిగి ఎటువంటి ఆధారం లేకుండా గడుపుతున్న ఆ మహిళలకు Skill Development Training ఇస్తూ వారికంటూ ఓ కొత్త జీవితాలను అందిస్తున్నారు.
Child Education:
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అందరితో కలిసి నడవాలంటే తగిన విద్య అవసరం. పాతబస్తీలోని మదర్సా స్కూల్స్ పూర్తిగా పవిత్ర గ్రంథం ఖురాన్ కు సంభందించిన బోధనలే ఉంటున్నాయి. డిమాండ్ తగిన స్కూల్స్ కూడా ఇక్కడ అంతంత మాత్రమే. ఓపికతో తల్లిదండ్రులతో మాట్లాడి, వారికి ప్రస్తుత పరిస్థితులను వివరించి ఒప్పిస్తున్నారు. ఇది మనం అనుకున్నంత సులభం కాదు ఎన్నో సమస్యలతో కూడుకున్నది. వీటితో పాటుగా నేటి పోటీ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా టీచింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో షేక్ అర్షద్, అస్మ, వహీద్ గార్లు పిల్లలకు మరికొంత వాలంటీర్లతో Modren Education చెబుతున్నారు.
GHMC అధికారిక లెక్కల ప్రకారం మన హైదరాబాద్ లో 1179 స్లమ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వీటి సంఖ్య తగ్గకపోగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా విద్య లేకపోవడం, అక్కడివారిలో లోకజ్ఞానం అంతంత మాత్రంగా ఉండడం వల్ల ఎన్నోరకాల అడ్డంకులను వారు ఎదుర్కొనలేకపోతున్నారు. కేవలం ఓల్డ్ సిటీ అనే కాకుండా Today's Kalam Foundation GHMC పరిధిలోని దాదాపు 20 స్లమ్స్(ప్రస్తుతానికి, భవిషత్తులో మరిన్ని చోట్లకు విస్తరించబోతున్నారు) లో టీమ్ సహాయంతో మాటలతో చేతలతో మార్గనిర్ధేశం చేస్తున్నారు.
అనుకున్నది నెరవేరుతుందా..? అంటే అది అనుకుండగానే నెరవేరదు.. ఒక విత్తనాన్ని ఎన్నుకున్నాక దానిని సరైన విధంగా నాటాలి, మొక్కగా ఉండగానే తినే మేకల బారినుండి కంచె వేసి కాపాడాలి, కలుపు తీయాలి, ఏవైనా చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ తర్వాతనే చెట్టు నీడను, పండ్లను ఆఖరికి చనిపోయాయినా కట్టెలను అందిస్తుంది.. అర్షద్, వహీద్, అస్మ గార్లు నాటిన ఈ మొక్కను వారు మాత్రమే కాదు మనము కాపాడుకోవాలి..
For Donations through Tez app number: 9966950721 & Paytm number: 9618243916
Website: Today's Kalam