Contributed by M Praveen Kumar
ఇది ఒక చీకటి గది లొ నిజం కి అబద్ధం కి మధ్య జరిగే సంభాషన.సంభాషణ జరుగుతుండగా నిజం కి అబద్ధం కనిపించదు అబద్ధం కి నిజం కనిపించదు చివరి లో తప్ప. ఇందులో నిజం అ అయితే అబద్ధం ఆ. అబద్ధం మాట్లాడుతున్న ప్రతిసారి కారెక్టర్ మారుతూ ఉంటుంది కానీ నిజం మాత్రం ఒక్కటే కారెక్టర్.మనము స్క్రీన్ మీద మాత్రం నిజం ని అబద్ధం ని చూడచ్చు.
అ: నిజం
ఆ: అబద్ధం
అ: అబద్ధం అనేది ఒక నిజం
ఆ: నిజమనేది కూడా ఒక అబద్ధం
అ:చంద్రుడు లేని వెలుగును తరిమే చీకటి చాలా త్వరగ అలిసిపోతుంది నిజం ఎప్పటికి అబద్ధం కాలేదు, నేనున్నoత వరకు అబద్ధం అనేదే లేదు పుట్టదు
ఆ: హెహ్....! నికొక చిన్న కథ చెప్తాను.. అనగనగా ఒక ఊరి లొ మంచి అనే వాడు ఉండేవాడు.అదే ఊరిలొ చెడు అనేవాడు కుడా ఉన్నాడు. ఇద్దరూ ఎవ్వరికి సంబంధం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. కానీ కాలం కి ఇదంతా నచ్చలేదు.ఒకరోజు తన కొడుకైన నమ్మకం తో వెళ్తున్న మంచికి చెడు ని ఎదురుఅయ్యేల చేసింది.పాపం ఆ ఎదురాటలో మంచి చచ్చిపోయింది.ఇదంతా చూసిన ధైర్యం నమ్మకాన్ని ఓదార్చి వెళ్ళిపోయింది.అప్పుడే నమ్మకం కి ఒక ఆలోచన వచ్చి దేవుడిని ఆడిగాడు వెంటనే,ను ఒకేసారి అందరికి కన్పించు అప్పుడైనా భయంతో మనిషి మనిషి లా బ్రతుకుతాడు అని కోరారు అంట. అప్పుడే నమ్మకం కి ఓర్పు సహనం పరిచయంఅయ్యారు.వాళ్ళ మధ్య మిత్రుత్వము చాలా బలపడింది.ఇలా సాగుతుండగా
ఒకరోజు నమ్మకం చచ్చిపోయింది.అప్పుడే ఒక అబద్ధం పుట్టింది.కొడుకు మూడవసారి పులి వచ్చింది అని చెప్పిన నిజం అబద్ధం ఐపోయింది నిరూపించనంతవరకు నిజము కూడా ఒక అబద్ధంమే నమ్మకము నుండి కుడా అబద్ధం పుడుతుంది అని ఎవ్వరూ తెల్సుకోరూ
అ: అర్జునకిచిన మాట నిలపెట్టాడు *ద్రోణ* అని కొందరు అంటే ఏకలవ్యుడుని బలి చేసాడు *ద్రోహి* అని కొందరు అంటారు. జూదం లొ సెకుని ఆటకు పాండవులు బలి అవుతుంటే కృష్ణుడు యమయ్యాడు అని కొందరు అంటే ధ్రవుపది ని కాపాడింది కృష్ణుడే అని కొందరు అంటారు. ఒకసారి మోసం చేసిన కొడుకు రెండవ సారి గెలిచాడు కాని మూడవసారి వాడే మోసపోయాడు. నమ్మితే అబద్ధం నిజం అవ్వచ్చు నమ్మకపోతే నిజం అబద్ధం అవ్వచ్చు కానీ చివరకు మిగిలేదే నిజం. నిజం గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా అబద్ధంని ఓడిస్తుంది .
ఆ: ఈ ప్రపంచం త్వరగా నమ్మేది ఏదయినా ఉంది అంటే అది ఒక్క అభదానికే
(ఇప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటరు)
అ: అబద్ధం లోనుండి వచ్చే నిజమే నిన్ను చంపేది కూడా
ఆ: అబద్ధం బ్రతికేదే నిజం ఊపిరి పోసుకుని
ఇద్దరు ఒకేసారి చచ్చిపోతారు...ఒకరిని ఒకరు చంపుకుంటారు
-----END-----
నిజానికి ఏది నిజం ఏది అబద్ధం...?
Need greed dezire ఉన్నంత వరకు నిజానికి అబద్ధం కి మధ్య యుద్ధం ఎప్పటికి ఆగదు