భారత దేశానికి అత్యంత ఎక్కువగా అవసరమయ్యే గ్యాస్, చమురు నిక్షేపాలు మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా గోదావరి(కేజీ బేసిన్) లో ఉన్నాయి. ఇప్పుడు మన వైజాగ్ లో కూడా అలాంటి నిక్షేపాలున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి(NIO) వారు చేసిన పరిశోధనలో కనుగొన్నారు. విశాఖపట్నం నుండి భీమునిపట్నం మధ్యలో ఒక్కొక్కటి 50 నుండి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ లోయలు ఉన్నాయి. భీమిలి ఉత్తర దిశలో మూడు లోయలు, విశాఖ పోర్టుకు సౌత్ లో మూడు లోయలున్నాయి.
NIO మరియు సింధు సంకల్ప్ వెసల్ కలిసి ఈ పరిశోధనలు చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ కు "విశాఖ సంకల్ప్" అని పేరు పెట్టారు. మొత్తం ఆరు నిక్షేపాలు ఒక్కొక్కటి 70కి.మీ వరకు విస్తరించి ఉన్నాయి. 1963లో ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ టీం మొదటిసారిగా కోస్తాంద్రలో ఖనిజ నిక్షేపాలున్నాయని గుర్తించారు. మళ్ళి 54 సంవత్సరాల తర్వాత వెసల్ తో మార్చి 2నుండి multi beam తో ఈ సర్వే చేపట్టారని శాస్త్రవేత్తలు మీడియాకు వివరించారు. ఈ రిసేర్చ్ లో పాల్గొన్న సింధు సంకల్ప్ 2008 నుండి ఇప్పటి వరకు 99 పరిశోధనలు జరిపితే 100వ పరిశోధన ఇక్కడ విజయవంతంగా నిక్షేపాలను కనుగొనడం విశేషం.
Source: Sakshi