A Short Story Of 2 Best Friends With Same Name That Cherishes Your Friendship Bond

Updated on
A Short Story Of 2 Best Friends With Same Name That Cherishes Your Friendship Bond

ఆ దేవుడు ఆశయం అందరికి ఇచ్చి అవకాశం కొందరికే ఎందుకు ఇస్తాడు?

మా నాన్న కి సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని ఐ.పి.ఎస్ అవ్వాలని ఆశయం ఉండేది. కాని కుటుంబ బాధ్యతలు ఆయన్ని బ్యాంక్ ఎంప్లాయ్ ని చేసాయి. బాగా కష్టపడ్డారు బాగా స్థిరపడ్డారు. కాని సివిల్స్ కి ప్రిపేర్ కాలేదన్న బాధ అలానే ఉంది అందుకే నా ద్వారా ఆ కల తీర్చు కుందామనుకున్నారు. కాని నాకు సినిమాలు, కథలు ఇదే లోకం. ఎప్పటికప్పుడు ఈ విషయం నాన్న కి చెప్దామని అనుకుంటూ భయం వల్ల ఆ విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. కాలేజ్ లో షార్ట్ ఫిల్మ్ తీసి కాలేజ్ చానెల్ లో అప్లోడ్ చేయటానికి మా చైర్మన్ గారికి చూపించా, ఆయన చూసి బాగుంది అని అప్లోడ్ కి పర్మిషన్ ఇచ్చారు. సాయంత్రానికి రిలీజ్ చేసాను. వైరల్ అయ్యింది. అందరు మెచ్చుకుంటున్నారు కాని నాన్న కి ఈ విషయం ఎలా చెప్పాలి?... తను ఇన్నాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసా అనే గిల్టి ఫీలింగ్ వల్ల గెలుపుని ఆస్వాదించలేక పోయాను. ఇలాంటి పరిస్థితులలో నాకో సొల్యుషన్ ఇచ్చేవాడు నా బెస్ట్ ఫ్రెండ్ సత్య. వాడి పేరు నా పేరు ఒక్కటే. వాడికి సపోర్ట్ చేసే అమ్మ నాన్నలు లేరు. వాడికి పోలిస్ కావాలని ఆశయం. స్కాలర్ షిప్ తో చదువుకుంటున్నాడు. తన రూమ్ కి వెళ్లేసరికి ఎదో అప్లికేషన్ చేతిలో పెట్టుకుని దిగాలు గా కూర్చున్నాడు. అది చూసి ఏమైంది అని అడిగా

సత్య: సివిల్స్ కి అప్ప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అమ్మ నాన్న లేకుండా ఎదో గడిపా కాని ఇప్పుడు ఎందుకో వాళ్ళని మిస్ అవుతున్నా రా... వాళ్ళు లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను సివిల్స్ క్రాక్ చేయగలనా? అయినా క్రాక్ చేసి ఏంటి ప్రయోజనం?. మనం గెలిస్తే ఆనందించే నా అనే వాళ్ళు లేకపొతే ఆ గెలుపు కి అర్థం లేనట్టే కదా?. నా గోల సర్లె కాని ఏంటి సార్ ఎలా ఉంది షార్ట్ ఫిల్మ్ కి రెస్పాన్స్? నేను: అది బాగుంది కాని, ఈ విషయం నాన్నకి ఎలా చెప్పాలో తెలియట్లేదు... నాన్న ఎలా తీసుకుంటారో అని భయం వేస్తోంది. ఏం చేయమంటావ్? సత్య: ఇప్పటి వరుకు నాన్న కి ఈ విషయం చెప్పకుండా తప్పు చేసావ్ ఇంకా ఆలస్యం చేయకు నీ గురించి ఎవరో చెపితే కాని తెలియని పోసిషన్ కి మీ అమ్మ నాన్న లని తీసుకునిరాకు. వెళ్లి చెప్పు. సత్య ఇచ్చిన ధైర్యం తో ఇంటికి వెళ్లాను. ఆప్పటికే నాన్న వచ్చి ఎదో బుక్ చదువుతూ నన్ను చూసి పక్కనబెట్టారు. నేను: నాన్న... మీకో విషయం చెప్పాలి. నాన్న: ఏంటి? నాన్న.... నేను: నేను సివిల్స్ ప్రిపేర్ కాను నాన్న, నాకు సినిమా చేయాలని ఉంది. ఈ రోజు షార్ట్ ఫిల్మ్ నా కాలేజ్ ఛానల్ లో అప్లోడ్ చేసాను. మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటా అనే నమ్మకం ఉంది. మీరు నా నిర్ణయాన్ని ఒప్పుకుంటేనే నేను ఎలాంటి గిల్ట్ లేకుండా నా లక్ష్యాన్ని చేరుకోగాలను. లేకుంటే నేను గెలవలేను నాన్న.... (ఇంకేదో చెప్పాలని ట్రై చేసేలోగా.... నాన్న నా దగ్గరికి వచ్చి నా చేతులని తన చేతుల్లో పెట్టుకుని...) నాన్న: సత్య ఈ విషయం నాకెప్పుడో చెప్పాల్సింది. ఇన్నాళ్ళు నీకేం ఆశయం లేదనుకున్న అందుకే నా లక్ష్యాన్ని నీ లక్ష్యం చేద్దామనుకున్న. కాని నీ కంటూ ఓ కల ఉన్నాక... అటువైపే వెళ్ళు. నీకు ఓ నాన్న గా నేను చేయాల్సిన సాయం ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తాను. సినిమా అయినా సివిల్స్ అయినా కష్టం ఒకేలా పడాలి అప్పుడే గెలవగలం. ఆల్ ది బెస్ట్ నీ షార్ట్ ఫిల్మ్ లింక్ పంపు చూస్తా... (అని తన రూమ్ కి వెళ్ళిన నాన్న ని చూస్తు... ఆశ్చర్యంతో అలానే ఉండిపోయా. ఇంతలో అమ్మ కాఫీ తీసుకోచ్చింది.) నేను: అమ్మ... నాన్న తిడతారని, బాధ పడతారని ఇన్నాళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పలేదు కాని నాన్న ఏంటమ్మ ఏమి అనకుండా అలా వెళ్లిపోయారు. అమ్మ: సత్య... నాన్న తన లక్ష్యం నెరవేరలేదు కాబట్టి కనీసం నీ కల నిజం కావాలని నీ వైపు ఆలోచించారు. నాన్న గా తను చేయాల్సింది తను చేశారు. కొడుకు గా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. (అమ్మ ఒక్క ముక్కే చెప్పింది కాని, అ ముక్క మైండ్ లో నుండి వెళ్ళలేదు రాత్రంతా అదే ఆలోచన. నాన్న నేనులో ఎవరో ఒకరి లక్ష్యమే నెరవేరాలా? ఇద్దరు గెలవలేమా? ఆ దేవుడు ఆశయం అందరికి ఇచ్చి అవకాశం కొందరికే ఎందుకు ఇస్తాడు? కాని ఈ సారి ప్రశ్న కి ఒక సమాధానం దొరికింది). (కొన్ని రోజుల తరువాత షార్ట్ ఫిలిం వాళ్ళ కొంత మని వచ్చింది. అమ్మ నాన్న లని ఒక హోటల్ కి తీసుకుని వెళ్ళా.) నాన్న: ఇప్పుడు ఈ హోటల్ లో నా బర్త్ డే పార్టీ అవసరమా సత్య? సత్య: ఫస్ట్ టైం నా ప్రైజ్ అమౌంట్ తో ఇస్తున్న పార్టీ. ప్లీజ్ నాన్న వద్దు అనద్దు. నాన్న: సరే నీ ఇష్టం. ఎవరి కోసం వైటింగ్? సత్య: నా ఫ్రెండ్ బర్త్ డే కూడా ఈ రోజే. సో తనని పిలిచా... తన పేరు కూడా సత్య. తనకి అమ్మ నాన్న లు లేరు. తన కి ఐ.పి.ఎస్ కావాలని డ్రీమ్. నాన్న: గ్రేట్ రా మంచి పనే చేసావ్. ఐ.పి.ఎస్ అవ్వాలనుకోవడం మామూలు విషయం కాదు చాల కష్టపడాలి. కాని ఆ కష్టపడాలన్న తపన ఎవరైనా తనని ప్రోత్సహిస్తే కాని, నేను ఉన్న అని భరోసా ఇస్తే కాని రాదు. నువ్వు తనకి ఓ స్నేహితుడి గా అవన్ని ఇవ్వాల్సిన బాధ్యత నీదే... సత్య: నేను ఎన్ని చేసిన ఒక తండ్రి ఇచ్చిన ధైర్యం ఇవ్వలేను నాన్న.. తనకి కూడా మీరు నాన్న అవ్వాలి. ధైర్యాన్ని, తన గెలుపు కి ఒక గమ్యాన్ని ఇవ్వాలి... మీరు ఒక ధనుస్సు లాంటి వాళ్ళు నాన్న, సత్య లాంటి బాణాన్ని తన లక్ష్యానికి చేర్చండి. మీ ఆశ ని నెరవేర్చలేక పోయాను అనే బాధ ఉంది. కాని ఆ ఆశ ని తీర్చుకునే మార్గాన్ని చూపించా అనే ఆనందాన్ని నాకు ఇవ్వండి. ఆ రోజుల్లో ఎవరైనా మీకు సాయం చేసుంటే మీరు కచ్చితంగా పోలిస్ అయ్యేవారు. ఇప్పుడు సత్య కి అలాంటి సాయం ఇవ్వండి మీరు అవ్వలేనిది తను అయ్యి చూపిస్తాడు. నాన్న: కాదు అనలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చావ్ సత్య. ఇక మీదట నేను ఈ సత్య కే కాదు ఆ సత్యకి కూడా నాన్న నే. (అని కౌగిలించుకున్నారు. కాని మాకు ఇంకో కౌగిలి జత చేరింది. అది సత్యది.) సత్య: స్నేహితుడి లా అన్ని పంచావ్, పంచుకున్నావ్. ఇప్పుడు అమ్మ, నాన్న ల ని కూడా పంచావ్... దేవుడు అమ్మ నాన్న ల ని ఇవ్వలేదని బాధపడేవాడ్ని సత్య. కాని అమ్మ నాన్నలని ఇచ్చె స్నేహితుడ్ని ఇచ్చాడు అని అనుకోలేదు. నేను: దేవుడు ఆశయాన్ని అందరికి ఇచ్చి అవకాశాన్ని కొందరికే ఎందుకిస్తాడో తెలుసా సత్య ఆ అవకాశాన్ని అందరికి పంచి ఆనందం పొందమని. ఇప్పుడు నేను అదే చేశాను.

(అమ్మ నాన్న నేను సత్య అందరం ఆ రోజు నిజమైన ఆనందాన్ని అనుభవించాం ) This is a story of FATHER of SATYA, FRIEND of SATYA, అవకాశానికి, ఆశయానికి, ఆనందానికి మధ్య ఉండే FORMULA of SATYA.