సినిమా పాటలకి సాహిత్యాన్ని అందించడం కత్తి మీద సాము వంటిది . దర్శకుడి ఆలోచనలకి అక్షర రూపం పాట . అభిమానులని అలరించేలా, ప్రేక్షకులని ఆలోచించేలా చేసేది పాటలే . కొన్ని తరాల పాటు ప్రేక్షకుల మనసులో చెరగని జ్ఞాపకంలా మిగిలిపోతాయి సినిమా పాటలు , కాలదోషం అసలే ఉండదు పాటకి . కానీ కొన్ని సందర్భాలలో పాట ప్రాచుర్యం పొందినంతగా పాట రాసిన రచయిత అంతగా వెలుగులోకి రాకపోవొచ్చు రావాల్సినంత గుర్తింపు దక్కకపోవొచ్చు . ఆలా మన తెలుగు సినీ గేయరచయితలలో అపార ప్రతిభ కలిగి ఉండి కూడా underratedగా మిగిలిపోయిన కొందరు గేయరచయితలని ఓసారి చూద్దాం .
1. భువన చంద్ర:
దాదాపు రెండు దశబ్దాలుగా రెండు వేల పైచిలుకు పాటలు రాసారు భువనచంద్ర గారు . సినీ సంగీతాభిమానులకి వీరు సుపరిచుతులే అయినప్పటికీ వారి రచనల్లోని మాధుర్యాన్ని మన తరం అంతగా తెలుసుకోలేకపోయింది
2.వెన్నెలకంటి:
పరభాషల్లోంచి తెలుగులోకి వచ్చే అనువాద చిత్రాలలో వెన్నెలకంటి గారి పాట లేని చిత్రాలు చాలా అరుదు . డబ్బింగ్ చిత్రాలకే కాక ఎన్నో తెలుగు సినిమాలకి కూడా గొప్ప పాటలని అందించారు .
3. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు:
జొన్నవిత్తులవారు స్వతహాగా కవి , తొంభైవ దశకం నుండి సినీగేయ రచయితగా ఎన్నో మధురమైన పాటలు రాసారు . శ్రీరామరాజ్యం చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు .
4. సాహితి:
“లాలూదర్వాజా లష్కర్ బోనాలపండగకు” అని ఆయన రాసిన పాట ఇప్పటికీ ఊర్రోతలూగిస్తూనే ఉంటుంది . కెవ్వుకేక అంటూ ప్రేక్షకులతో కేక పెట్టించేలా రాయగలరు . ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ) అంటూ ప్రేమికుల మనసు దోచే సాహిత్యం రాయగలరు . సాహితిగారు రాసిన ఇంకా ఎన్నో పాటలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి .
5. కులశేఖర్:
ఆనతికాలం లోనే గేయరచయితగా పేరు సంపాదించుకున్నారు కులశేఖర్ గారు .ఆర్ పి.పట్నాయక్ కులశేఖర్. వీరిద్దరి కాంబినేషన్ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి . సరళమైన భాషతో సాహిత్యం రాయగలగడం కులశేఖర్ గారి శైలి .
6. కందికొండ:
పూరి జగన్నాధ్ గారి సినిమాలకి ఎక్కువగా పనిచేసారు కందికొండ గారు. మళ్ళి కూయవే గువ్వా అంటూ అయన రాసిన పాట ఇప్పటికి ఎందరికో ఇష్టమైన పాటల్లో ఒకటి . దాదాపు వేయి పాటలకి పైగా రాసారు కందికొండ గారు
7. వనమాలి:
అరెరే అరెరే మనసే జారే హ్యాపీ డేస్ లోని ఈ పాట తో మనందరికీ చిరపరిచితులు అయ్యారు వనమాలి గారు . ప్రేమ గీతాలకి చిరునామాగా మారారు .ఓయ్ , ఆరెంజ్ , ఆర్య 2 మనం వంటి ఎన్నో చిత్రాలకి పాటలు రాసారు
8.కృష్ణ చైతన్య:
పిల్ల జమిందార్ ,ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే ,స్వామి రారా వంటి విజయవంతమైన చిత్రాలకి సాహిత్యాన్ని అందించారు కృష్ణ చైతన్య . రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగానూ మారారు
9. చైతన్య ప్రసాద్:
బాహుబలి చిత్రాలలో లో హంసనావ , మనోహరి . ఈగ లో లావా లావా , రాజన్న లో మేలుకోవే చిట్టితల్లి , తకిట తకిట , బ్రోకర్ వంటి చిత్రాల్లోని పాటలకి సాహిత్యాన్ని అందించారు చైతన్య ప్రసాద్ గారు .
10.సిరాశ్రీ:
క్షణం సినిమాలో మనందరికీ నచ్చిన చెలియా పాటని రాసింది సిరాశ్రీ గారే . ఐస్ క్రీం , సత్య 2 సర్కార్ 3 వంటి చిత్రాలకి పాటలు రాసారు
మరెవరినైనా మరచిపోయుంటే కామెంట్లతో మాతో పంచుకోండి..