నాలుగు గోడలు, వైఫై తరంగాల మధ్య ఉంటూ ఛాటింగ్, ఆన్ లైన్ గేమ్స్, లేదంటే ఎప్పుడూ చేసిన పనినే చేస్తూ లైఫ్ లో థ్రిల్ లేదు జీవితం విసుగొచ్చేస్తుంది అనుకునే వారికే ప్రారంభించబడింది ఈ Vijayawada Adventure Club. లైఫ్ అంటేనే కేవలం లక్ష్యం కోసం యుద్ధం మాత్రమే కాదు థ్రిల్లింగ్ కూడా, ఇంకా ఆ థ్రిల్లింగ్ అడ్వెంచర్ రూపంలో వస్తే..? చాలా అద్భుతంగా ఉంటుంది కదా.. నిజానికి మనలో చాలా మందికి కొన్ని అడ్వెంచర్స్ చెయ్యాలని ఉంటుంది కాని భయంతో ఇంకా వివిధ కారణాలతో ఆ కోరికలను వదిలేసుకుంటాం. మనం ఏదైతే లైఫ్ లో మిస్ అయ్యిందని అనుకుంటున్నామో దానినే ఇస్తున్నారు ఈ Vijayawada Adventure Club నిర్వాహకులు. కొండలను ఎక్కడం, ఫారెస్ట్ సర్వైవల్, లాంగ్ డ్రైవింగ్ లాంటి ఎన్నో అడ్వెంచర్ ఈవెంట్లను Safety Precautions తో ఔత్సాహికులకు అందిస్తుంది.



12 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు లోపు వారికి ఇందులో నామమాత్రపు ఫీజుతో సభ్యత్వం ఇస్తారు. ఒక వారం ట్రెక్కింగ్, ఇంకోవారం బైక్ డ్రైవింగ్, మరొక వారం అడవిలో కొన్నిరోజులు ఉండటం ఇలా ఒక్కోవారం ఒక్కో అడ్వెంచర్ తో జీవితంలో థ్రిల్లింగ్ జ్ఞాపకాలను విజయవాడ అడ్వెంచర్ క్లబ్ ఇస్తుంది. అడవులు, కొండలు అనగానే భయపడాల్సిన అవసరం లేదండి.. ఇక్కడి నిర్వాహకులు సభ్యుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.. ఇందుకోసం ఎవరెస్ట్ ను నాలుగు సార్లు అధిరోహించి ఎంతో మందికి శిక్షణ ఇస్తూ "అర్జున" అవార్డు తీసుకున్న శేఖర్ తో పాటుగా పదిమంది కలిసిన వీరి టీం ముందుగానే అడ్వెంచర్ చేసే ప్రదేశానికి చేరుకుని రక్షణ పరమైన నిర్ధిష్ట చర్యలు తీసుకున్న తర్వాతనే సభ్యులను అనుమతిస్తారు. ఇంకేందుకండి ఆలోచన Membership తీసుకోని మీకు నచ్చిన అడ్వెంచర్స్ ని చేసేయండి.. ఆల్ ది వెరి బెస్ట్.




Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.