ఇద్దరు వ్యక్తులు నగరానికి కొత్తగా వచ్చారు.. వారికి ఆకలి వేయడంతో ఒక ప్రత్యేక ప్రదేశంలో మంచి భోజనం చెయ్యడానికై రెస్టారెంట్ కోసం వెతికారు. అసలు అక్కడ ఏ రెస్టారెంట్ లేదని తెలిసింది. ఈ విషయం తెలియడంతో వారిద్దరిలో ఒకరు ఆకలితో మరింత బాధపడుతున్నాడు కాని Entrepreneur అవ్వాలి అని కలలుకంటున్న రెండో వ్యక్తి మాత్రం 'వావ్ నాకు మంచి రెస్టారెంట్ స్టార్ట్ చెయ్యడానికి ఒక మంచి Place దొరికిందని సంబరపడ్డాడు'. Necessity Is The Mother Of Invention అంటారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడొక కొత్తది ఉద్భవిస్తుందనమాట. మన విశాఖపట్టనానికి చెందిన రామచంద్ర గారికి Entrepreneur అవ్వాలనే ఉద్దేశం ఉండడం, ఇంకా చెట్లను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేవారు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో ఏడు సంవత్సరాల క్రితం Green Morning Horticulture Service Pvt. Ltd (040-64590459) ప్రారంభించారు.
రామచంద్ర గారికి చిన్నప్పటి నుండి చెట్లంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే తన కెరీర్ గా మార్చుకోవాలని డిగ్రీలో Bsc Agriculture, PGలో Msc Agriculture చేసి ఈ రంగంలోకి వచ్చారు. చెట్లు దారికి అడ్డంగా ఉంటే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు సులభంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించవచ్చు కాని అవి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద చెట్లు అయ్యాక అక్కడి నుండి తీసేయాలంటే వాటిని నరికేయడం తప్ప ఇంకొ మార్గం లేకపోయేది. చెట్లు ఒక చోటు నుండి మరో చోటుకు తరలించడం Developed Countriesలో జరిగేవి.. గ్రీన్ మార్నింగ్ సంస్థ వల్ల ప్రస్తుతం ఆ మాట గతం ఐపోయింది.
2010లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రీన్ మార్నింగ్ సంస్థ సుమారు 5,000 చెట్లను ఒకచోటు నుండి మరో చోటుకు తరలించారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ పనులు ప్రారంభమైనప్పుడు మెట్రో మార్గంలో కొన్ని వేల చెట్లు అడ్డు వచ్చాయి.. GHMC వారికి చెట్లను సురక్షితంగా తరలించాలని తపించారు.. ఇందుకోసం గ్రీన్ మార్నింగ్ సంస్థతో కలిసి సుమారు 800 చెట్ల వరకు సురక్షితంగా ఇంకో ప్రాంతానికి తరలించారు. అవసరమైన మిషన్స్ ఉన్నాయి ఇంకేంటి సులభంగా తరలించవచ్చని అనుకోవచ్చు కాని ఒక్కసారి చెట్టును భూమి నుండి తీసాక మళ్ళి త్వరగా భూమిలో నాటాల్సి ఉంటుంది.. ఇందుకోసం గ్రీన్ మార్నింగ్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుని నాటుతారు. డబ్బులు సంపాదించడం మన లక్ష్యం కావచ్చు కాని ఇలా సమజానికి ఉపయోగపడుతూ సంపాదించడం వల్ల నిజమైన ఆనందం ఉంటుంది.