నిన్నగాక మొన్న అయినట్టుంది సంక్రాంతి... అంతలోనే దసరా పండుగ వచ్చేసింది. వస్తూ వస్తూ మనకి సెలవలు కూడా తెచ్చింది. గురు.. మాకు ఇంకా సెలవలు ఇవ్వాలె అని బాధ పడకండి.. ఇస్తారు ఇస్తారు తొందర్లోనే ఇస్తారు... అయితే ఈ సెలవలకి మాత్రం మనం పిచ్చ పిచ్చ పనులు చేస్తూ టైం వేస్ట్ చేయకుండా... మంచి బచ్చాల్లా మన బామ్మా తాతయ్య వాళ్ళ ఊరు.. పల్లెటూరుకి... వెళ్దాము. మంచి జోష్ ఉంటుంది.. జోషే కాదు ఇంకా చాలా ఉంటాయి...
అనురాగాలు ఆప్యాయతలు అన్నా! సినిమాల్లో ఇవే మాటలు చెప్పి, చెప్పి సంపుతున్నారు.. మళ్ళి నువ్వు అవె మాటలు చెబుతున్నావ్ అయిన మన ఇళ్ళల్లో చూపెట్టారా ఇవి.. అని కోపం తెచ్చుకోకండి... చూపిస్తారు కానీ మిల్లి లీటర్లలో...పల్లెటూళ్ళ వాళ్ళు మాత్రం లీటర్లలో చూపిస్తుంటారు. సమజ్ అయ్యిందా..? అయితే జై కొట్టండి...!!

రుచికరమైన తిండి పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి అడ్డమాలిన ఆహారం కాకుండా మంచి హెల్త్ తో పాటు నోటికి అమృతంలా అనిపించే బూరెలు, గారెలు, జంతికలు, అరిసెలు, వడలు ఇలా తినటానికె కాదు. చెప్పటానికి కూడా టైం చాలనన్ని తినుబండరాలు ఉంటాయి.

ఆహ్లాదకరమయిన వాతావరణం దుమ్ము,ధూళి తో పీల్చడానికి సరైన గాలికూడా లేకుండా సిటీల్లో ఉంటున్న మనకి పల్లెటూరు వాతావరణం పెద్ద ఆస్తి...పీల్చటానికి స్వచ్ఛమైన గాలి, కళ్ళు తిప్పుకోలేనన్ని పచ్చని పైరు సోయాగాలు అబ్బా!.. ఎంతచెప్పినా తక్కువేనండి...

నో టెన్సన్స్ చక్కగా పడుకోవటం, సుష్టిగ భోజనం చేయటం, పొలాల వెంబడి నడవటం, ప్రతి విషయాన్నీ పాజిటివ్ గ తీసుకునే, ప్రతి మాటా పాజిటివ్ గా మాట్లాడే అక్కడి మనుషులతో మాట్లాడటం.. చాలండి ఈ జీవితానికి !!

ప్రతిదీ టైం కి తినటం, నిద్రపోవటం, ఊసులాడుకొవటం ఇలా ప్రతిదీ టైంకి జరిగిపోతుంది పల్లెల్లో... వాళ్ల లైఫ్ స్టైల్ నే మనకి వర్తింపచేసి అలవాటు చేస్తారు అక్కడి వాళ్లు...

కొత్త కొత్త పనులు నేర్చుకోవటం మనకి తెలియని విషయాలు చాలా తెలుస్తాయి, అలాగే మనకి రాని కొన్ని కొత్త పనులు కూడా... ఇక్కడ నేర్చుకోవటానికి చాలా ఉంటాయి, గౌరవాలు, విలువలు లాగా...

ఇవండి.. మీరు పల్లెటూరు గనుక వెలితే ఎక్స్పీరియన్స్ చేసేవి... ఇక అక్కడ పెరిగిన వాళ్ల లైఫ్ స్టైల్, అలాగే వాళ్ళలో బేసిక్ గా వుండే కొన్ని క్వాలిటీస్ కి సంబంధించిన ఆర్టికల్ మా దగ్గర మరొకటి ఉంది టైం ఉంటే దానిని కుడా ఒక చూపు చూడండి....