ఇప్పుడు మీరు చూడబోయే ప్రతి ఒక్క ఆర్ట్ కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ తో చేసినవే. సడన్ గా చూస్తే ఇవన్నీ నిజమైన పువ్వులు లానే సహజ సిద్ధంగా ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకుంటున్నట్టు ఉంటాయి కాని ఇవన్నీ తులసి గారి (80084 40469) చేతులలో రూపుదిద్దుకున్నవి. విజయవాడకు చెందిన తులసి గారు ఒక ఆర్కిటెక్.
ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఈ క్లే ఆర్ట్స్ కు సంబందించిన విషయాలు ఎక్కడో చూసి దాని మీద ఆసక్తి కలిగి ఈ రకమైన బొమ్మలు తయారుచేయడం స్టార్ట్ చేశారు. ఈ విద్యకు తనకెవ్వరూ గురువులు లేరు ఒక నిజమైన వస్తువును తనకెదురుగా పెట్టుకుని వాటిని చూస్తూ క్లే తో తయారుచేయడం నేర్చుకున్నారు. 8సంవత్సరాల నుండి సుధీర్ఘ ప్రయాణంలో ఇప్పటికి 500కు పైగా బొమ్మలు తయారుచేసి ఎంతోమంది ఇంటిని ప్రత్యేకంగా కనిపించేలా చేశారు. ఇవి చూడడానికి చాలా అందంగా, సహజంగా కనిపిస్తాయి కాని వీటిని తయారుచేయడానికి మూడు రోజుల నుండి పది రోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది.
Here are some of her best works: