Contributed By Krishna Prasad
ఒక అచ్చమైన తెలుగు ఇలస్ట్రేషన్ ఆర్ట్ చూశారా! అయితే కచ్చితంగా దాని పైన ఉండే పేరు వాసు చెన్నుపల్లి . ఒక వేళ మీరు పత్రికలు చదివే వారైతే మీకు ఈ పేరు పరిచయము ఉండే ఉంటుంది. శ్రీ బాపు, చంద్ర, బాలి, మోహన్ మరియు గోపి వంటి అద్భుతమైన చిత్రకారుల తరువాత అంతటి గొప్ప ప్రతిభ కలిగిన వారు, గొప్ప పేరు పొందినవారు వాసు చెన్నుపల్లి గారు. చంద్ర గారికి ఏకలవ్య శిష్యుడుగా చిత్రాలు వెయ్యటం నేర్చుకున్న వాసు గారు సుమారు మూడు దశాబ్ధాల నుంచి తెలుగు సాంప్రదాయానికి అద్దంపట్టే చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి' అనే సామెత ఈయన దగ్గర నుంచే వచ్చిందా అనేంతగా ఏమాత్రం గొప్పలకి పోని, తన చిత్రం కనిపిస్తే చాలు, తను ఎందుకు అని అనుకునే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి వాసు గారు. బహుశా అందుకేనేమో కొత్తగా వస్తున్న, ఇప్పటి కాలంలో ఉన్న చిత్రకారులందరికి ఈయనే ఆదర్శం అయ్యారు. పల్లెటూరి అందాలు, పండగ దృశ్యాలు, పల్లెటూరి పడుచు అందాలు, పౌరాణికాలు, జానపదాలు, చారిత్రాత్మకాలు, సమాజ పోకడలు ఇలా ప్రతి దానిపై ఇలస్ట్రేషన్స్ వెయ్యగల సమర్థుడు మన తెలుగు బొమ్మల వెలుగైన వాసు గారు. ఆయన వేసిన చిత్రాలన్నీ గొప్పవే!, వాటిలోని కొన్ని చిత్రాలను ఇప్పుడు చూద్దాం. మరిన్ని చిత్రాలను ఆయన Vasu chennupalli's illustrations Fb page లో చూడొచ్చు. CLICK HERE
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
31.
32.
33.
34.