పరిస్థితులకు, కాలానికి ఎనాడు భయపడి వెనకడుగు వేయకూడదు మనకు ఈ స్థితి కలిగించిన ఈ జీవితమే మనలోని శక్తిని వెలికితీయడానికి ప్రధాన కారణమవుతుంది. కష్టాలలో ఉన్నప్పుడు విజయలక్ష్మీని ఆదుకోడానికి ఎవ్వరూ రాలేదు కాని తన వెనుక గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళు. బ్రతుకు తెరువు కోసం ఆటో నడపడానికి సిద్ధపడితే శరీరమంతా అనుమానం ఆశ్చర్యం కలగలిసిన జబ్బుతో చూసేవారు. ఆ చూపుల కన్నా, ఇంకొకరి దగ్గర తలదించుకోవడం కన్నా ఆటో నడపడం చాలా సులువు అని గౌరవంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/download_2017-11.jpg)
విజయలక్ష్మీ గారి పేరులో "విజయం" "లక్ష్మీ" ఉన్నది కాని తన జీవితంలో రాని రోజులు అవి.. అమ్మనాన్నలకు కలిగిన ఆరుగురు సంతానంలో తను ఒకరు. చిన్నతనం నుండి ఆర్ధికంగా ఏ ఇబ్బందులేవు, మేనమామ మధుతో వైభవంగా పెళ్ళిచేశారు. అన్నీ అనుకున్నట్టుగా ఆనందంగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది "శత్రువుని కత్తిపోటు కన్నా ఆత్మీయుల వెన్నుపోటు ప్రమాధకరమని" అంటారు అలా నమ్మినవారే విజయలక్ష్మీ గారి కుటుంబాన్ని కట్టుబట్టలతో బజారున పడేశారు. అలాంటి వారిని హైదరాబాద్ అక్కున చేర్చుకుంది.
హైదరాబాద్ కు వచ్చిన తొలిరోజులలో(2006) చంకలో పిల్లాడిని ఎత్తుకుని ఏ పని దొరక్క పస్తులుండి చివరకి చిన్న చిన్న పనులు చేసుకుంటు బ్రతుకును భవిషత్తుకు లాగేవారు. భర్తకు ఎలాగూ డ్రైవింగ్ వచ్చు ఆటో నడిపిస్తే ఇప్పుడున్న పరిస్థితుల నుండి భయటపడొచ్చు అని అద్దే తీసుకుని ఆటో నడపడం మొదలుపెట్టారు. కాని కొన్నాళ్ళకే భర్త అనారోగ్యానికి గురయ్యారు. ఆటో నడిపితే ఎంతోకొంత ఆదాయంతో రోజులు గడిచేవి పరిస్థితి మరింత దిగజారిపోయింది. రోజు గడవడం ఒక ఎత్తైతే, భర్తను కాపాడుకోవడం మరో పెద్ద కష్టంగా మారింది. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే అక్షరం ముక్కరాదు ఈ విపత్కర పరిస్థితులలో "భర్త ప్రోత్సాహంతో కేవలం 15రోజులలోనే ఆటో నడపడం నేర్చుకున్నారు".. కాదు జీవితం నేర్పించింది.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/download-1_2017-11.jpg)
ఆటో నడపడం నేర్చుకుని లైసెన్స్ తీసుకోవడం వరకైతే అంతా అనుకున్నట్టుగానే జరిగింది కాని ఆటో ఎక్కడానికి చాలామంది జాగ్రత్తగా తీసుకువెళ్తుందా అని భయపడేవారు, మహిళ కదా అని చెప్పి తక్కువ ధరకు బేరాలాడేవారు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోయినా గాని ఎంతోకొంత వస్తుంది అని బేరాలాడినా గాని ఆటో విజయలక్ష్మి గారు అటో నడిపేవారు.
విశ్వనగరం హైదరాబాద్ లో ఉన్నది ముగ్గురు నలుగురు మహిళా డ్రైవర్లు మాత్రమే. ఇంటి పట్టున ఉన్న మహిళకే ఆకతాయుల నుండి ఇబ్బందులు ఎదైరవుతున్నాయి ఇక విజయలక్ష్మీ గారి పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. కావాలని ఆటో ఎక్కి అసభ్యంగా మాట్లాడేవారు కొందరు, ఇంకోసారైతే ఏకంగా ఒక వ్యక్తి "నీకు డబ్బులిచ్చేది లేదు" నీ ఇష్టమచ్చింది చేస్కో అని తీసిపారేశారట విజయలక్ష్మీ గారు అందుకు బెదరక అసభ్యంగా మాట్లాడినందుకు "రెండు చెంపలు వాయించి" మరి డబ్బులు వసూలు చేసుకున్నారట.. "కొడుకును పోలీస్ గా, కూతురిని ఇంజినీర్" గా చూడడమే తన లక్ష్యం అని తన జీవితంలో ముందుకు సాగిపోతున్నారు.