మనం పిల్లలకి తప్పనిసరిగా చెప్పవలసిన మాట 'రోజూ కనీసం ఒక గంట సేపైనా పుస్తకాలు చదవడానికి కేటాయించండి. అనతి కాలంలోనే మీరొక విజ్ఞాన నిధిగా మారిపోతారని'. - అబ్దుల్ కలాం గారు. వీరభద్ర రావు 2009 డిప్లొమో చదువుతున్న రోజుల్లో అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ "వింగ్స్ ఆఫ్ ఫైర్" పుస్తకాన్ని చదవడం జరిగింది. "ఎక్కడో ఉండి మనల్ని మోటివేట్ చేస్తున్న వ్యక్తిని మనం కలుసుకోవాల్సిన పని లేదు.. గంటలు గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు.. వారి వ్యక్తిత్వం అర్ధమైతే చాలు.. వారి ఉనికి చాలు మనం ఉన్నతులమవ్వడానికి". వీరభద్ర రావు ఏనాడైతే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని చదివాడో అప్పుడే డిసైడ్ అయ్యాడు నేను కూడా భారత రక్షణ రంగంలో పనిచేయాలని, దేశ నిర్మాణంలో భాగమవ్వాలని.. 2009లో పుస్తకాన్ని చదివితే ప్రస్తుతం 2019 ఈ పది సంవత్సరాలలో అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారత రక్షణ రంగం ఏరోస్పెన్, డిఫెన్స్, శాటిలైట్, వెపన్ రిలేటెడ్, మిస్సైల్ విడిభాగాలను తయారుచేసి BHEL, HAL,ECIL, BDL,ODF, DRDO ద్వారా భారత రక్షణ రంగానికి అందిస్తున్నారు. ఇదంతా సాధించింది కేవలం పాతిక సంవత్సరాల వయసులొనే..
ఒకవేళ నీ వల్ల ప్రపంచానికి వెలుగు వస్తుందనంటే నిరంతరం మండుతూ ఉండు. కానీ ఆరిపోకు. - ఆచార్య సి. నారాయణరెడ్డి గారు. చిన్నతనం నుండే ఉద్యోగం: కలాం గారు చిన్నతనంలో పేపర్ బాయ్ గా పనిచేశారు. న్యూస్ పేపర్ మూట సైకిల్ కు కట్టే ముందు ఆ న్యూస్ పేపర్ మొత్తం చదివేవారు, ఈ రకమైన అలవాటు భవిషత్తులో కలాం గారి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. వీరభద్ర సొంతూరు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షరామం. నాన్న వ్యవసాయం చేసేవారు. కుటుంబ అవసరాల కోసం భద్ర కూడా చిన్నతనం నుండే ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ ఉద్యోగం కూడా ఇండస్ట్రీలో చెయ్యడం మూలంగా ఇప్పుడు మనం చూస్తున్న "దక్ష టెక్నాలజిస్" భద్ర కు ఎంతగానో ఉపయోగపడింది.
"తన గమ్యమేమిటో స్పష్టంగా తెలిసిన వ్యక్తికి ప్రపంచం అంతా అడ్డుతొలిగి దారినిస్తుంది." -Ralph Waldo Emerson (American Philosopher) గురువుల ప్రోత్సాహం: టెన్త్ క్లాస్ పూర్తిచేశాక వృత్తి విద్య కోర్స్ చాలా బెటర్ అని పాలిటెక్నీక్ కాలేజిలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ డిప్లొమో చేస్తున్నప్పుడే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం జీవితంలోకి వచ్చింది. డిప్లొమో 85% మార్కులతో డిస్టింక్షన్ లో క్వాలిఫై అయ్యాక BHELలో Internship చేశాడు. అక్కడ సంవత్సర కాలంలో AGM రామ్మోహన్ గారి సహకారంతో విలువైన ప్రాక్టికల్ నాలెడ్జ్ స్వీకరించాడు. ఆ తర్వాత B.Tech.. ఉదయం సూర్యుని కన్నా ముందుగానే ప్రపంచాన్ని చూస్తూ తన లక్ష్యం వైపుగా ప్రయాణం మొదలుపెట్టేవాడు. ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 వరకు కాలేజ్, సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసే చోటికి వెళ్లడం, ఆ తర్వాత సాయంత్రం 6:30 నుండి రాత్రి 12, 1 లోపు ఇంటికి చేరుకొని, తిరిగి మళ్ళీ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి చదువుకోవడం.. ఇది ఇంజినీరింగ్ చదువుతున్న కాలంలో భద్ర Daily Routine. ఇంత Hectic Schedule లో కూడా ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, Bangalore Based "ACE Micro Matic" Companyలో Application Engineer గా వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు తిరుగుతూ CNC Machine ట్రబుల్ షూటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
2009లో వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివాను, ప్రస్తుతం 2019లోపే రక్షణ రంగానికి పనిచేస్తున్నాను. ఇది కదా అసలైన 10 Years Challenge. -భద్ర స్నేహితుల బలగం: హనుమంతుని బలం హనుమంతుని కన్నా చుట్టూ ఉన్న వారికే ఎక్కువ తెలుసు. భద్ర మిత్రుల ప్రోత్సాహం మరువలేనిది. B.Tech తర్వాత freelancer గా పనిచేస్తూ కస్టమర్స్ తో నేరుగా సంబంధం ఏర్పడింది. ఒకరి కింద కాదు, నీకంటూ ఒక ఇండస్ట్రీ ఉంటే బాగుంటుందని మిత్రులు ప్రోత్సహించేవారు. తాను దాచుకున్న కొంతడబ్బు, ఇంకా చిన్ననాటి మిత్రులు శంకర్, సతీష్ నందికోళ్ల, మరో క్లోజ్ ఫ్రెండ్ బద్రీనాథ్ మరియ ఇతర మిత్రుల ఆర్థిక సహాయంతో 2 సంవత్సరాల క్రితం "దక్ష టెక్నాలజిస్" ప్రారంభమయ్యింది.
2009లో వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివాను, ప్రస్తుతం 2019లోపే రక్షణ రంగానికి పనిచేస్తున్నాను. ఇది కదా అసలైన 10 Years Challenge. -వీరభద్ర స్నేహితుల బలగం: హనుమంతుని బలం హనుమంతుని కన్నా చుట్టూ ఉన్న వారికే ఎక్కువ తెలుసు. వీరభద్ర మిత్రుల ప్రోత్సాహం మరువలేనిది. B.Tech తర్వాత freelancer గా పనిచేస్తూ కస్టమర్స్ తో నేరుగా సంబంధం ఏర్పడింది. ఒకరి కింద కాదు, నీకంటూ ఒక ఇండస్ట్రీ ఉంటే బాగుంటుందని మిత్రులు ప్రోత్సహించేవారు. తాను దాచుకున్న కొంతడబ్బు, ఇంకా ఫస్ట్ క్లాస్ నుండి కలిసి చదువున్న చిన్ననాటి మిత్రులు శంకర్, సతీష్ నందికోళ్ల, మరియు మరో క్లోజ్ ఫ్రెండ్ బద్రీనాథ్ ఆర్థిక సహాయంతో 2 సంవత్సరాల క్రితం "దక్ష టెక్నాలజిస్" ప్రారంభమయ్యింది.
ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియాలో భాగం అయ్యి కొంతమందికి ఉద్యోగమిచ్చాను, భవిషత్తులో ఎంతోమందికి ఉద్యోగమివ్వాలి. - భద్ర ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అదిభట్ల ఏరోస్పేస్ SEZ లో అధికారుల విపరీతమైన వడపోత ద్వారా వీరభద్రరావు కు 600 గజాల స్థలాన్ని కేటాయించింది, మరో మూడు నాలుగు నెలల్లో సొంత పరిశ్రమ నిర్మాణం పూర్తిచేసి రక్షణ రంగానికి నేరుగా విడిభాగాలను అందించబోతున్నాడు. భద్రకు పని, పుస్తకాలతో పాటు ట్రావెలింగ్ అన్నా చాలా ప్రేమ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కొన్నిరోజులు అలా ప్రకృతితో కలిసిపోతారు. 2 సంవత్సరాలలో లక్ష కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేశాడు, ఇదే ఆధారం భద్ర కు విహారం చేయడమంటే ఎంత ఇష్టమని తెలుసుకోవడానికి. ఏది చేసినా 100% మనసు లగ్నం చేస్తేనే అనుకున్నది నెరవేరుతాయని మాటలు చేతల రూపంలో నిరూపిస్తున్న భద్ర లాంటివారు ఎందరికో మార్గదర్శి.