Here Are A Few Unknown Things About Lord Shiva That You Need To Know!

Updated on
Here Are A Few Unknown Things About Lord Shiva That You Need To Know!

Contributed By: Swaroop Annapragada Source: Annapragada Lakshmi Narayana

కార్తీక మాసంలో పరమశివుని గురించి కొన్ని విషయాలు...

దీపావళి అయిపోయింది... ఇక నుండి కార్తీక మాసం మొదలు... ఇది శివుడికి చాలా ఇష్టమైన మాసం... ఈ మాసంలో శివుడిని పూజిస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు... పూజలు చేసే అంత కాకపోయినా కనీసం పరమశివుని గురించి కొన్ని విషయాలు చెప్పటమే ఈ వ్యాసం...

1.) శివుడు పుట్టింది శివరాత్రి రోజు అనుకుంటారు చాలామంది... అది తప్పు... అసలు శివుడి పుట్టుక ఎవరికీ తెలీదు... శివరాత్రి రోజు లింగరూపంలో ఆవిర్భవించాడు కానీ ఆ రోజు పుట్టలేదు...

1-1

2.) యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో వచ్చే పంచాక్షరి మహా మంత్రం చాలా శక్తివంతమయిన మంత్రం... మనకి ఉన్న 4 వేదాలు ఆపకుండా రాసుకుంటూ వెళ్తే అందులో "ఓం నమః శివాయ" అనే పంచాక్షరి మంత్రం సరిగ్గా మధ్యలో ఉంటుంది...

2

3.) శివుడి అంకె 5. ఆయన మంత్రం పంచాక్షరి... ఆయన పంచభూతాలకి, పంచేంద్రియాలకి అధిపతి... ఆయన అవతారాలు 5: సద్యోజాత, వామన, తత్పురుష, ఇషాన, అఘోర... శివుడు 5 సభలలో 5 ప్రకృతి రూపాల్లో దర్శనం ఇస్తాడు...

3-11

4.) రావణాసురుడు గొప్ప శివభక్తుడు... ఆయన ఆశువుగా రాసి పాడిన స్త్రోత్రం "శివ తాండవ స్త్రోత్రం"... ఆశువుగానే పాడినా అది అతిగొప్ప శివ స్తుతిగా పేరు తెచ్చుకుంది... వ్యాకరణం పరంగా చూసుకున్నా కూడా అది అత్యంత గొప్పది... స్త్రోత్రం మొత్తం గురులఘువులు ప్రత్యామ్నాయంగా వస్తుంటాయి... అందుకే ఆయన రావణబ్రహ్మ అయ్యాడు...

4

5.) విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చింది శివుడు... విశ్వకర్మ సూర్యుని కిరణాల నుండి సుదర్శన చక్రం తయారుచేసి పరమశివుడికి ఇస్తే, విష్ణువు శివుడిని పూజించి తన కన్ను సమర్పించి ప్రసన్నం చేసుకుంటే శివుడు సంతోషించి సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు...

5

6.) నటరాజుగా శివుడు ప్రపంచాన్ని సృష్టించగలడు, నాశనం చేయగలడు... సృష్టికి "లాస్యము", నాశనానికి "తాండవం" అనే నాట్యప్రక్రియలు తెలిసిన ఒకే ఒక్కడు శివుడు... అలాగే మన శాస్త్రీయ సంగీతం మొత్తం శివుని ఢమరుకం నుండి వచ్చిన శబ్ధం వల్ల ఆవిర్భవించింది...

6

7.) కాళీ అవతారం ఎత్తిన దుర్గాదేవిని శాంతపరచటం దేవుళ్ళు అందరు కలిసినా వాళ్ల వల్ల కాలేదు... శివుడి నవ్వు వల్ల అమ్మవారు ప్రసన్నం అయ్యారు...

7

8.) ఒకసారి పరమశివుని ఆది అంతం తెలుసుకునే ప్రయత్నంలో అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మదేవుడిని శపిస్తాడు... అందువల్ల బ్రహ్మదేవుడికి ప్రపంచంలో ఎక్కడా గుడులు ఉండవు... త్రిమూర్తులలో మిగతా ఇద్దరినీ శపించగల శక్తి శివుడికి మాత్రమే ఉంది...

8

9.) నందికి శివుడు అంటే అపారమైన భక్తి... ఆ భక్తికి మెచ్చి ఎప్పుడూ నువ్వు నా ముందే ఉంటావు, నువ్వు లేకుండా నేను ఉండను అని శివుడు వరం ఇస్తాడు... అందుకే శివాలయంలో నంది విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది... గుడిలో నందికి శివుడికి మధ్యలో నడవకూడదు... అది నందికి కోపం...

9

10.) శివుడికి పూజలు అక్కర్లేదు... ఒక రాయి పెట్టి నీళ్ళు పోసి తలుచుకున్నా అది ఆయనని పూజించినట్లే అవుతుంది...

10

All images source from Deviantart. Credits to the original artists.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.