Contributed by Narra Sivaramakrishna
మనిషి మనిషికి దూరాలు , ఒకరితో ఒకరికి సంబందం ఉండని జీవితాల మధ్య రోజు ట్రాఫిక్ సిగ్నల్ వైపు చూస్తూ రోజులు గడుపుతుంది ఆ ముసలిది జీవితం కొన్నల్లే అని తెలిసినా ఇంకా బతకడానికి ఆరాటపడుతోంది ఆ ముసలి దేహం ఇంకెప్పటికి ఆ అవ్వకి జీవితం మీద మోజు పోతుందో ఆ కళ్లు కన్నీళ్లతో తడిసి తడిసి వానకి నానిన గోడ పెచ్చుల్ల ఉన్నాయి పెద్ద ఆసుపత్రికి వెళ్దాం అని చెప్పి తనను ఇక్కడ వదిలి వెళ్ళిన కొడుకును తలచుకుంటూ ఇలా అనుకుంటుంది ముసలిది ఈ సంవత్సరం కాలం అయిందో లేదో , వరిచెను ఎన్ని బత్తలూ పడిందో నా బిడ్డ ఎన్ని బాధలు పడుతున్నాడో నిద్ర లేచింది మొదలు అవ్వ అని నా చెంగు పట్టుకొని తిరిగే నా మనవడు ఎలా ఉన్నాడో కధ చెప్పందే నిద్రపోని నా తల్లికి నా కధ తెలుసో లేదో అని బాధపడుతున్న ముసలిది ఒక్కసారిగా కళ్ల పైన రంగులు మారడం చూసింది అటువైపున్న చక్రాల బండ్లు ఆగిపోయాయి కళ్ళలో ,కాళ్లలో లేని శక్తిని నింపుకొని బతుకు వేటకు బయలుదేరింది ముసలిది ముసలిదాన్ని చూసి అయ్యో పాపమ్ అనే వారు కొందరు ఈ ముసలిది ఎప్పుడు ఇక్కడే చస్తది ఎంత కావాలి దీనికి బతకడానికి అనుకొనే వారు కొందరు ఇంతలో ఎటువైపు నుంచి వచ్చాడో ట్రాఫిక్ పెద్దాయన చూస్తూనే ముసలిదాన్ని అటు వెళ్ళు ముండా అని తోసేశాడు పాపం ముసలిదానికి చక్రాల బండి లేదుగా అదో ఇదో చెప్పి డబ్బులు గుంజాడానికి ఆ ట్రాఫిక్ పెద్దాయన తల్లి ఎప్పుడో స్వర్గాన్ని చేరింటుంది ఏమో స్వర్గానికి వెళ్లిందో , నరకనికో ఈయన్ని కన్నదిగా ఇంతలో ఓహ్ పెద్దాయన ఇటు విను బతికిస్తున్నాము అని చెప్పి శ్రామికుల శ్రమను దోచుకునే భూస్వాముల కన్నా నీటికి ,నిప్పుకి ,గాలికి లెక్కలు కట్టే వ్యాపారుల కన్నా నిత్యం సమాజాన్ని దోచుకునే రాజకీయ నాయకులకన్న ఈ ముసలిది అడుక్కోడం వల్ల దేశానికి వచ్చే దారిద్య్రం ఏమి లేదు అని చెప్పే వాడు లేడేమో ఉంటే ఆ అవ్వకి ఈ గతి పట్టదేమో !