షడ్రుచులతో సంగమం అయినా ఉగాది పచ్చడి పరిపూర్ణ జీవిత అనుభవాలకు సంకేతంగా ఎలా నిలుస్తుంది !?

Updated on
షడ్రుచులతో సంగమం అయినా ఉగాది పచ్చడి పరిపూర్ణ జీవిత అనుభవాలకు సంకేతంగా ఎలా నిలుస్తుంది !?

మీరు ఈ దేశంలో గాని, ప్రపంచంలో గాని ఎక్కడికైనా వెళ్ళండి, అత్యున్నత దేశం దగ్గర నుండి ఆర్ధికంగా పేద దేశం వరకు... ఖచ్చితంగా అక్కడ మన తెలుగువారు తప్పక ఉంటారు. ఈ భూమి మీద 18 కోట్ల తెలుగువారు ఉన్నారు అని ఒక అంచనా... అలాంటి ఘనమైన తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది.

ఉగాది అనే పేరు యుగాది అనే పదం నుండి వచ్చింది. యుగా+ఆది= యుగఆరంభం అని అర్ధం, సృష్టి కర్త అయిన బ్రహ్మ జనుల తలరాతలను, ఇంకా తన పనులను ఛైత్ర శుద్ధ పౌడ్యమి నాడు ప్రారంభించునందుకు గాను ఉగాది పండుగను జరుపుకుంటురు... ఈరోజు నుండే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఇది తెలుగు వారికి కొత్తసంవత్సరం దానితో పాటు సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి ఆనందంతో పవిత్రంగా జరుపుకుంటారు... మన భారతీయ సనాతన సంప్రదాయాలు, పద్దతులలో భక్తి మాత్రమే కాదు ఆరోగ్యం, విజ్ఞాణం ఇలా అన్నీ మెండుగా ఉంటాయి.. పండుగ రోజున తోరణాలుగా మామిడి ఆకులను కడతారు ఎందుకంటే మామిడి ఆకులను చెట్టు నుండి తెంపినా కొన్ని గంటలపాటు ఆక్సిజన్ ని ఇస్తాయి. ఇంటి గడపకు రాసే పసుపు బయటిఉండి లోనికి వచ్చే బాక్టీరియాల నుండి రక్షణ కోసం, ఇంటి ముందు పేడతో చల్లె కల్లాపి కూడా ఇలాంటి రక్షణను ఇస్తుంది.. ఇవే కాదు ఇంకా ఎన్నో ఆచరాలు సంప్రదాయాలు మన భారతీయుల సొంతం... ఇలాంటి ఆరోగ్యకరమైన సంప్రదాయాలు మన ఉగాది లో కుడా ఉన్నాయి... మన తెలుగువారు మాత్రమే కాదు దేశంలో ఐదు ప్రాంతాల వారు తమ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నారు... గుడి పడ్వా(మరాఠి), పుతాండు(తమిల), వైషు(మళయాలి), వైశాఖి(సిక్), పొయలా బైషక్(బెంగాలి) ఇలా తమ ప్రాంతాల వారు వేరు వేరు రోజుల్లో తమ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.

ఈ ఉగాది అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి.. షడ్రుచులతో సంగమం అయినా ఈ పచ్చడి పరిపూర్ణ జీవిత అనుభవాలకు సంకేతంగా నిలుస్తుంది...

బెల్లం: తీపి అంటేనే ఆనందం జీవితంలో సంతోషం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది లేదా భవిషత్తులోనైనా తప్పక వస్తుంది...

వేప పువ్వు: వేప పువ్వు చేదుగున్నా మొదట భాదను కలిగించినా, భాదకర సంఘటనలతో గుణపాఠం నేర్పుతుంది.. తర్వాత మాత్రం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అని చేదు,భాదకర సంఘటనల నుండి నేర్చుకోవచ్చు.

మామిడి ముక్కలు: వగరు రుచి... కొన్నిసార్లు తెలియకుండ Mistakes చేస్తుంటాం.. దాని వల్ల Embarrassing Feeling నుండి Guilty Attitude కి దారి తీస్తుంది దాని వల్ల ఒక్కోసారి భయం, మొహమాటం పరిస్థితుల వల్ల లక్ష్యాన్ని అందుకోలేక పోవచ్చు.. కాని ఇదంతా లైఫ్ లో కామన్ అంటూ ముందుకు సాగి పోవాలి.

కారం: కారానికి కోపం తెప్పించే శక్తి ఉంది కొన్నిసార్లు అధిక కోపంతో మనల్ని మనం అదుపు చేసుకోలేని Situations కి లోనవుతుంటాం.. అది కూడ జీవితంలో ఒక భాగమే అయినా, అనవసర అధిక కోపం హద్ధులో ఉంచుకోవాలని దీని సూచన.

చింతపండు: చింతపండు పులుపు నుండి నేర్పరితనం అలవరుచుకోవాలి... అనుకోని ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు భయం ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఆలోచించి చాకచక్యంగా వ్యవహరించాలని తెలుపుతుంది.

ఉప్పు: ప్రేమతో, గౌరవంతో చాలా జాగ్రత్తగా వంట చేసినా సరిపడా ఉప్పు లేకుంటే ఆ కూర రుచిపోతుంది... అలాగే ఒక సమస్యకు ఎంత అవసరం ఉంటే అంతే స్పందించాలి.. చెవిలో మురికి ఉందని రోకలి కర్రతో శుభ్రం చేయలేం కాదా.. ఎక్కడ ఎంత అవసరమో ఎంత మోతాదులో అవసరమో ఈ రుచి ద్వారా తెలుసుకోవచ్చు

ఈ రుచులన్నీ కూడా సంవత్సరాంతం జీవీతాంతం అనుభవిస్తుంటాం.. ఒక రుచి ఎక్కువ ఇంకొక రుచి తక్కువ అంటూ ఉండదు అన్నీ సమపళ్ళల్లో ఉంటాయి... ఖచ్చితంగా ఈ రుచులన్నీ, ఈ సంఘటనలన్నీ జీవితంలో ప్రతి ఒక్కరు అనుభవించి తీరాల్సిందే.. కాని ఒక్క పరిస్థితే శాశ్వతం కాదు అన్ని సంఘటనలను చవిచూసినాకే జీవితం పూర్తవుతుంది కాని ఆ సంఘటనలనుండి మనం ఏం నేర్చుకున్నాం అన్నేదే ముఖ్యం...

అందరికి శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు.