ఒక గొప్ప నటి ఐతే వెండితెర మీద పవర్ ఫుల్ గా నటిస్తారు అదే నటి వ్యక్తిత్వంలో కూడా వీరత్వం దాగిఉంటే అలాగే జీవిస్తారు.. విజయశాంతి గారు సినీ ప్రపంచంలో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా లేడి అమితాబ్ యే. ఒక్కసారి ఆలోచించండి కర్తవ్యం సినిమాలో పవర్ ఫుల్ లేడి పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి గారిని తప్ప మరొకరిని ఊహించగలమా, ఓసేయ్ రాములమ్మ, ప్రతిఘటన మాత్రమే కాదు స్వయంకృషి, పడమటి సంధ్యారాగం లాంటి సినిమాలలో కూడా మరొకరిని ఊహించలేము.. విజయశాంతి గారే ఆ సినిమాలకు ప్రాణం, ఆ పాత్రల ద్వారా ఎంతోమంది మోటివేట్ ఐన వారు ఉన్నారు. చిన్నప్పుడు విజయశాంతి గారి కర్తవ్యం సినిమా చూసి Inspire అయ్యి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను అనే ఎంతోమంది మహిళా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. రజినీ కాంత్ గారు, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఇలాంటి హీరోల పక్కన ఎంతటి స్థాయిలో నటించగలరో సినిమాకే హీరో అయ్యి విలన్లను అంతే ధాటిగా ఎదురించగలిగే నటనను ప్రదర్శించగలరు. కేవలం సినిమాలలో మాత్రమే కాదు రాజకీయాల ద్వారా ఒక ప్రజా ప్రతినిధిగా సమాజానికి తన వంతు సేవ చేయాలనే ఉద్దశంతో ఎంపిగా తన సేవలను అందించారు. నిజానికి సినిమాలలో విజయశాంతి గారు నటించినట్టు ఉండదు తన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు తయారుచేసినట్టు ఉంటుంది అలా నటించిన వాటిలో కొన్ని ఎన్నటికి నిలిచిపోయే పాత్రలు..
సూర్య ఐ.పి.ఎస్
పడమటి సంధ్యారాగం
శత్రువు
భారత నారి (నంది అవార్డ్)
మొండి మొగుడు - పెంకి పెళ్లాం
ఇంద్రుడు - చంద్రుడు
రేపటి పౌరులు
జానకి రాముడు
పోలీస్ లాకప్
నేటి భారతం
అడవి చుక్క
కర్తవ్యం (నేషనల్ అవార్డ్, నంది అవార్డ్)
గ్యాంగ్ లీడర్
ఒసేయ్ రాములమ్మా (నంది అవార్డ్)
ప్రతిఘటన (నంది అవార్డ్)
స్వయంకృషి